MHBD: సిరోల్ మండలం కంది కొండ గ్రామ శివారులో పెద్ద పులి సంచరించిన ఆనవాళ్లు కనిపించాయి. శనివారం పంటచేలల్లో గుర్తించిన పులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు పరిశీలించారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని గ్రామస్తులకు సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
KMM: నగర పాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య అధికారులను ఆదేశించారు. శనివారం 17,35 డివిజన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి సందర్శించి పారిశుద్ధ్యం, వైద్య సేవలపై ఆరా తీశారు. కమిషనర్ వెంట మున్సిపాలిటీ అధికారులు ఉన్నారు.
కోనసీమ: కూటమి పాలనలో రహదారుల అభివృద్ధి వేగవంతంగా జరుగుతుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో గుంతల రోడ్లతో ప్రజలు అనేక కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. శనివారం ఆయన రూ.3 కోట్లతో నిర్మిస్తున్న వాడపాలెం రహదారి పనులను ప్రభుత్వ అధికారులతో కలిసి పరిశీలించారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.
VKB: కుల్కచర్ల మండల కేంద్రంలోని రెండు పరీక్షా కేంద్రాల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఆంగ్ల పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రామలింగేశ్వర జూనియర్ కళాశాల వివేకానంద జూనియర్ కళాశాలల్లో పరీక్షలు నిర్వహించారు. వివేకానంద కళాశాలలో 204 మంది విద్యార్థులకు గాను 197 మంది హాజరు కాగా, ఏడుగురు గైర్హాజరయ్యారు.
SRCL: ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా శనివారం వేములవాడ పట్టణంలో లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా టైలర్ అధ్యక్షులు సింగర్ శ్రీను మాట్లాడుతూ.. టైలర్స్ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాకి చెందిన విలియమ్స్ 1845లో కుట్టు మిషన్ రూపొందించి ఫిబ్రవరి 28న ప్రపంచానికి అంకితమిచ్చాడని ఆయన పేర్కొన్నారు.
ATP: రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామంలో రైతు సాగులు చేసిన అరటి పంటలను VHO గిరిబాబు పరిశీలించారు. ఫ్రూట్స్ కవర్ తొడిగిన అరటి గెలలను పరిశీలించిన VHO అరటి రైతులకు పలు సూచనలు చేశారు. ఫ్రూట్స్ కవర్లకు 50 శాతం సబ్సిడీ ఉన్నట్లు ఆయన రైతులకు తెలిపారు. వేసవి సమీపిస్తున్న దృష్ట్యా అరటి పంటలపై రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎరువులు తగిన మోతాదులో వాడాలన్నారు.
HYDలో హోం శాఖ తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ CV ఆనంద్ నేడు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం నిర్వహించి పలు అంశాల పురోగతిని సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద నిధుల 100% వినియోగం, ప్రైవేట్ భవనాల నుంచి ప్రభుత్వ భవనాలకు కార్యాలయాల మార్పు, ఫీల్డ్ విజిట్లు, ఈ-ఆఫీస్ అమలు వంటి విషయాలను గత డిసెంబర్‌లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు పరిశీలించారు.
NLR: గుడ్లూరు తహసీల్దార్ కార్యాలయంపై శనివారం మధ్యాహ్నం ACB అధికారులు దాడి చేశారు. గుడ్లూరు-2 సచివాలయానికి చెందిన వీఆర్వో చలమారెడ్డి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. మాధవరెడ్డి అనే రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారుల దాడి చేశారు. అధికారుల విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలను మర్యాద పూర్వకంగా కలిశారు. తన కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహానికి రావాల్సిందిగా షర్మిలను భట్టి విక్రమార్క స్వయంగా ఆహ్వానించారు. వివాహ శుభలేఖను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా YSRతో భట్టికి ఉన్న సాన్నిహిత్యాన్ని పంచుకున్నారు.
MNCL: సిద్దిపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెల్లంపల్లి 28వ వార్డుకు చెందిన సింగరేణి కార్మికుడు ఎండి రఫీ(48) శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో చదువుకుంటున్న కుమారుడి పేరేంట్ మీటింగ్ కోసం రఫీ తన భార్యతో కలిసి వెళ్లాడు. రఫీ తిరిగి వస్తుండగా ట్రాలీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి భార్యకు గాయాలయ్యాయి.
NZB: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, నిజామాబాద్ నేత బస్వా లక్ష్మీనరసయ్య మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా వేస్తామని ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు ఎందుకు వేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై మార్చి 3వ తేదీన రైతు దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు.
BPT: అద్దంకి మండలం సింగరకొండలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. తిరునాళ్ల సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
HYD: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనలతో పర్యాటక శాఖ ద్వారా రూ.4 కోట్ల 21 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం నాలుగు అంతస్తుల ప్రసాద మండపం నిర్మాణం జరుగుతోందని, జూన్ – జులై నెలల్లోగా పనులు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
SRPT: డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, డ్రైవర్ కంటి చూపు బాగా ఉంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతాడని సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ అన్నారు. అరైవ్ అలైవ్ రెండో విడత అవగాహన కార్యక్రమంలో భాగంగా వివిధ రకాల వాహన డ్రైవర్లకు శనివారం సూర్యాపేటలో పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక రవి మహాల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభిచారు.
KDP: మార్చి 1న కడపలో గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై కీలక సమావేశం జరగనుంది. సమావేశ ఏర్పాట్లను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ తదితరులు పరిశీలించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలు, కృష్ణా జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.