• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండిలా!

కొన్ని చిట్కాలతో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. విటమిన్లు (A, C, E), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న క్యారెట్లు, ఆకుకూరలు, చేపలు వంటివి ఆహారంలో చేర్చుకోవాలి. స్క్రీన్ చూసేటప్పుడు ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలి. ఎండలో వెళ్లేటప్పుడు UV ప్రొటెక్షన్ ఉన్న గ్లాసెస్ ధరించాలి. కళ్లకు విశ్రాంతి కోసం రోజుకు కనీసం 7-8 గంటలు నిద్రపోవాలి.

March 8, 2026 / 02:07 PM IST

చెన్నై-బెంగళూరు రహదారిపై కారు బోల్తా

CTR: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఆదివారం కారు బోల్తా కొట్టింది. పలమనేరు మండలం గాంధీనగర్ సమీపంలో కారు అదుపు తప్పిన కారు 30 అడుగులు ఎగిరి పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అదృష్టవశాత్తూ గాయాలు లేకుండా బయటపడ్డారు. పెద్ద ప్రమాదం అయినప్పటికీ ఎవరికి కూడా ఎటువంటి గాయాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

March 8, 2026 / 02:06 PM IST

‘పశుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయాలి’

విశాఖపట్నం శివాజీ పాలెంలోని శివాజీ పార్క్‌లో ఆదివారం నిర్వహించిన ఆనంద ఆదివారం కార్యక్రమంలో GVMC అదనపు కమిషనర్ పీ. నల్లనయ్య పాల్గొన్నారు. ప్రతి పార్క్‌లో, ప్రతి ఇంటి వద్ద పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. గ్రీన్ క్లైమేట్ టీం NGO ఆధ్వర్యంలో పిచ్చుకల కోసం చెట్లకు ధాన్యపు కంకులు కట్టి వేలాడదీయాలని కోరారు.

March 8, 2026 / 02:06 PM IST

‘ఎడపల్లిలో సమస్యలను పరిష్కరించండి’

NZB: ఎడపల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మచ్చుకూర్ గంగాధర్ ఆదివారం తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని కలిశారు. గ్రామపంచాయతీలో జూనియర్ అసిస్టెంట్, బిల్ కలెక్టర్ లేకపోవడంతో ఇబ్బందిగా ఉందని, గ్రామంలోని పలు సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ డైరెక్టర్ బొబ్బిలి శ్రీనివాస్, మస్తాన్, నవీన్ పాల్గొన్నారు.

March 8, 2026 / 02:05 PM IST

మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి

MLG: బంజారాహిల్స్‌లోని కొమురం భీం ఆదివాసి భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు.

March 8, 2026 / 02:04 PM IST

బాన్సువాడలో HPV వ్యాక్సినేషన్ ప్రారంభం

KMR: బాన్సువాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఆదివారం HPV వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్ పర్సన్ కాసుల విజయ, ఆసుపత్రి సమన్వయకర్త డా. విజయభాస్కర్‌తో కలిసి ప్రారంభించారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2గంగలల వరకు 14 ఏళ్లు బాలికలకు HPV వ్యాక్సినేషన్ అందించనున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

March 8, 2026 / 02:04 PM IST

షాపింగ్ మాల్‌లో సందడి చేసిన సినీ హీరోయిన్

SRPT: సూర్యాపేట పట్టణంలోని ప్రముఖ వివాహ షాపింగ్ మాల్‌లో ఆదివారం సినీ తార నిధి అగర్వాల్ సందడి చేశారు. ఆమె మాల్‌ను సందర్శించడంతో అభిమానులు, సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరి ఆమెను చూడడానికి ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మాల్ నిర్వాహకులు నిధి అగర్వాల్‌‌కు స్వాగతం పలికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అభిమానులతో కలిసి ఫోటోలు దిగుతూ ఆమె కొంత సమయం గడిపారు.

March 8, 2026 / 02:02 PM IST

’14 – 15 ఏళ్ల బాలికలకు హెచ్.పి.వి వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలి’

NZB: గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిరోధం కోసం ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న హెచ్.పి.వి వ్యాక్సిన్‌ను 14-15 సంవత్సరాల మధ్య వయసు కలిగిన బాలికలు అందరికీ తప్పనిసరిగా ఇప్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి తల్లిదండ్రులకు సూచించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం హెచ్.పి.వి వ్యాక్సిన్ ప్రారంభించారు.

March 8, 2026 / 02:02 PM IST

‘HPV టీకాలను సద్వినియోగం చేసుకోవాలి’

SRPT: గర్భాశయ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్త చర్యగా అందించే HPV టీకాలను చేసుకోవాలని సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మల్ కుమార్ అన్నారు. ఆదివారం తుంగతుర్తిలోని ఏరియా హాస్పిటల్‌లో టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. 14 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలకు విధిగా ఈ టీకాలను వేయించాలన్నారు.

March 8, 2026 / 02:01 PM IST

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు.!

విజయనగరం జిల్లాకు చెందిన వెంపడపు గణేష్, బొబ్బిలి(మం) పారాది గ్రామానికి చెందిన అల్లాడ వెంకట రమణ వారి కుటుంబలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వీరికి జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మి పార్టలో చేరామని తెలిపారు.

March 8, 2026 / 02:01 PM IST

ములుమూడి బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నెల్లూరు రూరల్ ములుమూడి గ్రామంలో రూ.42.50 లక్షలతో ములుమూడి కలుజు మీద బ్రిడ్జి పనులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు లేని వేళ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

March 8, 2026 / 02:00 PM IST

భార్య భర్తలపై దాడి

అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలం బాపనవారిపల్లిలో ఆదివారం ఉదయం భార్యాభర్తలపై దాడి జరిగింది. నరసింహులు, మమత దంపతులు సర్వే నంబర్ 357లో ఇల్లు నిర్మాణానికి గుంట తీయిస్తుండగా నజీర్ కుటుంబసభ్యులు వచ్చి వాగ్వాదానికి దిగినట్లు బాధితులు తెలిపారు. అనంతరం దాడి చేసి గాయపరిచినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపైబ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు.

March 8, 2026 / 02:00 PM IST

కూటమి ప్రభుత్వ హామీలన్నీ మోసాలే: ఉషశ్రీ చరణ్

సత్యసాయి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలుపుతూనే కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500, 50 ఏళ్లకే పింఛన్ వంటి పథకాల్లో మహిళలకు వేల కోట్ల రూపాయలు బాకీ పడ్డారని ఆరోపించారు.

March 8, 2026 / 02:00 PM IST

గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది ప్రతి ఒక్కరి బాధ్యత

NRPT: గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేది ప్రతి ఒక్కరి బాధ్యత అని మంది పల్లి సర్పంచ్ సురేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 99 ప్రజా రోజుల ప్రణాళికలో భాగంగా ధన్వాడ మండల కేంద్రంగలో పరిశుభ్రత, తాగునీరు, డ్రైనేజీ శుభ్రపరిచే వంటి అంశాలపై పంచాయతీ కార్యదర్శి జ్యోతి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్, రామకృష్ణారెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 8, 2026 / 02:00 PM IST

మాజీ మంత్రిని కలిసిన మాజీ సర్పంచ్

RR: ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని శంకర్‌పల్లి మాజీ సర్పంచ్ బేసోల్లా శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బొకె అందజేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ పట్టిష్టతకు కృషి చేయాలని శ్రీధర్‌కు ఎమ్మెల్యే సూచించారు.

March 8, 2026 / 02:00 PM IST