• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బాధితులకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి’

E.G: రాజమండ్రి కల్తీ పాల ఘటనలో పలువురు మృతి చెందడం, 19 మంది అస్వస్థతకు గురవ్వడం పట్ల మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బాధితుల వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కల్తీకి బాధ్యులైన వారిని వదిలిపెట్టకూడదన్నారు.

February 24, 2026 / 02:30 PM IST

అకాల వర్షం.. అనుకోని నష్టం

SDPT: జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం పంటలను దెబ్బతీసింది. ముఖ్యంగా మిరుదొడ్డి, దుబ్బాక మండలంలోని పలు గ్రామాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. కొండాపూర్, అందె తదితర గ్రామాల్లో మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల రోడ్లపై అడ్డంగా చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి.

February 24, 2026 / 02:30 PM IST

హాస్పిటల్ పనుల ఆలస్యంపై హరీష్ రావు ఘాటు విమర్శలు

WGL: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను నేడు పరిశీలించిన మాజీ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. హాస్పిటల్ పనులు జూన్ 2వ తేదీకి పూర్తి కావడం ఆలస్యం అవుతోందని, ఎంజీఎం హాస్పిటల్‌లో గుండె చికిత్సలు, ఆక్సిజన్, మందుల కొరత, వైద్య సిబ్బంది సమస్యలు ఉన్నాయని, ప్రజలకు హాస్పిటల్ సేవలు సేవలు అందకపోవడం ప్రాణాల కోల్పోడానికి కారణమవుతున్నారు.

February 24, 2026 / 02:29 PM IST

పరీక్షా కేంద్రాలలో కలెక్టర్ తమీమ్ అన్సారియా తనిఖీ

GNTR: ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షల సందర్భంగా గుంటూరు ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలోని కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న తీరును ఆమె పరిశీలించారు. కేంద్రంలో తాగునీరు, వైద్య శిబిరాల వంటి కనీస వసతులను ఆరా తీశారు. పరీక్షల సమయంలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు.

February 24, 2026 / 02:28 PM IST

రైతుబంధు ఇక లేనట్లే..!

KMM: క్యాబినెట్ మీటింగ్‌లో రైతుబంధు ప్రస్తావన ఈసారి కూడా రాలేదు. డిసెంబర్‌లో ఇవ్వాల్సిన రైతుబంధు ఎన్నికలు అయిపోయి పొలంలో నాట్లు వేయడం కూడా అయ్యేవరకు రైతుల ఖాతాలోకి జమ కాలేదు. క్యాబినెట్ మీటింగ్‌కు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కాలేదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుబంధు ఇస్తామని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి కానీ నేడు ఆ ప్రస్తావన లేదు.

February 24, 2026 / 02:28 PM IST

జీవో నెంబర్ 77ను రద్దు చేయాలి: PDSU

ATP: గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయం ఎదుట మంగళవారం PDSU విద్యార్థి సంఘం నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. పీజీ విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో 77ను వెంటనే రద్దు చేయాలని, ప్రభుత్వ యూనివర్సిటీలో 4200 పోస్టును భర్తీ చేయాలని, విద్యారంగానికి 30% నిధులను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.

February 24, 2026 / 02:27 PM IST

ప్రభుత్వానికి బాధ్యత లేదు: బొత్స

AP: పాలు కల్తీ జరిగి మనుషులు చనిపోవడం ఏంటని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయింది. గ్రామస్థాయి నుంచి కూడా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. సభ సజావుగా జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఏ అంశాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవట్లేదు. అందుకే శాసనమండలి నుంచి వాకౌట్ చేశాం’ అని వెల్లడించారు.

February 24, 2026 / 02:24 PM IST

పసిపాప మృతికి నిరసనగా బీసీ కుల సంఘాల ఆందోళన

NZB: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో పసిపాప మృతికి నిరసనగా మంగళవారం NZBలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బీసీ సంక్షేమ సంఘం, రజక ఐక్య వేదిక, వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చౌక్లో మానవహారం ఏర్పాటు చేసి రోడ్డుపై బైఠాయించారు.

February 24, 2026 / 02:20 PM IST

రాచకిండంలో అగ్నిప్రమాదం

VZM: బొండపల్లి మండలంలోని రాచకిండంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పాలవలస నూకాలు పూరిల్లు కాలిపోయింది. గ్యాస్ లీకేజ్ కారణంగా జరిగిన అగ్ని ప్రమాదం వలన సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాద విషయం తెలిసిన వెంటనే గజపతినగరం అగ్నిమాపకేంద్రం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో మంటలను అదుపు చేశారు.

February 24, 2026 / 02:20 PM IST

బహదూరురాలో నిలిచిన నీరు.. అధికారుల చర్యలు

HYD: రామదేవ్ ఆలయం సమీపంలో రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం హైడ్రా సిబ్బంది మోటార్ల సాయంతో నీటిని తొలగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉన్నందున, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

February 24, 2026 / 02:20 PM IST

మార్చి 3న రక్త చంద్రుడు

TG: మార్చి 3న ఆకాశంలో బ్లడ్​ మూన్​ అద్భుత దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల, చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలలో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాయంత్రం 6.20గంటల నుంచి 27 నిమిషాల పాటు చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.

February 24, 2026 / 02:20 PM IST

ఈనెల 27న కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది సభ

NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టులే అన్నారు.

February 24, 2026 / 02:19 PM IST

‘పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

AKP: పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్. రాము డిమాండ్ చేశారు. ఎలమంచిలి డీసీసీబీ బ్రాంచ్ వద్ద పీఏసీఎస్ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమం 9వ రోజుకు చేరుకుంది. లాభనష్టాలతో సంబంధం లేకుండా జీవో 36ను వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని సూచించారు.

February 24, 2026 / 02:18 PM IST

హెరిటేజ్ ఎప్పుడూ తప్పు చేయదు: CBN

AP: ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్‌కు నెయ్యిలో ఎలాంటి సంబంధం లేదని CM చంద్రబాబు అన్నారు. ‘ఇందాపూర్ డెయిరీ అనేక సంస్థలకు కో-మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. హెరిటేజ్ ఎప్పుడూ తప్పుడు పనులకు పాల్పడదు. మీరు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి నాటకాలు చేస్తున్నారు. వాళ్లు తప్పు చేసి మళ్లీ మమ్మల్నే క్షమాపణలు చెప్పాలని అడుగుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 24, 2026 / 02:18 PM IST

‘పైప్ లైన్లకు మరమ్మతులు చేయించాలి’

MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో మిషన్ భగీరథ పైప్ లైన్ల లీకేజీలకు మరమ్మతులు చేయించాలని స్థానిక కౌన్సిలర్ శనిగారపు చిన్నయ్య సూచించారు. మంగళవారం మున్సిపల్ అధికారులతో కలిసి వార్డులోని పలు కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా సమస్యలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు లీక్ అవుతున్నాయని, నీరు వృధాగా పోతుందన్నారు.

February 24, 2026 / 02:16 PM IST