• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

IND vs ENG: జాక్స్ ఒక్కడేనా? ఆ ఇద్దరూ ప్రమాదమే!

రేపటి T20 WC సెమీస్‌లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ ప్రదర్శన కీలకం కానుంది. దీంతో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల అతణ్ని బ్యాటింగ్, బౌలింగ్‌లో కట్టడి చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. అయితే కెప్టెన్ బ్రూక్, బట్లర్ వికెట్లు కూడా కీలకమే. ఇప్పటికే బ్రూక్ అదరగొడుతుండగా.. ఫామ్‌లో లేడని బట్లర్‌ని ఏ మాత్రం లైట్ తీసుకున్నా బౌలర్లందరికీ చుక్కలు కనబడటం ఖాయం.

March 4, 2026 / 01:22 PM IST

తాళాలు పగలగొట్టి చోరీ.. 30 వేలు నగదు మాయం

కోనసీమ: ద్వారపూడి శివారు వేములపల్లికి చెందిన కందుల రాజ్యలక్ష్మి, రమేశ్ దంపతుల కిరాణా షాపులో బుధవారం భారీ చోరీ జరిగింది. పాత సినిమా హాల్ సెంటర్లోని షాపు తాళాలు పగలగొట్టిన దుండగులు సుమారు రూ. 30 వేల నగదును అపహరించారు. ఉదయం పనిమనిషి గమనించి సమాచారం అందించడంతో దొంగతనం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

March 4, 2026 / 01:21 PM IST

ధర్మారంలో ఇంటర్ పరీక్షకు 9 మంది గైర్హాజరు

PDPL: ధర్మారంలో ఇవాళ నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 9 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని అధికారులు తెలిపారు. రెండు కేంద్రాలలో మొత్తం 496 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావలసి ఉండగా 487 మంది హాజరయ్యారు. మొత్తం మీద పరీక్ష ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు.

March 4, 2026 / 01:21 PM IST

అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం

AP: అధికారులపై మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలిలో బిల్లు ప్రవేశపెట్టే సమయంలో ఎందుకు ఉండరని అధికారులను ప్రశ్నించారు. ఇదే విషయంలో సభలో ఛైర్మన్ కూడా ప్రస్తావించారని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే అధికారులందరికీ సీఎస్ ఆదేశాలు పంపారని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాలు, బిల్లుల సమయంలో అధికారులు అందుబాటులో ఉండాలన్న ఆదేశాలు ఉన్నాయని తెలిపారు.

March 4, 2026 / 01:20 PM IST

విద్యుత్ షాక్‌తో యువకుడికి గాయాలు

ప్రకాశం: పీసీపల్లిలో విద్యుత్ షాక్‌తో యువకుడు గాయపడ్డాడు. వరిమడుగు విద్యుత్ ఫీడర్ పరిధిలోని మారెళ్ల చెరువు సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద హెడ్ ఫ్యూజు పోవడంతో లైన్‌మెన్ సిలోమాన్‌కు సమాచారం అందింది. జంగాలపల్లికి చెందిన కొండారెడ్డి అనే ప్రైవేట్ వర్కర్ ఫ్యూజు వేయడానికి వెళ్లగా, సాంకేతిక లోపం వల్ల విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమొచారం.

March 4, 2026 / 01:20 PM IST

MEOను సన్మానించిన PRTU సభ్యులు.!

MDK: నిజాంపేట మండల నూతన విద్యాధికారిగా (MEO) బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిని బుధవారం PRTU-TS సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటూ, పదవ తరగతి పరీక్షల్లో మండలం ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేస్తానన్నారు.

March 4, 2026 / 01:17 PM IST

‘డ్రైనేజీల పేరుతో ప్రజాధనం దుర్వినియోగం’

తూ.గో: దేవరపల్లి మండలం పల్లంట్ల బీసీ కాలనీలో కొత్తగా వేసిన సీసీ రోడ్లను డ్రైనేజీల కోసం ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రణాళిక లేకుండా పనులు చేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. అధికారులు ముందుగానే డ్రైనేజీలకు స్థలం కేటాయించి రోడ్లు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.

