• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మానసా దేవి అమ్మవారికి తొడుగులు వితరణ

KDP:  సిద్ధవటం మండలం కడప-చెన్నై జాతీయ రహదారి కనుమలోపల్లి సమీపాన వెలసిన శ్రీ మానసా దేవి అమ్మవారికి శుక్రవారం కడప పట్టణానికి చెందిన నారాయణ,రవికుమార్ కుటుంబ సభ్యులు రూ. 2 లక్షలు విలువైన తొడుగులు సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి విగ్రహ ప్రతిష్ట రోజు తొడుగులు సమర్పిస్తామని మొక్కుకున్నామన్నారు. అందుకు ఇవాళ అమ్మవారికి మొక్కులు చెల్లించామన్నారు.

February 27, 2026 / 07:12 PM IST

బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ వాయిదా

MNCL: క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్‌ను జిల్లా న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, సుమన్‌కు సంబంధించిన న్యాయవాదుల వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సోమవారానికి వాయిదా వేశారు.

February 27, 2026 / 07:12 PM IST

విద్యార్థులకు మెరుగైన వసతులు

MDCL: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంలో డాట్ల ఫౌండేషన్ కృషి అభినందనీయమని ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గుప్తా తెలిపారు. కౌకూర్ ZPHS పాఠశాలలో డాట్ల ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన రెండు అదనపు తరగతి గదులను శుక్రవారం ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో మేనేజింగ్ ట్రస్టీ పూర్ణిమ, ఎంఈవోలు మనోహర్, మురళికృష్ణమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

February 27, 2026 / 07:11 PM IST

‘స్త్రీనిధి బకాయిలు 100% పూర్తి చేయాలి’

PDPL: జిల్లాలో స్త్రీ నిధి బకాయిలను 100% రికవరీ చేయాలని డీఆర్‌డీవో కాళిందిని స్త్రీ నిధి సిబ్బందిని ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో అధికారులతో స్త్రీ నిధి రుణాలపై సమీక్ష నిర్వహించారు. మార్చి 5 లోపు రుణాల రికవరీ, రుణ ప్రణాళిక 100% పూర్తి చేయాలన్నారు. దీనితో సిబ్బంది వేతనాలు నిలిపివేసి, శాఖాపరమైన చర్యలు చేపడతామని తెలిపారు.

February 27, 2026 / 07:10 PM IST

స్కూల్ బస్సు, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు

MNCL: తాండూర్ మండల కేంద్రంలోని ఐబీ బ్రిడ్జి కింద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రేపల్లెవాడకు చెందిన సెయింట్ థెరీస్సా స్కూల్ బస్సు, బైకును ఢీకొనడంతో మనోహర్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉన్నారు. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ఆస్పత్రికి తరలించారు.

February 27, 2026 / 07:09 PM IST

రేపు నన్నయ వర్సిటీలో సైన్స్ డే వర్క్ షాప్

తూ.గో: జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో శనివారం ‘శాస్త్రజగతి-వికసిత భారత మహిళా ఉత్ప్రేరక జాగృతి’ అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ తెలిపారు. శుక్రవారం వర్సిటీలో దీనికి సంబంధించిన బ్రోచర్‌ను ఆమె ఆవిష్కరించారు. చార్టెడ్ అకౌంటెంట్ వి.వి.ఎస్. నారాయణ హాజరవుతారని వీసీ వెల్లడించారు.

February 27, 2026 / 07:09 PM IST

శ్మశాన వాటిక సమస్యను పరిష్కరించండి: BJP

NLR: బుచ్చి(M) రెడ్డిపాలెం గ్రామంలోని శ్మశాన వాటికను అభివృద్ధి చేయాలని బీజేపీ రూరల్ మండల ఉపాధ్యక్షులు పెంచలకృష్ణ ఆ పార్టీ నేతతో కలిసి ఎంపీడీవోకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. రహదారికి లోతట్టు ప్రాంతంలో శ్మశాన వాటిక ఉండడంతో చుట్టుపక్కల పొలాల నుంచి నీరు ఊరుతూ అంత్యక్రియలకు ఇబ్బందిగా ఉందన్నారు. శ్మశాన వాటికలో గ్రావెల్‌తో చదును చేయాలన్నారు.

