SGR: జిల్లా వ్యాప్తంగా 53 కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 16,092 మంది విద్యార్థులకు గాను 15,586 మంది (96.86%) హాజరయ్యారు. 506 మంది ఆబ్సెంట్ అయ్యారని జిల్లా విద్యాధికారి గోవింద్ రామ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారు.
అన్నమయ్య: నిరుద్యోగ యువత అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోడూరు టీడీపీ ఇంఛార్జ్ ముక్కారూపానంద రెడ్డి తెలిపారు. గురువారం కోడూరు పట్టణంలోని సాయి డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ద్వారా నిర్వహించిన జాబ్ మేళాకు యువత భారీగా తరలివచ్చారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు.
W.G: కూటమి ప్రభుత్వం మండలిలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి కులం, మతం గురించి చర్చించడం సిగ్గుచేటని వైసీపీ ఆర్టీఐరాష్ట్ర కార్యదర్శి బడుగు బాలాజీ విమర్శించారు. దళిత ప్రజాప్రతినిధుల పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి తీరు మార్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ముఖ్యమంత్రి, హోం మంత్రులు స్పందించాలని మరలా పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
HNK: ఐనవోలు(M) సింగారం శివారులో ఊరి చెరువులో గుర్తుతెలియని వ్యక్తి కళేబరం పడి ఉండగా, గ్రామస్తుల సమాచారంతో గ్రామ కార్యదర్శి అనిల్ కుమార్ పీస్‌లో ఫిర్యాదు చేసారు. SI శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహం తిమ్మాపూర్ రామాలయంలోని యాచకుడు గట్టయ్య కళేబరంగా ధృవీకరించారు. అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహిస్తామని ఎస్సై తెలిపారు.
ADB: ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే కృషి, క్రమశిక్షణ, పట్టుదల అవసరమని ఉట్నూర్ ITDA PO యువరాజ్ మర్మాట్ ఆశ్రమ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఉట్నూర్‌లో నిర్వహించిన “ఇగ్నిట్ యువర్ డ్రీమ్స్”మోటివేషన్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కఠిన శ్రమతో ముందుకు సాగాలని సూచించారు.
PPM: విద్యార్థులు పదవతరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యం కావాలని కలెక్టర్ డా, ప్రభాకరరెడ్డి వసతి సంక్షేమ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో ఉండి చదువుకునే విద్యార్ధులు పదవతరగతి పరీక్షల్లో పూర్తిస్థాయి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలన్నారు.
TG: హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. టోలీచౌకిలో ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనా స్థలికి రెస్క్యూ టీం చేరుకుంది. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: హైదరాబాద్ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. టోలీచౌకిలో ఐదంతస్తుల భవన నిర్మాణ పనుల్లో ప్రమాదం జరిగి.. ముగ్గురు మృతి చెందారు. ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. నిర్మాణ పనులు చేస్తున్న కూలీలపై గోడ కూలి ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి రెస్క్యూ టీం చేరుకుంది. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
టీమిండియాతో సెమీఫైనల్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘మేము పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాం. ప్రస్తుతం మంచి క్రికెట్ ఆడుతున్నాం. అయితే, ఇప్పటి వరకు మా అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటకు రాలేదు. అది ఈరోజే వస్తుందని నేను ఆశిస్తున్నాను. మైదానంలో ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ.. టీమిండియాపై పైచేయి సాధిస్తాం’ అని పేర్కొన్నాడు.
CTR: సదుం మండలం చీకలచేను గ్రామానికి చెందిన పలువురు టీడీపీ కుటుంబాలు YSRCPలో చేరాయి. రీజినల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బూరగమంద క్రాస్ వద్ద జరిగిన కార్యక్రమంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడే వారికి పూర్తి అండగా ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
NDL: బనగానపల్లె మండలంలోని పలు గ్రామాల్లో చెత్త సంపద కేంద్రాలు నిరుపయోగంగా మారాయి. 2014-2019 మధ్యకాలంలో చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో రూ.100,000 వెచ్చించి కేంద్రాలు నిర్మించారు. అయితే ఇప్పటికీ అవి ప్రారంభం కాకపోవడంతో ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నాయి. మండలంలో సుమారు 50 వరకు చెత్త సంపద కేంద్రాలు ఉపయోగంలో లేవని సమాచారం.
BDK: పాల్వంచ మండలం బసవతారక కాలనీలోని ఆధార్ సేవా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న భూక్యా వెన్నెల తన విధి పట్ల అంకితభావాన్ని చాటుతున్నారు. ఏడాది వయసున్న చిన్నారిని ఒడిలో పెట్టుకుని ప్రజలకు ఆధార్ సేవలు అందిస్తున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజలకు సహనంతో సేవలు అందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఆమె తల్లితనంతో పాటు విధి నిర్వాహణను నిర్వహిస్తున్నారు.
TPT: మార్చి 19న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలు రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. మార్చి 19న కూడా ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయబడతాయి.
VZM: రాజాం మండలం బొద్దాం గ్రామంలో పంచాయతీ తరపున గురువారం చలివేంద్రాన్ని చీపురుపల్లి డివిజన్ అభివృద్ధి అధికారి కె హేమ సుందర్ రావు ప్రారంభించారు. గ్రామాలలో ప్రజలు ఎండ వేడిమి నుండి తట్టుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే ఆ చలివేంద్రాలలో శుద్ధమైన మంచినీరు అందించాలని సూచించారు. అనంతరం ఇండ్ల పన్నులు, ట్రేడ్ లైసెన్స్‌లు వసూలు విధానాలను పరిశీలించారు.
కోనసీమ: అమలాపురంలో జరిగిన జిల్లా హెల్త్ వారియర్స్ స్పోర్ట్స్ మీట్‌లో రాజోలు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సత్తా చాటారు. బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపిన సూపరింటెండెంట్ డయానా, విప్పర్తి ప్రతాప్ కుమార్, జగదీశ్వరి, శిరీష జేసీ నిశాంతి చేతుల మీదుగా బహుమతులు అందుకున్నారు. విజేతలను గురువారం ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు. వైద్య సిబ్బంది క్రీడల్లోనూ రాణిస్తున్నారన్నారు.