• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

వినతులు స్వీకరించిన దెందులూరు ఎమ్మెల్యే

ELR: పెదవేగి(మం) దుగ్గిరాల టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అలాగే వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

February 25, 2026 / 02:38 PM IST

అంగన్వాడీ భవనాలు మంజూరు చేయండి: పరిటాల సునీత

ATP: రాప్తాడు నియోజకవర్గంలో 55 నూతన అంగన్వాడీ భవనాలు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు. అసంపూర్తిగా ఉన్న 32 భవనాలను పూర్తి చేయడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల డిమాండ్లను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సభలో వివరించారు.

February 25, 2026 / 02:38 PM IST

నిందితులను కఠినంగా శిక్షించాలని ప్లకార్డుల ప్రదర్శన

HYD: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలోని మల్లన్న జాతరలో రెండు నెలల చిన్నారి మృతి బాధాకరం అని ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారి వరకు ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.

February 25, 2026 / 02:38 PM IST

రేషన్ కార్డుల అందజేత

NZB: డిచ్‌పల్లి మండలం కమలాపూర్లో సర్పంచ్ ఋత్విజా రత్నం నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామంలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కర్నోల్ల సుజాత భూపతి, పంచాయతీ సిబ్బంది కొప్పెర రాకేశ్, సిర్నాపల్లి గంగాధర్, గంగారాం, బక్కన్న తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:38 PM IST

షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: శృంగవరపుకోట పోలీస్ స్టేషన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు అందుబాటు ధరల్లో, అత్యాధునిక వస్త్ర శ్రేణిని, నగలను ఒకే చోట అందించేందుకు ఇలాంటి మాల్స్ రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

February 25, 2026 / 02:36 PM IST

మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరణ

RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మున్సిపల్ ఛైర్మన్‌గా సాత ప్రవీణ్ కుమార్, వైస్ ఛైర్ పర్సన్‌గా జూలకంటి శ్వేతా పాండురంగరెడ్డి మునిసిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మునిసిపల్ అభిరుద్దికి తమ సహకారం అందచేస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 02:35 PM IST

ఈనెల 28వ తేదీన జాబ్ మేళా: కలెక్టర్

కృష్ణా: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు గన్నవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ 28వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాలాజీ బుధవారం తెలిపారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు పాల్గొని, నిరుద్యోగులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తాయని అన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 02:35 PM IST

డివిజన్లో పర్యటించిన కార్పొరేటర్ మధుచంద్

BDK: 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్ పాల్వంచ గట్టాయిగూడెం లోని గాయత్రి నగర్ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్యం, మంచినీటి సరఫరా, స్ట్రీట్ లైటింగ్ వంటి మౌలిక వసతుల పరిస్థితిని పరిశీలించి, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

February 25, 2026 / 02:34 PM IST

మహిళల్లో క్యాన్సర్ నివారణకు ఉచితంగా వ్యాక్సిన్

HYD: మహిళల్లో రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా తరహాలోనే వీటికి ఉచిత వ్యాక్సిన్ అందించనుంది. గ్రేటర్లో దాదాపు 56 లక్షల మంది మహిళలు ఉండగా ఇందులో 14- 26 ఏళ్ల వయసు వారు 12 లక్షల మందికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సమీప PHCలలో 6 నెలల వ్యవధిలో మూడు డోసుల టీకాలను ఉచితంగా వేయించుకోవచ్చని అన్నారు.

February 25, 2026 / 02:32 PM IST

ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో వైఎస్ జగన్

KDP: వేంపల్లి(మం) నందిపల్లెలోని నూతనంగా నిర్మించిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో బుధవారం మాజీ సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన పులివెందులలోని తన నివాసానికి చేరుకొని మధ్యాహ్నం 2 గంటల వరకు తన నివాసంలో విశ్రాంతి తీసుకోనున్నారు.

February 25, 2026 / 02:31 PM IST

BREAKING: యూట్యూబర్ అన్వేష్‌కు బిగ్ షాక్

TG: యూట్యూబర్ అన్వేష్‌కు HYDలోని పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా తనకు 2 ఇన్‌స్టా, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయంటూ అన్వేష్ మరో వీడియోను విడుదల చేశారు. ఈ క్రమంలో ఇన్‌స్టా, యూట్యూబ్‌కు పోలీసులు లేఖ రాయనున్నారు. కాగా అసభ్యకరమైన పదజాలం వాడుతూ అన్వేష్ వీడియో చేయడంతో అతని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే.

February 25, 2026 / 02:31 PM IST

వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన

NLR: చేజర్ల మండలం ఏటూరు, వావిలేరులో మండల వ్యవసాయ అధికారి పీఎస్ హిమబిందు ఆధ్వర్యంలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు ప్రయోజనాలను వివరించారు. గ్రామాల్లో సాగులో ఉన్న వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు అందించారు. సాయిల్ హెల్త్ కార్డు అవసరాన్ని రైతులకు తెలియజేశారు.

February 25, 2026 / 02:31 PM IST

చోరీకి గురైన మొబైల్ ఫోన్లను అందజేసిన ఎస్పీ

SRCL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా బుధవారం ఏర్పాటు చేశారు. జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి పోయిన, చోరీకి గురైన సుమారు 6 లక్షల రూ.విలువ గల 63 ఫోన్ల ఆచూకీ మన రాష్ట్రం లోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మహేష్ బి గితే చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్లు యజమానులకి అందజేశారు.

February 25, 2026 / 02:30 PM IST

స్వయం స్వపరిపాలన దినోత్సవం

NRPT: ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వ్యవహరించి పాఠాలు బోధించారు. జిల్లా కలెక్టర్‌గా సుహాసిని, జిల్లా విద్యాధికారిగా కృష్ణవేణి, మండల విద్యాధికారిగా శివప్రసాద్, ప్రధానోపాధ్యాయులుగా నందిని వ్యవహరించారు. బోధనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల హెచ్ఎం రఘుమోహన్ బహుమతులు ఇచ్చారు.

February 25, 2026 / 02:29 PM IST

బాల్క సుమన్ విడుదల కావాలని పూజలు

MNCL: ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆయురారోగ్యాలతో ఉండాలని చెన్నూర్ BRS నాయకులు పూజలు చేశారు. బుధవారం చెన్నూరు పట్టణంలోని మదన పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీలైనంత త్వరగా సుమన్‌కు బెయిల్ రావాలని కోరుతూ 500 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు సమర్పించుకున్నారు.

February 25, 2026 / 02:29 PM IST