February 27, 2026 / 07:06 PM IST

లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు

KNR: ఇల్లందకుంట మండలంలోని చిన్న కోమటిపల్లి శ్రీ స్వయంభు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, కమిటీ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 28న శ్రీ లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం, మార్చి 1న బండ్లు తిరుగుట, మార్చి 5న కుంభాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

February 27, 2026 / 07:06 PM IST

పోలీసు కుటుంబానికి చెక్కు అందజేత

PPM: జిల్లా పోలీసు శాఖలో ఎఎస్ఐగా పనిచేస్తూ ఇటీవల ఆనారోగ్యంతో మృతిచెందిన ఆర్.ఆదినారాయణ కుటుంబానికి ఎస్.బి.ఐ శాలరీ ప్యాకేజ్ కింద రూ.10 లక్షల చెక్కును ఆయన సతీమణికి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి శుక్రవారం అందజేశారు. జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పి.ఎస్.పిని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, ఎ.ఆర్.డీఎస్పీ పాల్గొన్నారు.

February 27, 2026 / 07:05 PM IST

‘కల్వర్టు నిర్మించి సమస్యను పరిష్కరిస్తాం’

MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ 3వ వార్డు పరిధిలోని సరస్వతీ నగర్ ఫేస్-2లో ఛైర్‌పర్సన్ కోనేటి పుష్పలత శుక్రవారం పర్యటించారు. వర్షాకాలంలో వాన నీటితో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆమె దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన సమస్యను ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే కల్వర్టు నిర్మించి శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 07:05 PM IST

‘కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలి’

ADB: మున్సిపల్ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని CPM పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. నూతన మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు. సకాలంలో వేతనాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరగా ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు.

February 27, 2026 / 07:02 PM IST

స్కూల్ పిల్లలను తీసుకువెళ్తున్న ఆటోలు బస్సులు తనిఖీ

AKP: స్కూల్ పిల్లలను తీసుకు వెళుతున్న బస్సులు, ఆటోలను శుక్రవారం ఎలమంచిలిలో మోటర్ వెహికల్ ఇన్స్‌స్పెక్టర్ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రికార్డులు లేనివారికి అపరాధ రుసుము విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

February 27, 2026 / 07:00 PM IST

ఎమ్మెల్యే రమణమూర్తి రేపటి పర్యటన వివరాలు

SKLM: నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి శనివారం ఉ. 7 గంటలకు నరసన్నపేట M కోమర్తి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీలో పాల్గొంటారు. అనంతరం ఉ. 8 కు నరసన్నపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో చెత్త సేకరణ కోసం రిక్షా సైకిళ్లను పంపిణీ చేస్తారు అని ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

February 27, 2026 / 07:00 PM IST

మార్చి 3న కనకమహాలక్ష్మి ఆలయం మూసివేత

VSP: మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణం పురస్కరించుకుని విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు మూసివేస్తున్నట్లు దేవస్థానం ప్రకటించింది. గ్రహణం కారణంగా మధ్యాహ్నం పంచామృతాభిషేకం ముగిసిన తర్వాత దర్శనాలు నిలిపివేస్తారు. తిరిగి రాత్రి గ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించి దర్శనాలకు అనుమతిస్తారు.

February 27, 2026 / 07:00 PM IST

నర్సింగ్ రావుపల్లిలో ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమం

KMR: నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లిలో శుక్రవారం ‘డ్రైడే-ఫ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ అంజలీదేవి ఆధ్వర్యంలో గ్రామంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా చెట్లకు నీరు పోశారు. గ్రామాభివృద్ధి, స్వచ్ఛత కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.

February 27, 2026 / 07:00 PM IST