• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విశాఖకు మంత్రి నారా లోకేష్ రాక

విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు గురువారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రి లోకేష్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి కార్యకర్తలతో కలిసి ఫోటోలు దిగారు. అనంతరం విశాఖ వాల్తేర్ క్లబ్‌లో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల వెంకటరమణ సోదరుని కుమారుడి వివాహ వేడుకకు హాజరవుతారు.

March 5, 2026 / 05:23 PM IST

బండి ఆత్మకూరులో సామాజిక తనిఖీ ప్రజా వేదిక

NDL: బండి ఆత్మకూరు మండలంలో 2024-25లో చేపట్టిన ఉపాధి హామీ పనులపై 19వ విడత సామాజిక తనిఖీ జరిగింది. ఎంపీడీవో గాయత్రి ఆధ్వర్యంలో బహిరంగ సమావేశం నిర్వహించారు. జిల్లా విజిలెన్స్ అధికారి పరమేశ్వరుడు, తనిఖీ బృందం పాల్గొన్నారు. మండలంలో రూ.10.15 కోట్ల పనులు చేశారని చెప్పారు. రికవరీ రూపంలో రూ.13,262, పెనాల్టీ రూపంలో రూ.21వేల రికవరీకి ఆదేశించారు.

March 5, 2026 / 05:21 PM IST

చిరు ‘మెగా 158’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు బాబీ ‘మెగా 158’ మూవీని తెరకెక్కించనున్నాడు. మార్చి 14న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనుండగా.. ఏప్రిల్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు టాక్. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముందుగా AR రెహమాన్ పేరు వినిపించగా.. చివరికి తమన్‌ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

March 5, 2026 / 05:20 PM IST

భవన నిర్మాణ కార్మికుడు మృతి

SRCL: వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నల్లూరి శంకర్ అనారోగ్యంతో మృతి చెందారు. మృతదేహంపై భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. శంకర్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబమని, ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.

March 5, 2026 / 05:19 PM IST

డివిజన్ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

ఖమ్మం 36వ డివిజన్ రజక వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.12 లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెచ్చా సీతారాములు, కురువెల్ల వేణుగోపాల్ ఉన్నారు.

March 5, 2026 / 05:18 PM IST

ఎమ్మెల్యే ఆఫీసులో ఉచిత మెడికల్ క్యాంప్

ELR: ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి క్యాంపు కార్యాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు డివిజనులకు చెందిన ప్రజలు పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే వైద్యులు వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 5, 2026 / 05:17 PM IST

కొండ ప్రాంత సమస్యలు పరిష్కరించాలని వినతి

VSP: జీవీఎంసీ 48వ వార్డు కొండ ప్రాంతపు సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ గంకల కవిత జీవీఎంసీ కమిషనర్‌‌ను కోరారు. గురువారం జీవీఎంసీ కార్యాలయంలో ఆయనను కలిసి వినతి అందజేశారు. కొండ ప్రాంతంలో జై భారత్ నగర్, శ్రీనివాస్ నగర్లో 72A/2, 75A/5, 75A/6 స్తంభాలు, ఇండ్లకు అతి దగ్గరలో ఉన్నాయని, వాటి తీగలు తగిలి గతంలో కొందరు మరణించారని, ఆ స్తంభాలను తొలగించాలన్నారు.

March 5, 2026 / 05:17 PM IST

‘భూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి’

SKLM: పలాస మున్సిపాలిటీలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే నెంబర్ 28లో ఉన్న సుమారు 1.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి ఆక్రమించుకున్నారని 29వ వార్డు కౌన్సిలర్ జోగ మల్లేశ్వరరావు ఆరోపించారు. సమగ్ర విచారణ జరపాలని డిప్యూటీ తహసీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు.

March 5, 2026 / 05:16 PM IST

ఈనెల 9న PM నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా

MNCL: మంచిర్యాల ప్రభుత్వ ITIలో ఈనెల 9న PM నేషనల్ అప్రెంటిస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రమేశ్ గురువారం తెలిపారు. 11 కంపెనీలలో మొత్తం 395 ఖాళీలు ఉన్నాయని, శిక్షణ సమయంలో స్టైఫండ్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అప్రెంటిషిప్ మేళాకు అర్హులైన విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరై సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 5, 2026 / 05:16 PM IST

మహిళా దినోత్సవానికి తరలిరండి: జోగు రామన్న

ADB: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న ఆదిలాబాద్‌లోని కొమురం భీం కాలనీలో తుడుం దెబ్బ మహిళా సంఘం నిర్వహించే కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. గురువారం సంఘం నేతలు ఆయనను కలిసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు గణేశ్, మనోజ్, తదితరులు పాల్గన్నారు.

March 5, 2026 / 05:15 PM IST

మంగళగిరి ఎయిమ్స్‌లో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష

GNTR: మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, మౌలిక సదుపాయాలపై అధికారులతో చర్చించారు. మౌలిక వసతుల విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకుండా, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి సూచించారు.

March 5, 2026 / 05:15 PM IST

ప్రముఖ నటుడు సోనుసూద్ ను కలిసిన మిథున్ రెడ్డి

MBNR: ప్రముఖ నటుడు, సామాజికవేత్త సోను సూద్‌ను MLA, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ అంశాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు చర్చించినట్లు మిథున్ వెల్లడించారు. సామాజిక సేవ కార్యక్రమాలపై ప్రత్యేకంగా సోనుసూద్‌ను అభినందించినట్లు మిథున్ రెడ్డి పేర్కొన్నారు.

March 5, 2026 / 05:15 PM IST

స్వర్ణాంధ్ర క్యాలండర్ ఆవిష్కరించిన కలెక్టర్

VZM: రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన స్వర్ణాంధ్ర-2047 క్యాలండర్‌ను జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. వాటిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ పి.గోవిందరాజులు, వివిధ శాఖల అధికారులు అత్యధికంగా పాల్గొన్నారు.

March 5, 2026 / 05:13 PM IST

100 శాతం లక్ష్యాలు సాధించాలి: కలెక్టర్

GDWL: అధికారులు క్షేత్రస్థాయిలో బాధ్యతగా పనిచేసి ఏప్రిల్ 14 నాటికి నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలి అని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా పేర్కొన్నారు. గురువారం గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ 2.0 సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో వంద శాతం పోషకాహార పంపిణీ జరగాలని, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 05:13 PM IST

‘విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలి’

KRNL: కర్నూలు జిల్లాలో విద్యా శాఖలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని బహుజన సేన సమితి డిమాండ్ చేసింది. రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం నాగేంద్ర ఆధ్వర్యంలో డీఈవో సుధాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. పాఠశాల భవనాల మరమ్మతులు, ఖాళీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, తాగునీరు-మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, హాస్టల్ వసతుల మెరుగుదలపై చర్యలు తీసుకోవాలని కోరారు.

March 5, 2026 / 05:12 PM IST