• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డీఎస్పీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహణ

ప్రకాశం: అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ఆదేశాల మేరకు, పోలీస్ అధికారులు ఒంగోలు పోలీస్ కళ్యాణ మండపంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళా దినోత్సవ వారోత్సవాల భాగంగా వారం రోజులపాటు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 06:43 PM IST

SC, ST విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా శంకర్

NLG: ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం టీజీ రాష్ట్ర కార్యదర్శిగా కట్టంగూరు మండలంలోని ఎరసానిగూడెంకు చెందిన బండారు శంకర్‌ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్ నియమించారు. SC, ST, BC మైనార్టీ విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తూ, సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని శంకర్ తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

March 3, 2026 / 06:43 PM IST

టీమిండియాపై అమీర్ మరోసారి చెత్త వాగుడు

పాకిస్తాన్ మాజీ పేసర్ మహమ్మద్ అమీర్ మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. భారత్ సెమీస్ చేరదని వ్యాఖ్యానించి నవ్వులపాలైన అమీర్, ఇప్పుడు టీమిండియా ఫైనల్ చేరదని అన్నాడు. గతంలో భారత్ సెమీస్‌కు వెళ్లదని తాను వేసిన అంచనా కరెక్టే కానీ, సంజూ శాంసన్ ఒక్కడి వల్లే భారత్ గెలిచిందన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో టీమిండియా విఫలమవుతుందని తెలిపాడు.

March 3, 2026 / 06:42 PM IST

జైలు నుంచి రేపు బాల్క సుమన్ విడుదల

ADB: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. చెన్నూర్‌లో నిరసన చేపట్టిన కేసులోనూ కోర్టు మంగళవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ADB జిల్లా జైలు నుంచి ఈ నెల 4న ఉదయం ఆయన విడుదల కానున్నట్లు న్యాయవాది శ్రీకాంత్ తెలిపారు. దీంతో గత నెల 18నుంచి ఆదిలాబాద్ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న సుమన్ రేపు బయటకు రానున్నారు.

March 3, 2026 / 06:41 PM IST

‘హెల్మెట్ ధారణతో ప్రాణాపాయం నుండి రక్షణ పొందండి’

PPM: ద్విచక్ర వాహనాలపై సురక్షితంగా ప్రయాణం సాగించేందుకు ప్రతీ వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ట్రాఫిక్ SI పాప రావు అన్నారు. ప్రతి సంవత్సరం చాలా మంది వాహనదారులు రహదారి ప్రమాదాలలో కేవలం హెల్మెట్ ధరించని కారణంగానే మరణిస్తున్నారని తెలిపారు. వాహనదారులు హెల్మెట్ ధరించక పోవడం వలన రహదారి ప్రమాదాల్లో తలకు తీవ్ర గాయాల పాలై, ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

March 3, 2026 / 06:41 PM IST

సీఎం సదస్సులో పాల్గొన్న కలెక్టర్లు

KNR: హైదరాబాదులోని సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న కలెక్టర్ల సదస్సులో సిరిసిల్ల కలెక్టర్ గరీమ అగర్వాల్ పాల్గొన్నారు. మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల పాటు చేపట్టనున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలుపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

March 3, 2026 / 06:41 PM IST

రేపు సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం ఆదర్శ క్రీడా పాఠశాలలో రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాస్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్ బాల్ పోటీలు నిర్వహించనున్నట్లు సంఘం ప్రతినిధులు శ్యాంసుందర్ రావు మంగళవారం ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరై కోచ్‌కు రిపోర్ట్ చేయాలని సూచించారు. అర్హత సాధించిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.

March 3, 2026 / 06:40 PM IST

గోదావరిలో గల్లంతయ్యింది వీరే..!

BDK: మణుగూరు మండలం గోదావరిలో మంగళవారం స్నానానికి దిగి ఇద్దరు గల్లంతైన విషయం తెలిసిందే. కాగా హోలీ పండుగ సందర్భంగా మల్లెపల్లి సింగరేణి వాటర్ ట్యాంక్ ప్రాంతంలో పద్మగూడెం గ్రామానికి చెందిన గుండి నాగేశ్వరరావు (40), పద్దం ప్రసాద్ (35) (సింగరేణి ఉద్యోగి) స్నానం చేయడానికి గోదావరి నదిలో దిగగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 3, 2026 / 06:40 PM IST

స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసిన సర్పంచ్

MBNR: రాజాపూర్ గ్రామ సర్పంచ్, సర్పంచుల సంఘం రాజాపూర్ మండల అధ్యక్షుడు కావలి రామకృష్ణ మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులోని మినిస్టర్ క్వార్టర్స్‌లో స్పీకర్‌ను కలిసి గ్రామ పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. అనంతరం ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించారు.

March 3, 2026 / 06:40 PM IST

‘అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చిన ఘనత కూటమిదే’

W.G: పాలకొల్లు రూరల్ నాగరాజుపేటలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొనేందుకు రాగా, అక్కడ తనను కలిసిన అంగన్వాడీలతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో 58,204 మంది సిబ్బందికి రూ. 75 కోట్లతో 5జీ స్మార్ట్ ఫోన్లు అందజేసినట్లు మంత్రి చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో రూ. 5.80 కోట్లతో R&బీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

March 3, 2026 / 06:38 PM IST

అక్రమ వెంచర్లు హైడ్రాకు కనిపించడం లేదా?: కవిత

TG: హైడ్రాకు రియల్ ఎస్టేట్ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా..? అని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో స్థానికులతో కలసి కవిత ఆందోళన చేశారు. మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌పై కవిత ఆరోపణలు చేశారు. మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్ నిర్మిస్తున్నారని ధర్నా చేపట్టారు.

March 3, 2026 / 06:38 PM IST

ఒంగోలు నగర అభివృద్ధిపై సమీక్ష సమావేశం

ప్రకాశం: ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన రావులతో కలిసి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మున్సిపల్, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు

March 3, 2026 / 06:38 PM IST

రోడ్ల మరమ్మతులకు రూ. 3 కోట్ల నిధులు మంజూరు

PLD: రెంటచింతల మండలంలోని దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ. 3 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇందులో భాగంగా పాలువాయి, తుమృకోట, పశర్లపాడు రహదారులకు రూ. 2.90 కోట్లు, అణుపు రోడ్డుకు రూ. 10 లక్షలు కేటాయించారు. త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలపడంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 3, 2026 / 06:37 PM IST

సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

MDK: హైదరాబాద్లోని డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొన్నారు. ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు సాగే ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధిపై కలెక్టర్ నివేదికను సమర్పించారు.

March 3, 2026 / 06:36 PM IST

పండుగ పూట విషాదం.. గోదావరిలో ఇద్దరు గల్లంతు

BDK: హోలీ పండుగ పూట మణుగూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లేపల్లి వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని పద్మగూడెం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఎస్సై శ్రావణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్లు, గజ ఈతగాళ్ల సహాయంతో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.

March 3, 2026 / 06:36 PM IST