SDPT: కోహెడ మండలం గుండారెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొద్దిరోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరాను సర్పంచ్ పిల్లి బాబు పునరుద్ధరించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో బోరు పాడై విద్యార్థులు, కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తక్షణమే మరమ్మతులు చేయించారు. సకాలంలో స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్థులు పంచాయతీకి కృతజ్ఞతలు తెలిపారు.
KRNL: ఆదోనిలో విక్టరీపేటకు చెందిన షేక్ గౌసియా అనారోగ్యంతో కర్నూలు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆమె పార్థివ దేహానికి టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గుడిసె శ్రీరాములు, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుడిసె కృష్ణమ్మ సేవా సమితి తరఫున ఖర్చుల కోసం కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.
NLG: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేటు ఆసుపత్రి వారు సంయుక్తంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
కోనసీమ: రాయవరం మండలం, వెంటూరు గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ దండు మారెమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటూరులో మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
కోనసీమ: రాయవరం మండలం, వెంటూరు గ్రామ దేవత శ్రీ దండు మారెమ్మను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు దర్శించుకున్నారు. శ్రీ దండు మారెమ్మ జాతర సందర్భంగా ఆదివారం ఎమ్మెల్యే వేగుళ్ళ వెంటూరులో మారెమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సంధర్బంగా ఆ తల్లిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరం మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.
KMM: భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రజా హృదయ సామ్రాజ్యానికే అధిపతి అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆదివారం ఖమ్మం నగరంలో జరిగిన వాజ్‌పేయి శతజయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అటల్‌జీ నాయకత్వంలో పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఈ సందర్భంగా ‘అటల్‌జీకి అక్షర నిరాజనం’ కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు.
JN: స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలో ఆదివారం మాజీ MLA తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత MLA కడియం శ్రీహరి స్పీకర్ విచారణలో చూపిన ఫోటోలను AI ద్వారా మార్చారని, BRS పార్టీలో ఉన్నానని అబద్ధాలు చెబుతున్నారని అనడం సిగ్గుచేటు అన్నారు. MLA కడియం పదవికి వెంటనే రాజీనామా చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి, సదాశిపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 400 నిరుపేద కుటుంబాలకు రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నిత్యావసర సరుకులు ఆదివారం పంపిణీ చేశారు. ఖలీల్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. పేదలు సంతోషంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ సహాయం అందించారు.
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం దుర్ఘటన నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు పాలకొల్లులో బాణసంచా తయారీ, విక్రయ కేంద్రాల్లో ఆదివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. రూరల్ సీఐ గుత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎక్స్‌ప్లోజివ్ యాక్ట్ నిబంధనల అమలును పరిశీలించారు. తయారీ కేంద్రాలు జనావాసాలకు దూరంగా ఉన్నాయా లేదా అని తనిఖీ చేసి, నిల్వలను రికార్డులతో సరిపోల్చారు.
SRD: ఝరాసంగం మండలం బర్దీపూర్ గ్రామంలో తాగునీటి పైప్లాన్ మరమ్మతు పనులను సర్పంచ్ రాజు ఆదివారం పర్యవేక్షించారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తుగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సరఫరా అందించడమే తమ లక్ష్యమని, నీటి సమస్య తలెత్తకుండా నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా సర్పంచ్ స్పష్టం చేశారు.
KRNL: సీఎంఆర్ఎఫ్ చెక్కులు పేదలకు వరమని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. ఆదివారం పాములపాడు మండలంలోని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. భాను ముక్కల రాజుకు రూ.38,495, వేంపెంట పెద్ద సుబ్బమ్మకు రూ.1,22,228, ఎర్ర గూడూరు శివుడికి రూ.72,656 మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
KMR: మద్నూర్ మండలం ఎంబురా రాచన్న దేవాలయం నుండి కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయానికి జుక్కల్ నియోజకవర్గంలో భక్తులు మహా పాదయాత్రగా వెళ్లారు. ఈరోజు శ్రీశ్రీశ్రీ జగద్గురు రేణుకాచార్య జయంతి సందర్భంగా, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కొలనుపాక శ్రీ సోమేశ్వర ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాదయాత్ర కమిటీ సభ్యులు ఎమ్మెల్యేని సన్మానించారు.
MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో గత వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా కోతకు గురైన రోడ్డు సమస్యపై “కోతకు గురైన రోడ్డు… స్పందించని అధికారులు..” అనే వార్త ఇటీవల HIT TV లో ప్రచురితమైంది. ఈ వార్తపై గ్రామ పాలకవర్గం స్పందించారు. సమస్యపై సమీక్షించి ఆదివారం పారిశ్యుద్ద సిబ్బందితో రోడ్డు కోతకు గురైన చోట గుంతలను పూడ్చివేశారు.
PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన గంగపుత్రులు ఆదివారం ధర్మపురి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి శ్రీ గంగమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. మార్చి 12, 14 తేదీల్లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని కోరారు. గ్రామంలో వేడుకల కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
CTR: ఈనెల 3న చంద్రగ్రహణం కారణంగా బోయకొండ గంగమ్మ ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో ఏకాంబరం ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. పండితుల సూచనల మేరకు ఆరోజు ఉదయం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం ఉంటుందన్నారు. అనంతరం ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. 4వ తేదీన ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి అభిషేకం అనంతరం దర్శనాలు ప్రారంభిస్తామన్నారు.