• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కార్డన్ సెర్చ్.. 4 బైక్‌లు స్వాధీనం

ASR: జీకేవీధి మండలం సీలేరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న చింతపల్లి క్యాంపులో సీలేరు ఎస్సై ఎండీ యాసిన్ తమ సిబ్బందితో కలిసి బుధవారం ఉదయం కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల వివరాలను తెలుసుకున్నారు. సరైన ధృవపత్రాలు లేని నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తెలిపారు.

February 25, 2026 / 09:35 AM IST

ఇంద్రకీలాద్రిపై మంత్రి దంపతుల దర్శనం

NDL: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన సతీమణి ఇందిరా రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వెల్లడించారు.

February 25, 2026 / 09:34 AM IST

‘పెద్ది’ రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తోన్న మూవీ ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘చికిరి’ పాట రిలీజై సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీ సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. మార్చి 3, 2026న ఈ పాటను విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 30, 2026న విడుదలవుతుంది.

February 25, 2026 / 09:34 AM IST

మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి నారాయణ

AP: శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితిపై మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని పేర్కొన్నారు. అదనపు సిబ్బందితో పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని వెల్లడించారు.

February 25, 2026 / 09:34 AM IST

ఈనెల 27న జాబ్ మేళా

SRD: పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్‌డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్కు సంప్రదించాలని కోరారు.

February 25, 2026 / 09:34 AM IST

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఇంటర్మీడియట్ పరీక్షలు

BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రం వద్ద సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు.

February 25, 2026 / 09:34 AM IST

అతిగా మద్యం తాగి ఒకరి మృతి

CTR: పెనుమూరు మండలం సాతంబాకం బస్టాండ్ వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు గుడియాత్తం తాలూకా పార్వతీపురానికి చెందిన కుమార్(47) ఆదివారం బంధువుల వద్దకు వచ్చాడు. కుటుంబ సమస్యల కారణంగా బాధలో అతిగా మద్యం సేవించి, ఫిట్స్ రావడంతో మృతి చెందినట్లు తెలిపారు.

February 25, 2026 / 09:33 AM IST

మున్నూరు కాపు సంఘం కొత్త అధ్యక్షుడు

GDWL: మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ కాలపరిమితి ముగియడంతో జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్ రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కాపులకుంట సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. గౌరవాధ్యక్షుడు బాణాల కృష్ణమూర్తిని కలిసారు. సంఘ బలోపేతానికి కృషి చేసి, త్వరలో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

February 25, 2026 / 09:30 AM IST

పరీక్షకు ఆలస్యం.. దివ్యాంగ విద్యార్థికి అనుమతి

WGL: నగరంలోని ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షా కేంద్రానికి ఓ దివ్యాంగ విద్యార్థి ఐదు నిమిషాల ఆలస్యంగా చేరుకున్నాడు. నిబంధనల ప్రకారం పోలీసులు మొదట అతడిని లోపలికి అనుమతించలేదు. ఆ విద్యార్థి పడుతున్న ఇబ్బందిని గమనించిన పరీక్షా కేంద్ర నిర్వాహకులు మానవత్వంతో స్పందించారు. దివ్యాంగులైన విద్యార్థులకు నిబంధనల మేరకు కొంత సమయం మినహాయింపు ఉంటుందని ఆలస్యమైనా అతడిని పరీక్ష రాసేందుకు అనుమతించారు.

February 25, 2026 / 09:30 AM IST

గుత్తిలో 10 మంది గంజాయి విక్రేతల అరెస్టు

ATP: గుత్తి పట్టణ శివారులో గంజాయి విక్రయిస్తున్న పదిమంది గంజాయి విక్రేతలను మంగళవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. గంజాయి విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు.వారి వద్ద నుంచి 2.500 గ్రాముల గంజాయి, రూ.20వేలు నగదు, 2 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.

February 25, 2026 / 09:30 AM IST

సైబర్ ట్రాఫికింగ్ పై అప్రమత్తత అవసరం

KMM: మహిళలు, యువతులే లక్ష్యంగా సాగుతున్న సైబర్ ట్రాఫికింగ్ పై అంగన్వాడీ టీచర్లు సమాజంలో అవగాహన కల్పించాలని ఖమ్మం జిల్లా సంక్షేమ అధికారి విజేత పిలుపునిచ్చారు. ‘ప్రజ్వల’ సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నుంచి రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రేమ ఉద్యోగాల పేరుతో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 25, 2026 / 09:30 AM IST

కోరుకొండలో అంగన్వాడీల నిరసన

E.G: అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పూర్ణిమ రాజు హెచ్చరించారు. కోరుకొండ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద జరుగుతున్న నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. వర్కర్లకు కనీస వేతనం రూ. 26,000 చెల్లించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 09:30 AM IST

BIG ALERT: పెరగనున్న ఏసీల ధరలు

వేసవిలో ఎయిర్ కండిషనర్(AC) కొనుగోలు చేయాలనుకునే వారికి బిగ్ షాక్. ఈ ఏడాది ఏసీల ధరలు 5 నుంచి 15% పెరిగే అవకాశం ఉందని ఏసీల తయారీ సంస్థ వోల్టాస్ తెలిపింది. ఏసీల తయారీలో కీలకమైన రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిందని వోల్టాస్ ఎండీ మేనన్ వివరించారు. గతేడాది టన్నుకు 8,500 డాలర్లుగా ఉన్న రాగి ధర ఇప్పుడు 12,000 నుంచి 13,000 డాలర్లకు చేరిందన్నారు.

February 25, 2026 / 09:30 AM IST

టెన్త్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు: అదనపుకలెక్టర్

KMM: జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్రీజ ఆదేశించారు. మంగళవారం డీఈఓ చైతన్య జైనీతో కలిసి ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు తాగునీరు వంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 25, 2026 / 09:29 AM IST

‘విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి’

అన్నమయ్య: రాయచోటిలో మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల ఎంఈవోలు, డైట్ అధ్యాపకులకు రెండు రోజుల GFLN శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులలో చదవడం, గణిత నైపుణ్యాలను పెంచడమే ఈ శిక్షణ లక్ష్యమని డీఈవోలు తెలిపారు. మార్చి 2026 నాటికి లక్ష్యాలను చేరుకోవడానికి 75 రోజుల కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

February 25, 2026 / 09:27 AM IST