SRPT: మఠంపల్లి మండలంలోని మంచ్య తండా నూతన సర్పంచ్‌గా ఎన్నికైన మలోత్ భద్రమ్మ ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం ముగిసిన ఈ శిక్షణలో భాగంగా డీఎల్‌పీవో చేతుల మీదుగా ఆమె శిక్షణ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా భద్రమ్మ మాట్లాడుతూ.. శిక్షణలో నేర్చుకున్న అంశాలతో గ్రామ పంచాయతీ పాలనను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.
JGL: కోరుట్ల పట్టణం కల్లూరు రోడ్డుకు సమీపంలో కొనసాగుతున్న రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా మొరం తరలిస్తున్న టిప్పర్ వాహనం శుక్రవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో వాహనం వేగంగా మలుపు తిరుగుతుండగా నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. వాహనం దెబ్బతినడంతో పనులు కొంతసేపు నిలిచిపోయాయి.
మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల ముగిశాయి. ప్రస్తుతం నూతన కార్యవర్గం నెలకొనే సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సీనియర్ నేత గుండా సంతోష్‌ను నియమించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వెలువడుతున్నాయి. ఈ మేరకు చాలామంది ఆయనను ప్రతిపాదిస్తూ బీజేపీ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.
నిర్మల్ మున్సిపాలిటీలో కొత్త పాలకవర్గ తొలి సమావేశం శుక్రవారం జరిగింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ అప్పల కావ్య, వైస్ ఛైర్మన్ అప్పల గణేశ్ చక్రవర్తి నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో 42 వార్డుల కౌన్సిలర్లు పాల్గొని పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, మున్సిపాలిటీ కార్యకలాపాలపై సమగ్రంగా చర్చించారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం వల్ల సమావేశం సమర్థవంతంగా సాగింది.
ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డి పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఒంగోలు సమీపంలోని భగీరథ పాలిమర్స్ పరిశ్రమను సందర్శించారు. భారత ప్రభుత్వ సంస్థ BIS ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎక్స్పోజర్ విజిట్లో విద్యార్థులు నీటి సరఫరాకు ఉపయోగించే HDPE పైపుల తయారీ విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
GNTR: చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న పెదకాకాని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్ లీలా కుమార్ తెలిపారు.ఆ రోజు ఉదయం 5:30 నుంచి 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనాలు,ఆర్జిత సేవలకు అనుమతి ఉంటుంది.గ్రహణం ముగిశాక, మార్చి 4న ఉదయం ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం 7గంటల నుంచి భక్తులను తిరిగి అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు.
MDK: టేక్మాల్(మం) సంగ్య తండాలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి సర్పంచ్ సక్రు, కాంగ్రెస్ నాయకులు భూమిపూజ చేశారు. ఉపాధి హామీ పథకం(MGNREGS) కింద మంజూరైన రూ.20 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు.
KRNL: 2025-26 రబీ సీజన్‌కు కర్నూలు జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మీ శుక్రవారం తెలిపారు. జిల్లాకు 24,580 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయగా, ప్రస్తుతం 25,635 మెట్రిక్ టన్నుల నిల్వ ఉందన్నారు. నానో యూరియా, నానో డీఏపీ కూడా అందుబాటులో ఉండటంతో రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్కి శుక్రవారం చిరుధాన్యాలు తరలిరాగా, ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా మక్కలు (బిల్టీ) రూ. 1,905 ధర వచ్చింది. అలాగే, సూక పల్లికాయకు రూ. 10వేలు, పచ్చి పల్లికాయకు రూ. 5,400 ధర వచ్చింది. పసుపు క్వింటాకి కొత్తది రూ. 11,151 ధర వస్తే.. నం. 5 రకం మిర్చి రూ. 20,200, దీపిక మిర్చి రూ. 20వేలు ధర పలికాయని వ్యాపారస్థులు తెలిపారు.
TG: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సౌందర్ రాజన్ చనిపోయారు. చిలుకూరులోని నివాసంలో సౌందర్ రాజన్ తుదిశ్వాస విడిచారు. చిలుకూరు బాలాజీ ఆలయ అభివృద్ధిలో, అక్కడి సంప్రదాయాలను కాపాడటంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైనది. ఆయన మరణం భక్తులకు, ఆలయ కుటుంబానికి తీరని లోటు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరుగుతుందని నగర కమిషనర్ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో 15 అజెండాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్లు కో ఆప్షన్ నెంబర్లు హాజరుకావాలని కోరారు.
TPT: రేణిగుంట మేజర్ పంచాయతీలో జీతాలు రాక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవక ప్రైవేట్ ఫంక్షన్ల వద్ద చిన్నపాటి పనులు చేస్తూ అక్కడే అన్నం తింటున్నామని వాపోతున్నారు. జీతం వస్తేనే కుటుంబాలు నడుస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ధర్నాలు నిర్వహించినా అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు.
W.G: సాగునీటి ఎద్దడి లేకుండా, ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరానికీ నీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ సీహెచ్ వెంకట్ నారాయణ రైతులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం ఎల్.బి.చర్లలో రైతులతో కలిసి కాలువలు, పంట పొలాలను ఆయన పరిశీలించారు. సాగునీటి వృధాను అరికట్టేందుకు, నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా కాలువల పూడికతీత పనులు ఎప్పటికప్పుడు చేయిస్తున్నామని తెలిపారు.
KDP: బ్రహ్మంగారి మఠంలో నిర్వహించే స్వామివారి మాస కళ్యాణానికి మిర్యాలగూడకు చెందిన రామాచారి దంపతులు శుక్రవారం రూ.1,00,116 అందజేశారు. నూతన పీఠాధిపతి వెంకటాద్రి స్వాములవారి ఆదేశాలతో మఠం మేనేజర్ ఈశ్వర చారి వారికి స్వామి వారి దర్శన భాగ్యం కల్పించి, శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతినెల శుద్ధ ద్వాదశి రోజున స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు.