• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి’

అన్నమయ్య: రాయచోటిలో మంగళవారం నుంచి రాయలసీమ జిల్లాల ఎంఈవోలు, డైట్ అధ్యాపకులకు రెండు రోజుల GFLN శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులలో చదవడం, గణిత నైపుణ్యాలను పెంచడమే ఈ శిక్షణ లక్ష్యమని డీఈవోలు తెలిపారు. మార్చి 2026 నాటికి లక్ష్యాలను చేరుకోవడానికి 75 రోజుల కార్యాచరణను పగడ్బందీగా అమలు చేయాలని సూచించారు.

February 25, 2026 / 09:27 AM IST

నేడు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం

KRNL: హొళగుందలో నేడు వైసీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ షఫీ ఉల్లా తెలిపారు. ఈ సమావేశానికి ఆలూరు MLA బూసినే విరూపాక్షి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. కొగిలాతోట రోడ్డులోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ZPTCలు, MPP, MPTCలు, సర్పంచులు, నాయకులు పాల్గొనాలన్నారు.

February 25, 2026 / 09:26 AM IST

ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు

TG: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు మొదలయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరుగుతోంది. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తుతో పాటు సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.

February 25, 2026 / 09:23 AM IST

చంద్రశేఖరపురంలో పులి సంచారం

ప్రకాశం: చంద్రశేఖరపురం మండలం డీజీపేట తుంగోడు ఘాట్ రోడ్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కనిగిరి ఎఫ్ ఆర్ ఓ తుమ్మా ఉమామహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని తుంగూడు, వెంకటాయ చెరువు ప్రాంతాల్లో పులి సంచరిస్తుందని రాత్రి సమయంలో ప్రయాణం చేయవద్దని, పశుకాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

February 25, 2026 / 09:21 AM IST

విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఆస్తి నష్టం

ATP: గుత్తి మండలం బాచుపల్లి గ్రామంలో రామాంజనేయులు అనే వ్యక్తి ఇంట్లో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో బీరువాలో ఉన్న రూ.2.30 లక్షల నగదు, నిత్యవసర సరుకులు మంటల్లో ఖాళీ పూర్తయ్యాయని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వాపోయాడు.

February 25, 2026 / 09:20 AM IST

చిన్నారి ప్రాణం కాపాడేందుకు ఎమ్మెల్యే చొరవ

BPT: గుండె సమస్యతో బాధపడుతున్న ఇంకొల్లు మండలానికి చెందిన శిశువు చికిత్స కోసం మంగళవారం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భారీ సాయం అందించారు. సొంత నిధుల నుంచి రూ. 50 వేలు ఇవ్వడంతోపాటు, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ. 3.02 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే సహకారంతో గుంటూరులోని ఆసుపత్రిలో చిన్నారికి అత్యవసర చికిత్స కొనసాగుతోంది.

February 25, 2026 / 09:20 AM IST

మార్చి 5న విశ్రాంత ఉద్యోగుల సమావేశం

TPT: తితిదే విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చి 5న ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు రెడ్డివారి ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. దేవస్థానం పరిపాలన కార్యాలయ ఆవరణలో జరిగే ఈ సమావేశానికి విశ్రాంత ఉద్యోగులు హాజరుకావాలని ఆయన కోరారు.

February 25, 2026 / 09:20 AM IST

ఈనెల 28న పింఛన్ పంపిణీ

కృష్ణా: మార్చి నెల పెన్షన్లను ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు మొవ్వ MPDO డి. సుహాసిని తెలిపారు. ఒకటవ తేదీ ఆదివారం కావడంతో ఈ నెల 28వ తేదీన ముందుగానే అందజేయనున్నట్లు ఆమె చెప్పారు. NTR భరోసా పింఛన్ పథకం కింద మండలంలో 8,315 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 3,59,83,500 నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

