• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఉపాధి హామీ పనులను సక్రమంగా నిర్వహించాలి’

SRPT: చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో ఉపాధి హామీ నిధులతో నిర్మించిన గొర్రెలు, మేకల షెడ్లను, మంగళవారం సూర్యాపేట జిల్లా జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో శిరీష పరిశీలించారు. పనుల వివరాలను రికార్డుల్లో స్పష్టంగా నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల రక్షణకు షెడ్ నెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.

February 24, 2026 / 08:36 PM IST

నేషనల్ వాలీబాల్ పోటీలకు ఎంపికై జిల్లా వాసి

KDP: పోరుమామిళ్ల (M) చెందిన ఫేక్ మాబు షరీఫ్ నేషనల్ వాలీబాల్ టోర్నమెంటుకు ఎంపికయ్యాడు. ఈనెల 25 నుంచి 28 వరకు ఉత్తరప్రదేశ్ మీట్లో జరుగునున్న 14వ సీనియర్ పారసిట్టింగ్ వాలిబాల్ నేషనల్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టీమ్ నుంచి మాబు షరీఫ్ పాల్గొంటారు. జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబడచిన మాబు షరీఫ్ నేషనల్ పోటీలకు ఎంపిక చేశామని వాలీబాల్ అసోసియేషన్ తెలిపింది.

February 24, 2026 / 08:34 PM IST

జిల్లాలో మెగా జాబ్ మేళా

W.G: భీమవరంలోని శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఈ నెల 27న నిర్వహించనున్న మెగా ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మంగళవారం భీమవరం కలెక్టరేట్‌లో ఇందుకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ మేళాలో సుమారు 21 ప్రముఖ కంపెనీలు పాల్గొని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలన్నారు.

February 24, 2026 / 08:34 PM IST

‘రాష్ట్రంలో జంగిల్‌రాజ్, గురజాలలో గుండారాజ్ నడుస్తోంది’

PLD: జూలకల్లులో టీడీపీ నేతల దాడిలో గాయపడిన వైసీపీ నాయకుడు రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించారు. రాష్ట్రంలో జంగిల్‌రాజ్, గురజాలలో గుండారాజ్ నడుస్తోందని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే యరపతినేని అభివృద్ధిని గాలికొదిలి రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల అండతో ఇప్పటికే ఐదుగురు వైసీపీ నేతలపై దాడులు చేశారని అన్నారు.B

February 24, 2026 / 08:32 PM IST

ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ADB: జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కౌన్సిలర్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:32 PM IST

‘ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి’

MHBD: బయ్యారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుండి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ పర్యవేక్షణలో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులను ఏర్పాటు చేశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

February 24, 2026 / 08:32 PM IST

మదర్ డెయిరీ సమస్యలపై ఎమ్మెల్యేల సమీక్ష సమావేశం

NLG: మదర్ డెయిరీలో నెలకొన్న సమస్యలపై ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో MLAలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని డెయిరీ ప్రస్తుత పరిస్థితిని సమీక్షించారు. డెయిరీ ఎదుర్కొంటున్న సవాళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

February 24, 2026 / 08:31 PM IST

గుంటూరులో మహిళా గ్రీవెన్స్

GNTR: పశ్చిమ టీడీపీ ఆఫీసులో మహిళా గ్రీవెన్స్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆదేశాలతో దీన్ని నిర్వహించారు. నియోజకవర్గ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పింఛన్లు, ఇళ్లు, ఉపాధి తదితర సమస్యలపై వినతులు ఇచ్చారు. తెలుగు మహిళా అధ్యక్షురాలు ముత్తినేని శివలీల, ఇతర నేతలు వీటిని స్వీకరించారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

జిల్లాలో నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవు: ఎస్పీ

WNP: మైనర్ మానసిక వికలాంగురాలిపై జరిగిన అత్యాచార కేసులో నేరం రుజువవ్వడంతో నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 25 వేల జరిమానా, కఠిన తీర్పునిచ్చినట్లు జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఇలాంటి కఠిన తీర్పులు సమాజానికి రక్షణ కవచం లాంటివి అన్నారు. ఏ అన్యాయం జరిగినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎస్పీ సునీత రెడ్డి అన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

సర్పంచుల శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

WGL: గీసుకొండ (M) కేంద్రంలోని గంగాదేవి పల్లె గ్రామంలో నల్లబెల్లి మండలానికి చెందిన సర్పంచుల కోసం నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో కృషి చేయాలని సర్పంచులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

నాటు సారా కేసులో ఇద్దరికి బైండోవర్‌

ELR: చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాత నాటు సారా కేసుల ముద్దాయిలను మంగళవారం తహసీల్దార్‌ కార్యాలయంలో హాజరుపరిచారు. వనమా కొండలరావు, కటారి కోటేశ్వరరావులపై మండల మెజిస్ట్రేట్ సమక్షంలో 129 BNSS కింద బైండోవర్ విధించినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. వారు భవిష్యత్తులో నేరాలకు పాల్పడకుండా సత్ప్రవర్తనతో మెలగాలన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

అంగన్వాడీల రెండు రోజుల నిరాహారా దీక్షలు

SKLM: తమ డిమాండ్ల సాధకు అంగన్వాడీ వర్కర్లు రెండు రోజుల నిరాహారా దీక్షలకు బుధవారం నుంచి సమయత్తం అవుతున్నారని సీఐటీయు ప్రతినిధి పి. తెజేశ్వరరావు మంగళవారం తెలిపారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలనే ప్రధాన డిమాండ్, ఇతర సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిరావుబాపూలే పార్క్ వద్ద నిరాహార దీక్షలకు దిగుతామన్నారు.

February 24, 2026 / 08:30 PM IST

‘సచివాలయ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయాలి’

ASR: రోజువారీ హాజరు నమోదు చేయకుండా, సమయపాలన పాటించకుండా, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సచివాలయ ఉద్యోగుల వేతనాలను నిలిపివేయాలని కలెక్టర్ దినేష్ కుమార్, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి కుమార్‌ను మంగళవారం ఆదేశించారు. పర్యవేక్షణ చేయని అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆదేశించారు.

February 24, 2026 / 08:30 PM IST

తౌశిక్ కుటుంబాన్ని పరామర్శించిన కదిరి బాబురావు

ప్రకాశం: సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ సైనిక్ స్కూల్‌లో ఇటీవల మరణించిన విద్యార్థి తౌశిక్ కుటుంబ సభ్యులను మంగళవారం కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుని, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

February 24, 2026 / 08:30 PM IST

క్రీడా పోటీల్లో పాల్గొన్న జిల్లా ఎమ్మెల్యేలు

ATP: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో మంగళవారం ఎమ్మెల్యేల క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఈ పోటీల్లో ఎమ్మెల్యే బండారు శ్రావణి, ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఉత్సాహంగా పాల్గొని క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ప్రజా సేవలో నిరంతరం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలిచాయి.

February 24, 2026 / 08:30 PM IST