• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దర్శనం తర్వాత నేరుగా ఇంటికే ఎందుకు?

పుణ్యక్షేత్రం దర్శించిన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లాలని శాస్త్రాలు ఎక్కడా చెప్పలేదు. కానీ, ఇదొక ఆచారంగా వస్తోంది. దైవ దర్శనం వల్ల కలిగిన ప్రశాంతతను, దివ్యానుభూతిని కోల్పోకుండా ఉండటమే దీని ప్రధాన ఉద్దేశం. ఇతర ఇళ్లకు వెళ్తే ప్రాపంచిక విషయాల వల్ల ఆ భక్తిభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అందుకే ఆ అనుభూతిని పదిమందికి పంచాలని పెద్దలు చెబుతుంటారు.

February 26, 2026 / 09:42 PM IST

మత ఘర్షణలకు కాంగ్రెస్సే కారణం: MIM

TG: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్, సీఎం రేవంత్ తీరు ఒకటే అని అన్నారు. యూపీలో ఎలాగైతే బుల్డోజర్ తో మసీదులు, దర్గాలు కూల్చారో.. అలాగే తెలంగాణలోనూ కూల్చేస్తున్నారని విమర్శించారు. ముస్లింల ప్రస్తావన వస్తే బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనన్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ ను క్షమించి మద్దతిచ్చామన్నారు. దేశంలో మత ఘర్షనలకు కాంగ్రెస్సే కారణమన్నారు.

February 26, 2026 / 09:38 PM IST

రాత్రిపూట టిఫిన్ చేస్తున్నారా..?

రాత్రిపూట అన్నం మానేసి టిఫిన్ తినడం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే టిఫిన్ రకాన్ని బట్టి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇడ్లీ, ఉప్మా వంటివి త్వరగా జీర్ణమై శరీరానికి హాయినిస్తాయి. కానీ, నూనెలో వేయించిన పదార్థాలతో ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాత్రిపూట జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే తేలికపాటి టిఫిన్‌తో ముగించడం మంచిది.

February 26, 2026 / 09:34 PM IST

చిందేపల్లిలో ఘనంగా రక్తదాన శిబిరం

TPT: ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో గురువారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా నిర్వహించారు. డా. గంగలపూడి గిరిధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ శిబిరంలో తిరుపతి రక్షణ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. గ్రామానికి చెందిన సుమారు 35 మంది యువకులు, పెద్దలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

February 26, 2026 / 09:34 PM IST

ఇంటి పన్ను వసూళ్లను పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో

ELR: ఉంగుటూరు(మం) రాచూరులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్ళి ఇంటి పన్ను, కుళాయి పనులు వసూళ్లు చేస్తున్నారు. డిప్యూటీ ఎంపీడీవో జీ. రమేష్ బాబు పన్ను వసూళ్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలములో ఇంటి పన్ను వసూళ్లు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శి సుజాత, సచివాలయ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

February 26, 2026 / 09:33 PM IST

రైతులకు ఈ-నామ్ 2.0 రిజిస్ట్రేషన్ తప్పనిసరి

KRNL:: వ్యవసాయ మార్కెట్ యార్డులో పంటలు విక్రయించే రైతులు ఈ-నామ్ 2.0 పోర్టల్లో వన్-టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని కార్యదర్శి గోవిందు ఇవాళ స్పష్టం చేశారు. జాతీయ వ్యవసాయ మార్కెట్ అమలులో భాగంగా తెచ్చిన ఈ కొత్త నిబంధన వల్ల రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని వెల్లడించారు. మార్చి నుంచి రైతులు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.

February 26, 2026 / 09:31 PM IST

మార్చి 2 నుంచి అభివృద్ధి కార్యక్రమాలు

TG: మార్చి 2 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రంలో సంక్షేమం, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అభివృద్ధి పనులపై ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా గ్రామీణాభివృద్ధి, మున్సిపల్, వైద్య, విద్యా, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రెవెన్యూ శాఖల ప్రణాళిక రూపొందించాలని పేర్కొంది.

