KRNL: వెల్దుర్తి(మం) కలుగొట్ల గ్రామానికి ఎమ్మిగనూరు ఎమ్మార్పీఎస్ నేతలు వెళ్లి జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు భాస్కర్‌ను పరామర్శించారు. ఇటీవల ఆయనపై జరిగిన హత్యాయత్నం నుంచి ప్రాణాపాయం తప్పించుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఘటనపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన సంజూ(24), అభిషేక్(55) తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన ఇషాన్(33), సూర్య(33), పాండ్యా(50), తిలక్(44) సమష్టిగా రాణించడంతో.. 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బౌలర్లలో నగారవ, ముజారబానీ, మాపోసా, సికందర్ తలో వికెట్ పడగొట్టారు.
తూ.గో: నవ జనార్ధన ఆలయాల్లో ప్రముఖమైన ఆలమూరు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి వారి ఆలయాన్ని గురువారం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ బైరిశెట్టి రాంబాబు స్వాగతం పలికారు. స్వామి వారిని ఎమ్మెల్యే బత్తుల దర్శించుకున్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
SKLM: నిరుద్యోగులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ఎచ్చెర్ల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో పీఎం ఉపాధి కల్పన పథకం, సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల పథకం లబ్ధిదారులకు నుంచి శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
నెల్లూరు: నగర కార్పొరేషన్ మేయర్‌గా నూతనంగా ఎన్నికైన దేవరకొండ సుజాత దంపతులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వారిని శాలువాతో సత్కరించి ఆశీసులు అందుకున్నారు. ఈ సందర్భంగా మేయర్‌కు వీపీఆర్ దంపతులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయాలని సూచించారు.
KMR: దోమకొండ మండలం అంచనూర్‌లో దోమల బెడద నివారణకు సర్పంచ్ జనగామ నరేష్ ఆధ్వర్యంలో ఫాగింగ్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలుగా ఫాగింగ్ చేపట్టామని తెలిపారు. కార్యక్రమానికి గ్రామస్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇలాంటి చర్యలు కొనసాగించాలని కోరుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
SKLM: డయేరియాను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతోందని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. డయేరియా ప్రభావిత ప్రాంతాలలో ఫాస్ట్ ఫుడ్, మాంసం దుకాణాల తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించడం ద్వారా పరిస్థితిని వేగంగా అదుపులోకి తేవచ్చని తెలిపారు.
NZB: కమ్మర్పల్లి మండలం హస కొత్తూర్ గ్రామంలోని హరిహర క్షేత్రంలో అన్నపూర్ణ సమేత మహాదేవస్వామి కల్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో స్వామివారి సుప్రభాత సేవ, కల్యాణ ఘట్టాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నెలిమెల రేవతి గంగారెడ్డి, వీడీసీ అధ్యక్షులు బంగ్లా లింబాద్రి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
NZB: కమ్మర్పల్లికి చెందిన బొడ్డు సుజాత న్యూరో సంబంధిత వ్యాధితో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ.2 లక్షల ఎల్ఎసీ పత్రాన్ని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో ఆర్థికసాయం అందించి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
WGL: వాహనదారులు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని మద్యం సేవించి వాహనం నడపోద్దని వరంగల్ ట్రాఫిక్ ACP సత్యనారాయణ అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో పట్టుపడిన వాహనదారులకు నేడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ, నిబంధనలు పాటించాలని అన్నారు. హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్ సీతారెడ్డి, తదితరులు ఉన్నారు.
MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని MLA గడ్డం వినోద్ అన్నారు. గురువారం కాసిపేట్ మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి పనులు ప్రారంభించారు. MLA మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు నిర్వహించనున్న 10వ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ డేవిడ్ గురువారం సూచించారు. ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో క్రమశిక్షణ, గోప్యత పాటించాలని, మొబైల్ ఫోన్లను అనుమతించవద్దని తెలిపారు.
ASR: డుంబ్రిగుడ మండలం సాగర పంచాయతీని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పెషల్ మానిటర్ (గిరిజన సంక్షేమం) హేమంత్ కుమార్ గురువారం సందర్శించారు. గిరిజనుల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, అటవీ భూమి హక్కులు, విద్యా-ఆరోగ్య సదుపాయాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామస్థుల నుంచి వినతులు స్వీకరించి, తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
PPM: మక్కువ మండల కేంద్రంలో సాలూరు రవాణా శాఖ అధికారి జేవిఎస్ఎస్ ప్రసాద్ వాహనదారులకు స్పెషల్ డ్రైవ్ గురువారం నిర్వహించారు. వాహనదారులు విధిగా టాక్స్‌లు పెండింగ్ లేకుండా చూడాలని ఫిట్నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ వాహనానికి అన్ని రికార్డులను ఉంచుకోవాలని వాహనదారులకు ఆయన సూచించారు. ఫిట్నెస్ లేని వాహనాలపై చర్యలు తీసుకుంటామని వాహనదారులందరూ తప్పక నిబంధనలు పాటించాలన్నారు.
BDK: బూర్గంపాడు మండలం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సింగారం రోడ్డు ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజనుల పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి లేక గిరిజన ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారని మణుగూరు చెరువు సింగారం రోడ్డు మార్గం చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.