• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గజదొంగ చౌహన్ రవిపై పీడీ యాక్ట్

ADB: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చౌహన్ రవి(34)పై పీడీ చట్టం కింద జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సిఫార్సు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు సీఐ స్వామి తెలిపారు. రవి ఉత్తర తెలంగాణలో 26 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతానికి అతడిని ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

March 6, 2026 / 07:32 PM IST

విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

NZB: బాల్కొండ మండల పరిధిలోని బోదేపల్లి గ్రామంలో శుక్రవారం కత్తుల మల్లయ్య విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

March 6, 2026 / 07:32 PM IST

ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో రైతుల సమస్య పరిష్కారం

BHNG: చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెంలో లో-వోల్టేజీ సమస్యను పరిష్కరిస్తూ నూతనంగా ఏర్పాటు చేసిన 100కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను సర్పంచ్ జువ్వి నర్సింహ్మ ఈరోజు ప్రారంభించారు. గతంలో గల ట్రాన్స్‌ఫార్మర్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించి దీనిని మంజూరు చేయడం సంతోషకరమన్నారు.

March 6, 2026 / 07:32 PM IST

లిక్కర్ కేసు.. రూ.441 కోట్లు అటాచ్ చేసిన ఈడీ

AP: లిక్కర్ కేసులో నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. కేసిరెడ్డి, వాసుదేవరెడ్డి, చాణక్యలకు సంబంధించిన రూ.441 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో రూ.1048 కోట్లు కొల్లగొట్టారని ఈడీ పేర్కొంది.

March 6, 2026 / 07:32 PM IST

‘మహిళలు సమాజాభివృద్ధిలో భాగం కావాలి’

RR: చేవెళ్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీనివాసులు పాల్గొని మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని, సమాజాభివృద్ధిలో భాగం కావాలన్నారు. ఆడపిల్లలకి విద్యార్థి దశ నుంచి తమ తల్లిదండ్రులు సరైన సహకారం అందిస్తే మహిళలు మరింత ముందుకు వెళ్తారన్నారు.

March 6, 2026 / 07:32 PM IST

ఏపీ అసెంబ్లీని సందర్శించిన కేవీబీ పురం విద్యార్థులు

TPT: కేవీబీ పురం జడ్పీ హైస్కూల్‌కు చెందిన 30 మంది విద్యార్థులు శుక్రవారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులతో ముచ్చటించి అసెంబ్లీ నిర్వహణ, ప్రజాప్రతినిధుల పాత్రపై అవగాహన కల్పించారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం సూచించారు.

March 6, 2026 / 07:31 PM IST

అనారోగ్యంతో తాపీ మేస్త్రి ఆత్మహత్య

MDK: తూప్రాన్ పట్టణానికి చెందిన తాపీ మేస్త్రి తిమ్మాపురం సత్యనారాయణ (55) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు ఎస్సై గంగరాజు తెలిపారు. సత్యనారాయణకు గతంలో బైపాస్ సర్జరీ జరగగా, కొద్దిరోజులుగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. అనారోగ్యం కారణంగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వివరించారు. కూతురు జానకి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

March 6, 2026 / 07:30 PM IST

అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలి: మంత్రి

MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మహబూబాబాద్లో నిర్వహించిన రివ్యూ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.

March 6, 2026 / 07:30 PM IST

‘ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేసే దిశగా కృషి’

KNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా పాలకవర్గం పని చేస్తుందని కరీంనగర్ నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్‌లోని 1, 2 డివిజన్ పరిదిలోని ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, గంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేషంతో కలిసి మేయర్ ప్రారంభించారు.

March 6, 2026 / 07:30 PM IST

స్కూల్ బస్సు, ఆటో ఢీ.. ఒకరు మృతి

TPT: చంద్రగిరి బైపాస్ రోడ్డులో శనివారం స్కూల్ బస్సు ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అన్నమయ్య జిల్లా పులిచెర్ల మండలం పుచ్చలవారిపల్లికి చెందిన చంద్రబాబు తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 6, 2026 / 07:30 PM IST

భక్తజన సంద్రమైన వేములవాడ పుణ్యక్షేత్రం

SRCL: వేములవాడలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో భక్తజన సంద్రమైంది. ప్రతి ఆలయంలో శివరాత్రి రోజున శివ కళ్యాణాలు నిర్వహించడం జరుగుతుంది. కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో కామ దహనం అనంతరం పార్వతి రాజరాజేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇసుక చల్లితే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది.

March 6, 2026 / 07:30 PM IST

ఖమ్మం నగరంలో క్షేత్రస్థాయిలో కమిషనర్ పర్యవేక్షణ

ఖమ్మం నగరంలో 99 రోజుల ప్రగతి ప్రణాళిక అమలును మున్సిపల్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఆయన వివిధ డివిజన్లలో క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టారు. నగరంలో పారిశుధ్య పనులను మిషన్ మోడ్‌లో నిర్వహించాలని, ముఖ్యంగా ఖాళీ ప్లాట్లలో పేరుకుపోయిన చెత్తను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు.

March 6, 2026 / 07:30 PM IST

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఉమ్మడి జిల్లా సదస్సులో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు సమన్వయంతో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ పాల్గొన్నారు.

March 6, 2026 / 07:30 PM IST

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

SDPT: వర్గల్ మండలం నాచారం విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మత్తుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు నాచారం, అనంతగిరిపల్లి, వేలూరు, సీతారాం పల్లి, నర్సంపల్లి, మాదారం పరిధిలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.

March 6, 2026 / 07:30 PM IST

చండూరులో కొత్త బోర్లు ప్రారంభం

NLG: మున్సిపాలిటీ పరిధిలోని 6, 3, 9వ వార్డుల్లో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు కొత్త బోర్లను శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు ప్రారంభించారు. వేసవి కాలంలో ప్రజలకు నీటి కష్టాలు రాకుండా వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ దశరథ, కమిషనర్ ఎల్. మల్లేశం కలిసి ఈ బోర్లను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

March 6, 2026 / 07:30 PM IST