• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘అటవీశాఖ దౌర్జన్యాలు తక్షణమే ఆపాలి’

MLG: తాడ్వాయి మండలం కాల్వపల్లి ఆదివాసీలపై అటవీశాఖ దౌర్జన్యాలు తక్షణమే ఆపాలని BRS జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు. తరతరాలుగా పోడు భూములను నమ్ముకుని జీవిస్తున్న ఆదివాసీలపై అటవీ అధికారులు సాగిస్తున్న అరాచకాలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తక్షణమే ఈ దాడులు నిలిపివేయాలని, లేదంటే బాధితుల పక్షాన BRS పెద్దఎత్తున పోరాటం చేస్తుందన్నారు.

March 3, 2026 / 07:48 PM IST

సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం

SRCL: పాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకొని, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలోనీ శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో వసంతోత్సవం నిర్వహించారు. ఆలయ అర్చకులు వేణుగోపాల చార్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవ విగ్రహాలను ఊయాలలో ఉంచి జోల పాటలు పాడుతూ పూజలు చేశారు. స్వామిని దర్శించుకొని భక్తులు పూజలు చేశారు.

March 3, 2026 / 07:48 PM IST

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక

WGL: నర్సంపేట డివిజన్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీని గౌరవాధ్యక్షుడు మన్నెం వీరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ ఎన్నిక చేశారు. అధ్యక్షుడిగా ఈదుల కృష్ణ, ఉపాధ్యక్షుడిగా జూలూరి నరేష్, ప్రధాన కార్యదర్శిగా కేశరాజు సాయికుమార్, కోశాధికారిగా భూక్య వెంకన్న, కార్యదర్శిగా ధూపటి సుమన్, సంయుక్త కార్యదర్శులుగా,ఆకుల రాజ, ఎన్నికైనట్లు తెలిపారు.

March 3, 2026 / 07:47 PM IST

కేంద్ర మంత్రితో ఎంపీ భేటీ

SKLM: ఎంపీ రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన సికింద్రాబాద్, తిరుపతికి నేరుగా రైళ్లు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మందస పాతపట్నం స్టేషన్లలో పలు రైళ్లు నిలుపుదల కల్పించాలని కోరారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.

March 3, 2026 / 07:47 PM IST

గోశాలను పరిశీలించిన జేఈవో

CTR: తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో డా. ఏ.శరత్ పలమనేరు గోశాలను మంగళవారం పరిశీలించారు. పశువులకు సమయానికి మేత, త్రాగునీరు, వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. 450 ఎకరాల్లో విస్తరించిన గోశాలలో ప్రస్తుతం 542 పశువులు ఉన్నాయని తెలిపారు. పచ్చిమేత సాగును విస్తరించాలని, పరిశుభ్రత, సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

March 3, 2026 / 07:45 PM IST

ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు

KMM: నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఒక వరమని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్‌ అన్నారు. మండలంలోని టేకులపల్లిలో ఇందిరమ్మ ఇళ్ళను ఆయన మంగళవారం ప్రారంభించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

March 3, 2026 / 07:45 PM IST

MAR 6-JUNE 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు

TG: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జరపనున్నారు.

March 3, 2026 / 07:45 PM IST

ముగిసిన గ్రహణం.. తెరిచిన ఆలయాలు

ADB: నార్నూర్ మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 7 గంటలకు ముగిసింది. గ్రహణ సమయంలో సంప్రదాయాల ప్రకారం మండలంలోని పలు ఆలయాలను మూసివేశారు. భక్తులు కూడా ఇళ్లలోనే పూజలు నిర్వహించారు. గ్రహణం ముగిసిన వెంటనే శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. భక్తుల రాకపోకలతో ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి.

March 3, 2026 / 07:44 PM IST

చందోలులో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.

March 3, 2026 / 07:44 PM IST

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాల వేలం: CI

నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం వేలంపాట నిర్వహించినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో రూ.29 వేలకు గాను, ఓ వ్యక్తి వేలం ద్వారా రూ. 68,020 వేలకు సొంతం చేసుకున్నారని సీఐ చెప్పారు. బహిరంగ వేలంపాటలో మొత్తం 20 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:44 PM IST

జిల్లాకు రూ.736.27 కోట్ల నిధులు: ఎంపీ అంబిక

ATP: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, సెప్టేజ్ అభివృద్ధికి రూ.736.27కోట్ల నిధులు మంజూరైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అమృత్ 2.0, ఏఐఐబీ పథకాల కింద అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో పనులు చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:43 PM IST

వీడుతున్న గ్రహణం.. ఆసక్తిగా చూస్తున్న ప్రజలు

వరంగల్ జిల్లాలో చంద్రగ్రహణం వీడుతున్న దృశ్యాలు ఆసక్తి రేపాయి. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో తాటి చెట్టు పక్కగా చంద్రుడు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్న క్షణాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. గ్రహణం అనంతరం కొన్ని ఆలయాల్లో రాత్రి 8 గంటలకు సంప్రోక్షణ, మరికొన్ని చోట్ల రేపు ఉదయం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

March 3, 2026 / 07:41 PM IST

కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్

NDL: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరాన్ని ప్రోత్సహిస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియో చూస్తే అర్థమవుతుందని అన్నారు.

March 3, 2026 / 07:39 PM IST

‘అంగన్వాడీలపై నిర్బంధకాండ అమానుషం’

SKLM: అంగన్వాడీల పై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషం అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుండి డే &నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 07:39 PM IST

ఆరోగ్యంపై విద్యార్థినిలకు సూచనలు

AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పన్న ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులకు  వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా హిమాగ్లోబిన్‌కు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య విషయాలపై పోలీసులు పలు సూచనలు చేశారు.

March 3, 2026 / 07:38 PM IST