March 4, 2026 / 01:17 PM IST

పాఠశాలల అభివృద్ధికి కృషి: ఛైర్మన్

BHPL: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహకారంతో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఛైర్మన్ బుర్ర కొమురయ్య అన్నారు. భూపాలపల్లి 25వ వార్డు సింగరేణి పాఠశాలను ఛైర్మన్ సందర్శించి పాఠశాలలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రిన్సిపాల్‌తో సమావేశమై సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

March 4, 2026 / 01:16 PM IST

CC రోడ్లు నిర్మాణ పనుల ప్రారంభం

MLG: పప్కపురంలో నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు, నేతలు శంకుస్థాపన చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అభివృద్ధికి ప్రజల సహకరించాలని వారి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్, అధికార ప్రతినిధి లాలయ్య, పీఎసీఎస్ వైస్ ఛైర్మన్ బాలరాజు, ఆత్మ ఛైర్మన్ అరుణ ఉన్నారు.

March 4, 2026 / 01:16 PM IST

ఆ దర్శకుడితో బాలకృష్ణ మూవీ?

నందమూరి బాలకృష్ణ తన 112వ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో చేయనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయట. ఈ చిత్రంలో బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపిస్తారని సమాచారం. ఈ ఏడాది ద్వితీయార్ధంలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

March 4, 2026 / 01:16 PM IST

‘ఉచితంగా విద్యుత్ మీటర్ ఇవ్వాలి’

PPM: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచిత విద్యుత్ మీటర్ కనెక్షన్ ఇవ్వాలని సామాజిక చైతన్య వేదిక ఉత్తరాంధ్ర కన్వీనర్ పీ.రంజిత్ కుమార్ డిమాండ్ చేస్తూ బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మాణం చేస్తున్న పేదలకు ఉచితంగా విద్యుత్ మీటర్ కనెక్షన్ వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది అన్నారు.

March 4, 2026 / 01:15 PM IST

వడ్డెరలకు ప్రాధాన్యం ఇస్తాం: మంత్రి సవిత

సత్యసాయి: బడ్జెట్ సమావేశాల్లో బుధవారం మంత్రి సవిత పాల్గొని మాట్లాడారు. బీసీలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. త్వరలో ప్రారంభించే ఆదరణ 3.0లో వడ్డెరలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. మత్స్యకారులకు ఆర్థిక సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచినట్లు పేర్కొన్నారు. రజకులకు ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు.

March 4, 2026 / 01:15 PM IST

అమ్మవారి వార్షిక మహోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే

NLG: శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి 23వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం ఇవాళ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఛైర్మెన్ మారగోని ఆంజనేయులు గౌడ్, డైరెక్టర్లు అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

March 4, 2026 / 01:15 PM IST

మానవత్వం చాటుకున్న కాకర్లపల్లి వాసులు

KMM: సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డులో కరెంట్ షాక్‌కు గురైన వానరం పిల్లను రక్షించి గ్రామానికి చెందిన లక్ష్మీకాంతారావు, వెటర్నరీ అసిస్టెంట్ విజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న మూగజీవిని గమనించిన యజమాని వెంటనే వైద్యుడు విజయ్ కుమార్‌కి సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆ వానరనికి వైద్యం అందించాడు.

March 4, 2026 / 01:13 PM IST

రూ. 4 కోట్ల 55 లక్షలతో బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులు

HYD: ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని కాలనీల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. కుషాయిగూడ డివిజన్ శివసాయి నగర్‌లో రూ. 4 కోట్ల 55 లక్షలతో జరుగుతున్న బాక్స్ డ్రైన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. పలు కాలనీలు వరద మురుగు నీటి ముంపుతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పనులు చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు.

March 4, 2026 / 01:11 PM IST