• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మూడు ట్రాక్టర్లు సీజ్

GNTR: కొల్లిపర మండలం చక్రాయపాలెం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిలుమూరు రీచ్ నుంచి ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా తెనాలికి ఇసుకను తరలిస్తుండగా, ఎస్సై ప్రసాద్ తనిఖీలు చేపట్టి వాహనాలను పట్టుకున్నారు. కొత్త చిలుమూరు, అన్నవరపు లంక గ్రామాలకు చెందిన ఈ ట్రాక్టర్ల యజమానులపై కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 08:58 AM IST

9 ఏళ్లకే ఇన్వెంటర్‌గా సన్నీ లియోన్ కూతురు

సన్నీ లియోన్ కుమార్తె నిషా(9) ‘బూ బాక్స్’ అనే టిష్యూ హోల్డార్‌ను కనిపెట్టి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. టిష్యూ వాడుకున్న తర్వాత పక్కనే పడేసేలా చిన్న డస్ట్ బిన్ కలిపి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది. దీనికి అధికారికంగా పేటెంట్ హక్కులు కూడా లభించాయి. అలర్జీ సమస్యతో టిష్యూలు వాడే క్రమంలో వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు కమర్షియల్ ప్రోడక్ట్‌గా మారి నిషాకు డబ్బును తెచ్చిపెడుతోంది.

March 4, 2026 / 08:55 AM IST

ఇందిరమ్మ కాలనీలో రేషన్ బియ్యం సీజ్

సత్యసాయి: ధర్మవరం ఇందిరమ్మ కాలనీలో అక్రమంగా తరలిస్తున్న 50 బస్తాల రేషన్ బియ్యాన్ని టూటౌన్ SI వీరేష్ సీజ్ చేశారు. అక్రమ రవాణాపై అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ బియ్యం తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

March 4, 2026 / 08:50 AM IST

మహా కుంభాభిషేకం ఏర్పాట్లు పూర్తి

TPT: గాంధీపురం పంచాయతీలో నూతనంగా నిర్మించిన కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకానికి నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. బుధవారం నుంచి మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మహా కుంభాభిషేకం, విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 4, 2026 / 08:49 AM IST

తలారి రంగయ్యను అభినందించిన వైఎస్ జగన్

ATP: మాజీ ఎంపీ తలారి రంగయ్య తాడేపల్లిలో బుధవారం మాజీ సీఎం జగన్‌ను కలిశారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఆర్డీటీ సంస్థకు FCRA పునరుద్ధరణ కోసం చేపట్టిన ‘లక్ష పోస్ట్‌కార్డుల ఉద్యమం’ గురించి జగన్‌కు వివరించారు. రంగయ్య పోరాటాన్ని జగన్ మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రజా పక్షపాతిగా నిరంతరం శ్రమించాలని రంగయ్యకు సూచించారు.

March 4, 2026 / 08:48 AM IST

నాడు సైమా, నేడు నంది అవార్డ్

SDPT: చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కత్తుల నర్మదకు హైదరాబాదులోని బిర్లా మందిరం భాస్కరాచార్య ఆడిటోరియంలో బ్యూటిషన్ రంగంలో చేసిన సేవలకు నంది అవార్డును బాబు మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా కత్తుల నర్మద మాట్లాడుతూ.. ఏ రంగంలో అయినా పట్టుదలతో, సమయ స్ఫూర్తితో, కష్టపడి పని చేస్తేనే గుర్తింపు వస్తుందని ఆమె అన్నారు.

March 4, 2026 / 08:47 AM IST

శాంతినగర్ ఆలయం భక్తులకు తెరవడం

GDWL: వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో ఉన్న శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని గ్రహణం సందర్భంగా మూసివేసి, సంప్రోక్షణ అనంతరం నేడు భక్తులకు తిరిగి తెరిచారు. అర్చకులు వినయ్ కౌశల్ శర్మ పూజాదికాలు నిర్వహించి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. గ్రహణం ముగిసిన సందర్భంగా భక్తులు గోమాతను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

ముఖ్యమంత్రికి జిల్లా ప్రగతి నివేదిక

KMR: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేశారు.

March 4, 2026 / 08:45 AM IST

ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి బీసీ

NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, ఉపాధి సంబంధిత సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. న్యాయబద్ధమైన వినతులపై మంత్రి తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 4, 2026 / 08:45 AM IST

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే మాతృవియోగం

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి జి.మంగమ్మ మంగళవారం మృతి చెందారు. విశయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఫోన్ ద్వారా పరామర్శించి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

కృష్ణానదిలో అక్రమ ఇసుక రవాణా పట్టివేత

కృష్ణానది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కృష్ణా మండలం గుడెబల్లూరు వద్ద అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఒక టిప్పర్‌తో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.

March 4, 2026 / 08:44 AM IST

ఖమ్మం జిల్లాలో నయా మోసం

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా రైతులను మోసం చేస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామని చెప్పి నకిలీ బిల్లులతో ఒక్కో మొక్కకు రూ.370 వసూలు చేస్తున్నారు. తిరుమలాయపాలెం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి వారు రూ.23 వేలు కాజేశారు. దీంతో అపరిచితులకు ఫోన్‌పే, జీపే చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

March 4, 2026 / 08:42 AM IST

అలాంటి వాటికి దూరమే మేలు: జాన్వీ కపూర్

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేసింది. మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటుందని తెలిపింది. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్ కపూర్ SMలో ట్రోల్స్‌కి గురవుతున్న నేపథ్యంలో ఆమె స్పందించింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని చెప్పింది. అలాగే, ఇలాంటి నెగిటివిటికీ ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పుకొచ్చింది.

March 4, 2026 / 08:41 AM IST

రాజాపూర్ ఎస్సై రాజశేఖర్‌కు సన్మానం

MBNR: రాజాపూర్ మండలానికి నూతన ఎస్సైగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. సైబర్ క్రైమ్, అపరిచిత మెసేజీలు సహా నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

March 4, 2026 / 08:41 AM IST

‘ప్రతి హిందువు ఐక్యత చాటేందుకు కృషి చేయాలి’

KDP: ప్రతి హిందువు ఐక్యత చాటేందుకు కృషి చేయాలని విభాగ్ సామాజిక ప్రముఖ్ రవీంద్రనాథ్ రెడ్డి కోరారు. సిద్ధవటం మండలం మాధవరం -1 గ్రామంలోని సీతారాముల ఆలయ ఆవరణలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన హిందూ సద్భావన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట ఖండ ప్రముఖ్ రమణారెడ్డి,హిందువులు పాల్గొన్నారు.

March 4, 2026 / 08:40 AM IST