February 25, 2026 / 09:15 AM IST

రాంబిల్లిలో గ్రీన్ ఫీల్డ్ లిథియం కంపెనీ

VSP: రాంబిల్లి మండలంలో గ్రీన్ ఫీల్డ్ లిథియం కంపెనీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఏర్పాటు చేసే బాలాజీ యాక్షన్ బిల్డ్ వేస్‌కు ప్రోత్సాహకాలు అందిస్తారు. రూ.8,175 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే కంపెనీలో 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

February 25, 2026 / 09:15 AM IST

పలుచోట్ల విజిలెన్స్ అధికారుల తనిఖీలు

AP: అనంతపురంలో విజిలెన్స్ అహార తనిఖీ విభాగం అధికారులు మూడు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. శ్రీకంఠం కూడలి కల్యాణదుర్గం బైపాస్ రామ్‌నగర్‌లో ప్రైవేట్ వ్యాపారుల నుంచి పాల నమూనాలు సేకరించారు. విశాఖ అక్కయ్యపాలెం, మద్దిలపాలెంలోని పలు మిల్క్ ప్రొడక్ట్ సంస్థల్లో ఫుడ్ ఇన్‌స్ఫెక్టర్, అధికారులు సోదాలు చేశారు. పాలు, పాల ఉత్పత్తుల నమూనాలను ల్యాబ్‌లకు పంపించారు.

February 25, 2026 / 09:15 AM IST

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లు స్వాధీనం

WNP: పెబ్బేరు మండలం బూడిదపాడు గ్రామంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తుండగా బూడిదపాడు వాగులో నుంచి 2 ఇసుక ట్రాక్టర్లు బయటకు రావడం జరిగింది. వాటి పర్మిషన్ అడగగా ఎలాంటి అనుమతులు లేవని చెప్పడంతో అట్టి ట్రాక్టర్లను,డ్రైవర్ వెంకటయ్య,శేఖర్ అనే 2 వ్యక్తుల పైనా కేసు నమోదు చేశారు.స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేసి అట్టి రెండు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 09:13 AM IST

పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా సభ్యుడిగా బాబు

SRCL: రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు బాబుకు అంతర్జాతీయ పారా వాలీబాల్ కోచ్ అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లోని ఐచి-నగోయాలో జరగనున్న 2026 ఆసియా పారా గేమ్స్ కోసం భారత జట్టును ఎంపిక చేసే సాంకేతిక పరిశీలకులు, ఎంపిక కమిటీ సభ్యుడిగా పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా ఆయన్ను నామినేట్ చేసింది.

February 25, 2026 / 09:11 AM IST

ఉచిత పశు వైద్య శిబిరం..

నల్లగొండ: జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ రాజశేఖర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఏర్పాటు చేసే ఉచిత పశువైద్య శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంగళవారం కట్టంగూర్‌ మండలంలోని భాస్కరబాయి గ్రామంలో పశు సంవర్ధక శాఖ, పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పశు వైద్య శిబిరాన్ని పరిశీలించారు.

February 25, 2026 / 09:11 AM IST

సింగరేణి గనిలో ప్రమాదం కార్మికుడికి గాయాలు

PDPL: రామగుండం సింగరేణి 11వ బొగ్గు గనిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఐలయ్య అనే కోల్ కట్టర్ తీవ్రంగా గాయపడ్డారు. గనిలో బ్లాస్టింగ్ అనంతరం అకస్మాత్తుగా సైడ్ ఫాల్ (బొగ్గు పెల్లలు) పడడంతో ఆయన నడుము, కుడి కాలుకు గాయాలయ్యాయి. బాధితుడిని జీడీకే సింగరేణి ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

February 25, 2026 / 09:11 AM IST

హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ స్కాలర్షిప్ రాట్లే. !

HYD: హైదరాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు గత మూడు సంవత్సరాల స్కాలర్షిప్‌లు అందకపోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెల రూ.750 చొప్పున 10 నెలలకు రూ.7,500 ఇవ్వాల్సి ఉండగా నిధులు విడుదల కాలేదని తెలిపారు. పెండింగ్ మొత్తాన్ని వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

February 25, 2026 / 09:10 AM IST