• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శ్రామిక మహిళలకు సన్మానం

NLG: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నకిరేకల్‌లోని డీటీఎఫ్ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం శ్రామిక మహిళల సన్మాన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, మున్సిపల్ కౌన్సిలర్ గాజుల సుకన్య-శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి వారిని సన్మానించారు.

March 8, 2026 / 02:25 PM IST

గాంధీ విగ్రహంపై దుష్ప్రచారం: రేవంత్

TG: గాంధీ విగ్రహం కట్టడానికి రూ.500 కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని CM రేవంత్ మండిపడ్డారు. గాంధీ విగ్రహానికి రూ.70 కోట్లే ఖర్చు చేస్తున్నామని.. గాంధీ విగ్రహం దగ్గర విజ్ఞాన కేంద్రానికి రూ.100 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ మాత్రమే కాదని.. అవకాశాలు కూడా ఇస్తామన్నారు. నెట్టింటిలో అవాస్తవాల ప్రచారంపై ఫిర్యాదులకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

March 8, 2026 / 02:24 PM IST

అలాంటి వాళ్ల ఆటలు సాగనివ్వను: సీఎం చంద్రబాబు

AP: మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గత పాలకులు బ్లేడ్ బ్యాచ్, గంజాయ్ బ్యాచ్‌లను తయారు చేశారు. అలాంటి వాళ్ల ఆటలు సాగనివ్వను. 30 ఏళ్ల క్రితం నేను హెరిటేజ్ కంపెనీ స్థాపించాను. నా భార్య, కోడలిని పారిశ్రామికవేత్తలుగా మార్చాను. ప్రతి ఇంట్లోని మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నది నా ఆలోచన’ అని ఆయన పేర్కొన్నారు.

March 8, 2026 / 02:23 PM IST

పొలం పనులు చేస్తుండగా రైతుకు విద్యుత్ షాక్

MNCL: జైపూర్ మండలం వేలాలకి చెందిన బండి నర్సయ్య అనే రైతు పొలం పనులకు వెళ్లగా ప్రమాదవశాత్తూ కరెంట్ తీగలకు తగిలి కరెంట్ షాక్‌కు గురయ్యాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్ చెయ్యగా భీమారం 108 సిబ్బంది ఈఎంటి రమేశ్, పైలట్ సిరాజోద్దీన్ అక్కడికి చేరుకుని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

March 8, 2026 / 02:22 PM IST

‘వడ్డెర కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి’

NRML: వడ్డెర కార్పొరేషన్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ముధోల్ ఎమ్మెల్యే రామారావుకు ఆ సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డెర కుల అభివృద్ధికి రూ. 1000 కోట్ల నిధులను కేటాయించాలని వినతిపత్రం అందజేశారు.

March 8, 2026 / 02:22 PM IST

మహిళా పోలీసులకి సన్మానం..

SDPT: హుస్నాబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మహిళా కానిస్టేబుల్స్‌కి ఎస్సై లక్ష్మారెడ్డి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలలో మహిళలు ముందుకు నడవాలని తెలిపారు. అలాగే జిల్లాలో మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

March 8, 2026 / 02:20 PM IST

ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలి: ఎమ్మెల్యే

ATP: గుత్తిలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పాల్గొన్నారు. ముందుగా మహిళలతో కలిసి కేక్‌ను కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు. కూటమి ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం మహిళలకు ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.

March 8, 2026 / 02:20 PM IST

కామవరపుకోటలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

ELR: కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ ప్రిన్సిపల్ మల్లేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. అలాగే, మహిళలు అన్ని రంగాలలోనూ రాణించాలని ఆయన సూచించారు.

March 8, 2026 / 02:20 PM IST

దవాఖానాలో HPV వ్యాక్సిన్ కార్యక్రమం షురూ

VKB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా సిబ్బందిని మున్సిపల్ ఛైర్మన్ నందారం ప్రశాంత్ సన్మానించారు. అనంతరం HPV వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రవీందర్ యాదవ్, వైస్ ఛైర్మెన్ శంకర్ నాయక్, డా.సాకెత్, మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 02:20 PM IST

PJR నగర్‌లో సంత్ శిరోమణి భగత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు

RR: సంత్ శిరోమణి భగత్ గురు రావిదాస్ మహారాజ్ జయంతి సందర్భంగా పి.జే.ఆర్ నగర్‌లో కమిటీ సభ్యులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆల్విన్ కాలనీ 124 డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రావిదాస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. మహారాజ్ చేసిన సామాజిక సంస్కరణలు, ఆధ్యాత్మిక సేవలను ఈ సందర్భంగా కొనియాడారు.

March 8, 2026 / 02:18 PM IST

రిమ్స్ ఆస్పత్రిలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం

ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ రిమ్స్‌లో HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బండారి అనూష, DMHO నరేందర్ రాథోడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 8, 2026 / 02:17 PM IST

HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన కలెక్టర్

KMM: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. కౌమార దశలోని బాలికలకు ఈ టీకా ఇవ్వడం ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను సమర్థవంతంగా నివారించవచ్చని ఆయన తెలిపారు. తల్లిదండ్రుల ఆమోదంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ టీకా ఉచితంగా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

March 8, 2026 / 02:15 PM IST

దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: మండిపల్లి

అన్నమయ్య: గాలివీడు మండలం పందికుంట గ్రామం వెంకటాపురంలో నూతనంగా నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం దేవాలయాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటుందని తెలిపారు.

March 8, 2026 / 02:15 PM IST

టాక్ ఆఫ్ ది టౌన్‌గా కమల్ హాసన్ రెమ్యూనరేషన్!

‘కల్కి 2898 AD’ సినిమా కోసం కమల్ హాసన్ అందుకున్న పారితోషికం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. కేవలం 10 రోజుల కాల్‌షీట్స్ కేటాయించినందుకు గాను నిర్మాత అశ్వినీదత్ ఆయనకు రూ. 150 కోట్లు ఇచ్చినట్లు సమాచారం. అంటే రోజుకు దాదాపు రూ. 15 కోట్లు అన్నమాట. భారతీయ సినీ చరిత్రలో ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం ఇదే మొదటిసారి అని సినీవర్గాలు చెబుతున్నాయి.

March 8, 2026 / 02:15 PM IST

వారందరికీ తల్లికి వందనం ఇస్తాం: చంద్రబాబు

AP: రాష్ట్రంలో జనాభా తగ్గిపోతుండటం ఆందోళన కలిగించే విషయమని CM చంద్రబాబు అన్నారు. ‘జనాభా పెరుగుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తాం. మహిళలు స్వయం బ్రాండ్ మీదే ఉత్పత్తులు తయారు చేయాలి. అవే ఉపయోగించాలి. దీనికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తా. మీ ఆలోచనలతో ఈ బ్రాండ్‌ను మరింత అభివృద్ధి చేయాలి’ అని సూచించారు.

March 8, 2026 / 02:14 PM IST