February 26, 2026 / 09:30 PM IST

ఇక నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: రేవంత్ రెడ్డి

TG: నర్సరీ నుంచి యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విద్యాకమిషన్ సూచనలు చేసింది. DEIED కోర్సు రద్దు చేయాలని.. బీఈడీ విద్యార్థులకు 150 రోజుల టీచింగ్ ట్రైనింగ్ ఉండాలని పేర్కొంది. మరోవైపు వచ్చే విద్యాసంవత్సరం నుంచి 100 నియోజకవర్గాల్లోని 200 ప్రభుత్వ పాఠశాలలను ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’గా అప్ గ్రేడ్ చేయనున్నట్లు CM రేవంత్ ప్రకటించారు.

February 26, 2026 / 09:29 PM IST

భద్రకాళి ఆలయంలో హీరో అడివి శేషు ప్రత్యేక పూజలు

WGL: వరంగల్ NITలో జరుగుతున్న ‘స్ప్రింగ్ స్పీ’ వేడుకల్లో పాల్గొనేందుకు సినీ హీరో అడవి శేషు ఇవాళ నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదాశీర్వచనం అనంతరం అమ్మవారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

February 26, 2026 / 09:28 PM IST

‘రాకాస’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న మూవీ ‘రాకాస’. ఇందులో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తుండగా.. దర్శకురాలు మానస శర్మ తెరకెక్కిస్తోంది. మార్చి 1న ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న విడుదల చేయనున్నారు.

February 26, 2026 / 09:25 PM IST

పుంగనూరులో బ్రహ్మోత్సవాల సందడి

అన్నమయ్య: పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై పుర వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భజన కోలాటాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయంలో విశేష హోమాలు, అన్నప్రసాద వితరణ కొనసాగుతున్నాయి.

February 26, 2026 / 09:23 PM IST

BREAKING: ప్రభుత్వానికి కీలక సూచనలు

TG: రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా కమిషన్ కీలక సూచనలు చేసింది. టీచర్లకు ఆటోమేటిక్ పదోన్నతులకు రద్దుకు సూచనలు చేసింది. పనితీరు ఆధారంగానే ప్రమోషన్లు ఇవ్వాలని సూచించింది. ఐదేళ్లకు ఒకసారి ఉపాధ్యాయుల పనితీరు అంచనా తప్పనిసరి అని చెప్పింది. రెండేళ్లలో మెరుగుపడకపోతే సర్వీసు నుంచి తొలగించాలని పేర్కొంది. ఇకపై నియమించే ఉపాధ్యాయులకు కొత్త నిబంధనలు వర్తించాలని వెల్లడించింది.

February 26, 2026 / 09:15 PM IST

హత్య కేసును చేధించిన పోలీసులు

AP: అన్నమయ్య జిల్లా గాలివీడు హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 17న జరిగిన రామకృష్ణారెడ్డి హత్య కేసులో మహేశ్వర్ రెడ్డి సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. రూ.10 లక్షలు సుపారీ తీసుకుని రామకృష్ణారెడ్డిని హత్య చేసినట్లు గుర్తించారు. భూతగాదాలే ఈ హత్యకు కారణమని వెల్లడైంది. రామకృష్ణా రెడ్డి భార్య ఫిర్యాదు చేయడంతో.. CC ఫుటేజీ, సాంకేతికత ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు.

February 26, 2026 / 09:11 PM IST

అంతర్రాష్ట్ర గంజాయి రవాణా గుట్టు రట్టు

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. సుమారు 80 ప్యాకెట్లలో 408.185 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువను సుమారు రూ.2 కోట్లపైనే ఉంటుందని అంచనా వేశారు.

February 26, 2026 / 09:07 PM IST

T20 WC: చరిత్ర సృష్టించిన టీమిండియా

జింబాబ్వేతో మ్యాచ్‌లో టీమిండియా 256/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2007లో ఇంగ్లండ్‌పై చేసిన 218/4 పరుగుల రికార్డును ఈ మ్యాచ్‌తో భారత్ అధిగమించింది. అలాగే, T20 WC చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక పరుగులు చేసిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో శ్రీలంక(260/6) అగ్రస్థానంలో కొనసాగుతోంది.

February 26, 2026 / 09:05 PM IST