కర్నూలు: యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ ఎస్ఈ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. డి అంజిబాబు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కోటి రూపాయల ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సమాన వేతనం కల్పించాలని కోరారు.
ATP: జిల్లాలో మార్చి 3 నుంచి 5 వరకు ‘జనగణన-2027’ మొదటి దశ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఏ. మలోల తెలిపారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో సుమారు 200 మంది అధికారులకు ఈ శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. ఇళ్ల జాబితా, గృహ గణన అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు.
కడప: వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇద్దరు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో రామలక్షణ రెడ్డి, శివకోటి రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటికే పలువురు కార్పొరేటర్ టీడీపీలో చేరగా.. మరో ఇద్దరు నూతనంగా చేరారు.
W.G: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తణుకులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణికు శుక్రవారం నిర్వాహకులు ఆహ్వానం అందజేశారు. ఆదరణ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం పోస్టర్ కలెక్టర్ నాగరాణి భీమవరం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆశాజ్యోతి పాల్గొన్నారు.
CTR: ఓటర్ల క్లెయిమ్‌లు వేగవంతంగా పరిష్కారించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 15,77,743 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లా 2002-2025 ఎన్నికల జాబితాతో SIR మ్యాపింగ్‌లో 74.45% పురోగతిని సాధించడం జరిగిందని తెలిపారు.
EG: ఉండ్రాజవరం మండలం తాడిపర్రు జడ్పీ హైస్కూల్లో 10th క్లాస్ బ్యాచ్ ఫేర్‌వెల్ కార్యక్రమం హెచ్ఎం అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. సుమారు 60 విద్యార్థులకు ఉపాధ్యాయులు వీడ్కోలు పలికారు. మార్చి 16 నుంచి జరగబోయే పరీక్షలకు ప్రతి ఒక్కరూ కష్టపడి విజయం సాధించాలని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. జిల్లా కిషన్ మోర్చా సంయుక్త కార్యదర్శి అక్కిన గోపాలకృష్ణ పాల్గొన్నారు.
CTR: పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం సైన్స్ మేళా నిర్వహించారు. విద్యార్థులు తయారుచేసిన తమ సైన్స్ ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించి వివరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే ఒక అద్భుతమైన వేదికే సైన్స్ మేళా అన్నారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణం 28వ వార్డులో నూతనంగా నిర్మించిన డ్రైనేజ్ కాలువకు పైకప్పులు లేకపోవడం చుట్టూ గ్రావెల్ పరచకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రజలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ధర్మవరం బీజేపీ నేత హరీష్ బాబు శుక్రవారం స్థలాన్ని పరిశీలించారు. కాలువపై భద్రతా పైకప్పులు ఏర్పాటు చేసి, గ్రావెల్ పరిచే పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
SRCL: పీఎం శ్రీ కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో అమలు అవుతున్న కార్యక్రమాలను పీఎంశ్రీ నోడల్ అధికారి, కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయాలను సందర్శించారు. జిల్లాలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
ADB: రాష్ట్రీయ పర్ధాన్ జనజాతి ఉద్దాన్ సంఘటన్ సంస్థ సభ్యులు జిల్లా కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మార్చి 15న నిర్వహించనున్న గోండి ధర్మ గురు హిరాసుకా లింగో జయంతి ఉత్సవాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ రావు, శంకర్, మాధవ్, తదితరులు ఉన్నారు.
NZB: ముప్కాల్ మండలం వేంపల్లిలో శుక్రవారం కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. రూ.1.16 లక్షల విలువైన రెండు చెక్కులను ఇద్దరు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. లబ్ధిదారులు సీఎం రేవంత్, బాల్కొండ కాంగ్రెస్ ఇంఛార్జ్ సునీల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేంపల్లి సర్పంచ్ మహేశ్ యాదవ్, రెవెన్యూ అధికారులు, గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లయ్య పాల్గొన్నారు.
NZB: భీమ్‌గల్ మండలం రహత్ నగర్లో సేవాలాల్ జయంతి వేడుకల్లో రాష్ట్ర సహకారయూనియన్ ఛైర్మన్ మానాల మోహన్ రెడ్డి పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. గిరిజన అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. గిరిజన ప్రాంతంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్ జంగా శిరీష ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న బావిని పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయిస్తున్నారు.
JGL: అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బీ. రాజ గౌడ్ శుక్రవారం కోరుట్లలోని కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయం(KGBV) పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, విద్యా ప్రగతి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. హాస్టల్ సదుపాయాలు, తాగునీటి వసతులు పరిశీలించి వంటగదిని సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, నిల్వ విధానాలపై ఆరా తీశారు.
PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కొండపల్లి సత్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరారు . మండలానికి సంబంధించి అధికారులందరూ ప్రగతి నివేదికతో కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.