జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ దంత వైద్య నిపుణులు, ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ హరి విక్రము శాలువాతో సన్మానించారు. డాక్టర్ హరి విక్రమ్ మాట్లాడుతూ.. నోటి పరిశుభ్రత లేకపోతే చిగుళ్ల వ్యాధులు, గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ASR: డుంబ్రిగూడ మండలంలోని అడపవలసలో శుక్రవారం గంజాయి నివారణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డుంబ్రిగూడ ఎస్సై ఎల్. సురేష్ మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ప్రభుత్వం, పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గంజాయి నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.
MDK: తూప్రాన్ పట్టణ పరిధి పురాతన రామాలయానికి గ్రానైట్ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. తూప్రాన్ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొంది రజని రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఆలయం వద్ద శుక్రవారం నుంచి గ్రానైట్ వేసే పనులు ప్రారంభించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని ఆలయం వద్ద వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వార్షికోత్సవాల కోసం మరమత్తు పనులు చేపట్టారు
SKLM: జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడిగా పిన్నింటి సాయికుమార్‌ను నియమించారు. ఈ మేరకు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. తనపై నమ్మకం ఉంచిన జగన్‌కు, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్‌కు సాయి కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
NDL: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి దివ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో నందికొట్కూరు పోలీస్ బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజి అయ్యే సివిల్ క్రిమినల్ తగాదాలల్లో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా కక్షి దారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
కోనసీమ: అమలాపురం పట్టణంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో కొంకాపల్లి హైస్కూల్‌లో విద్యార్థినులకు శుక్రవారం ఆత్మరక్షణలో భాగంగా కరాటేలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ వీరబాబు మాట్లాడుతూ.. విద్యార్థినులు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను గురించి వివరించారు. ఆటంకాలను ఎదుర్కోవడానికి మానసిక శారీరక దారుఢ్యం ఎంతో అవసరమన్నారు.
ASF: సిర్పూర్ (T) మండలం హుడ్కిలికి చెందిన సుధాకర్ OU నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. OU హిందీ విభాగం ప్రొఫెసర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో “అంతిమ్ దశక్ కె హిందీ కహానీయే మే కిన్నర్ విమర్శ” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ను పలువురు అభినందించారు.
ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్’ 5కే రన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8వ తేదీన ఈ పరుగు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు రూ.11వేలు ప్రథమ బహుమతితో పాటు పలు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.
CTR: చిత్తూరు మండలం తుమ్మిందపాలెం గ్రామంలో ఆర్థిక వివాదం నేపథ్యంలో జరిగిన యువకుడి మృతి కేసులో నిందితుడు ఢిల్లీబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం బస్టాప్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని ఘటనలో ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.
AP: విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.
AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం, వమ్మవరంలో స్వచ్ఛరథం శుక్రవారం చెత్తను సేకరించి ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను అందజేసింది. డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛరథం సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛ రథం దోహదపడుతుందన్నారు. ప్రజలు పొడి చెత్తను స్వచ్చ రధానికి అందించి అవసరమైన నిత్యవసర సరుకులను తీసుకోవాలన్నారు.
CTR: ఈనెల 10, 11న రెండు రోజులపాటు పుంగనూరులో అత్యంత వైభవంగా జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసు శాఖ తరపున తీసుకున్న నిర్ణయాలను సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ మాట్లాడారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్ల చెప్పారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ చింతలపాడు గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లను ఆయన అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని పెంచుతాయని చెప్పారు.
W.G: ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యలను చెబుతున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. రహదారులు, సాగునీరు తాగునీరు, తదితర అంశాలపై సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయని పలువురు పెదవి విరిచారు.
TG: యూపీఎస్సీ సివిల్స్ విజేతలకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న వారిలో 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరిలో సృజన, తరుణ్, లక్ష్మీరచన, వెంకటేష్, కౌశిక్, ప్రీతి, విక్రం, విక్రమ్ సింహారెడ్డి, ఆశిష్, విజయసింహారెడ్డి, నవీన్, రాహుల్, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, ఇస్లావత్ శ్రీరామ్, బానోత్ భరత్, ప్రత్యూష్ కట్టా, జితేందర్ నాయక్, దీపక్ శర్మ ఉన్నారు.