MBNR: మిడ్జిల్ మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ‘స్వయం పరిపాలన’ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెడ్ మాస్టర్ తారాసింగ్ మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయని కొనియాడారు.
VZM: రైతన్నల భూ సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి పేర్కొన్నారు. సోమవారం నెల్లిమర్ల మండలం ధనానపేటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “మీ భూమి-మీ హక్కు”కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
SRPT: తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట ప్రెస్ క్లబ్‌లో జరిగిన సమావేశంలో నేతలు యాతాకుల రాజన్న, ఏపూరి రాజు మాట్లాడారు. రాజ్యసభ సీటు కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత తీసుకోవాలని, తగిన ప్రాతినిధ్యం కల్పించాలని వారు అన్నారు.
ATP: గుత్తి కౌన్సిల్ హాల్లో సోమవారం స్వచ్చంద్ర, స్వర్ణాంధ్ర పై వివిధ శాఖల అధికారులతో మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. శుభ్రత మీద ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలనేది స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్లాస్టిక్‌ని ప్రతి ఇంటి, పరిసరాలలో వాడకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
E.G: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లలో ప్రజలు సమర్పించిన 8 అర్జీలను సకాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని RDO ఎం.సుజాత అధికారులు సూచించారు. సోమవారం రాజమండ్రిలోని RDO కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రెవిన్యూ క్లినిక్, PGRSకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలపై విచారణ చేసి పరిష్కరించాలని సూచించారు.
MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు ఎంపీడీవో గీతాంజలి ఆధ్వర్యంలో ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు. పంచాయతీ చట్టం, నాయకత్వ లక్షణాలు, కార్యదర్శుల విధులపై అవగాహన కల్పించారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
TPT: సత్యవేడు ప్రభుత్వ బాలికల కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని తలారి కీర్తి ప్రతిష్టాత్మకమైన ఇన్‌స్పైర్ మానాక్ అవార్డుకు ఎంపికయ్యారు. ‘మైక్రో లెదర్’ అనే పర్యావరణ హిత ప్రాజెక్టును సమర్పించడం ద్వారా ఈ గుర్తింపు పొందారు. విద్యార్థిని ఉపాధ్యాయులు అభినందిస్తూ.. మరిన్ని శాస్త్రీయ ఆవిష్కరణలు చేయాలని ఆకాంక్షించారు.
PPM: మందుగుండు తయారీదారులు భద్రతా ప్రమాణాలు పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సింహాచలం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత నెల 28న కాకినాడ జిల్లా సామర్లకోటలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో హోం మినిష్టర్ వి.అనిత ఆదేశాల మేరకు జిల్లాలోని ఫైర్ క్రాకర్స్ తయారీ కేంద్రాలను అగ్నిమాపక శాఖ, బాల కార్మికుల నిర్ములన శాఖ అధికారులు తనిఖీ చేశారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 6లో 6.15 గుంటల భూమి ఎర్రగుంట ఉండేదని.. 2019లో కొందరు వెంచర్ యజమానులు రికార్డులను తారుమారు చేసి అనుమతులు పొందారని BC, SC, ST మండల జేఏసీ నాయకులు మధు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఎర్రగుంట భూమిని సర్వే చేసి అనుమతులు రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ కేసులో నమోదు చేయాలన్నారు.
TG: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు బెయిల్ మంజూరు అయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి చేసిన కేసులో.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం రామకృష్ణపురం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జిల్లా కోర్టులో రిమాండ్‌గా ఉన్నారు.
AP: ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే EAPCET దరఖాస్తుల సమర్పణకు గడువు తేదీని పొడిగిస్తున్నట్లు కన్వీనర్ ఎన్.మోహన్‌రావు వెల్లడించారు. మార్చి 17 వరకు ఆలస్య రుసుము లేకుండా, రూ.1000తో మార్చి 21, రూ.2 వేలతో మార్చి 25, రూ.4 వేలతో మార్చి 30, రూ.10 వేలతో ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 4-6 వరకు తప్పుల సవరించుకోవచ్చని చెప్పారు.
KKD: పిఠాపురం పాదగయ క్షేత్రం గ్రహణం రోజున కూడా తెరిచే ఉంటుంది. రేపు మంగళవారం చంద్రగ్రహణం మధ్యాహ్నం గం. 3.20 నుంచి రాత్రి 7 గంటల వరకు ఉంది. అయినా సరే పాదగయ క్షేత్రం తెరిచే ఉండి కుక్కుటేశ్వర స్వామికి పూజలు యధాతధంగా చేస్తారు. భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక ఆలయం మండపం వద్ద గ్రహణ సమయంలో బ్రాహ్మణులు జపాలు చేస్తారు.
SDPT: భూంపల్లి-అక్బర్పేట్ మండలం ఖాజీపూర్‌లో శ్రీ మల్లన్న కళ్యాణ మహోత్సవం జరిగింది. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్వాహకులను అభినందించి, గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
TG: ఇరాన్ దాడులపై 6 గల్ఫ్ దేశాలు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఇరాన్ దాడులు తక్షణమే ఆపాలని హెచ్చరించాయి. దాడులు ఆపకపోతే తమను తాము రక్షించుకునేందుకు ప్రతిదాడులు తీవ్రంగా చేయాల్సి వస్తుందని తెలిపాయి. ఇరాన్ దాడుల వల్ల ప్రాంతీయ భద్రతకు తీవ్ర ముప్పు ఉందని పేర్కొన్నాయి.. ఈ మేరకు ఖతార్, సౌదీ, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ ప్రకటన చేశాయి.