W.G. ఆచంటలో గురువారం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేస్తూ గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. కచేరి సెంటర్, ఎంవీఆర్ కళాశాల రహదారి, ముత్యాలమ్మ గుడి ప్రాంతాల్లో ఐదుగురు విద్యార్థులతో సహా సుమారు 15 మందిపై దాడి చేసింది. కుక్కకాటుకు గురైన వారంతా PHCలో చికిత్స పొందుతున్నారు. వీధుల్లో కుక్కల బెడద పెరిగిపోవడంతో అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
KRNL: ఆదోనిలో కౌన్సిల్ బడ్జెట్ సమావేశంలో వైసీపీ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, మున్సిపల్ కౌన్సిలర్ ఫయాజ్ అహ్మద్ ఇవాళ మైనార్టీ కాలనీ, నిజాముద్దీన్ కాలనీ ప్రాంతాల అభివృద్ధి పనుల ఆలస్యాన్ని ప్రస్తావించారు. రూ.21.60 లక్షల పనులు భూమిపూజ చేసినప్పటికీ ప్రారంభం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
SRPT: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించి, రూ.22,500 కోట్ల బడ్జెట్‌తో పనులు వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం హుజూర్ నగర్‌లోని రామస్వామి వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్ల పెండింగ్ పనులను జిల్లా కలెక్టర్ తేజస్ నంత్ లాల్ పవార్‌తో కలిసి పరిశీలించారు.
NGKL: కుమ్మెర మల్లన్న జాతర ఘర్షణపై గురువారం జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ స్పందించారు. రెండు వర్గాల మధ్య జరిగిన దాడులపై కేసులు నమోదు చేసి, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. శిశువు మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేశామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అవసరమైతే మర్డర్ సెక్షన్లు చేరుస్తామన్నారు.
MHBD: నెల్లికుదురు మండల కేంద్రంలోని మోడల్ స్కూలులో ఇవాళ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై రమేష్ బాబు పాల్గొని మాట్లాడుతూ.. త్వరలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న తరుణంలో పరీక్షలకు విద్యార్థులు సిద్ధం కావాలని, పరీక్షలు అంటే భయం లేకుండా ధైర్యంగా రాయాలని సూచించారు.
HYD: హరిద్వార్‌లో జరిగిన నేషనల్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన ఓల్డ్ బోయినపల్లికి చెందిన ఎం.తనయను MLA వివేకానంద అభినందించారు. తనయ ఇటీవల జిల్లా స్థాయిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రజతం, CM పవర్ లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణ, రజత పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా గురువారం MLA క్యాంపు కార్యాలయంలో ఆమెను MLA సన్మానించారు.
PLD: అసెంబ్లీ సమావేశాల అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సీఎం చంద్రబాబుతో ముచ్చటించారు. నియోజకవర్గ సమస్యలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న వంద రోజులు 100 గ్రామాలు కార్యక్రమం గురించి తెలిపారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన మేర పరిష్కరిస్తున్నామన్నారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని భాష్యం కోరారు.
SRPT: కుట్టు మిషన్ ఆవిష్కరించి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన విలియమ్స్ హో జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరి 28న నిర్వహించే టైలర్స్ డేను విజయవంతం చేయాలని జిల్లా టైలర్స్ యూనియన్ నాయకులు బాజీ ఉల్లా తెలిపారు. గురువారం స్థానిక గాంధీ పార్క్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టైలర్ వృత్తి గౌరవాన్ని కాపాడుతూ, సంఘటితంగా కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
CTR: త్వరలో ఐటీఐ కళాశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం విజయ పురంమండలంలో ప్రధాన కేంద్రంలో ఉన్న ఐటీఐ కళాశాలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఐటీఐలో ఎలక్ట్రికల్, పిట్టర్, ఆటోమొబైల్, మోటార్ మెకానిక్, డీజిల్ మెకానిక్ వివిధ సెక్షన్‌లను పరిశీలించారు.
TG: రాష్ట్రంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, అక్రిడిటేషన్ కార్డుల నిబంధనల మార్పులపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు కొనసాగించాలని ఆదేశించింది. అలాగే, GO 252, సవరించిన GO 103పై ప్రభుత్వం పూర్తిస్థాయి వివరణ సమర్పించాలని ఆదేశించింది.
జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్.. రింకూ సింగ్ స్థానంలో సంజూ శాంసన్ ఆడుతున్నారు.ZIM: మారుమణి(w), బెన్నెట్, మైయర్స్, ర్యాన్, సికందర్(సి), టోనీ, తషింగా, బ్రాడ్, మపోసా, ముజారబానీ, నగరవIND: సంజు(w), అభిషేక్, ఇషాన్, సూర్య(c), తిలక్, పాండ్యా, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, చక్రవర్తి, బుమ్రా
KMM: పట్టణంలో వెలుగుమట్ల ప్రాంతంలో పది సంవత్సరాల క్రితం పేద ప్రజలు భూధన భూమిలో ఇళ్లు నిర్మాణం చేసుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఈనెల 24 తేదీన యంత్రాలతో అధికారులు కూల్చేశారు. గురువారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అనుదీప్‌కు వినతి పత్రం అందజేసి ఇళ్లు కూల్చివేత తిరిగి ప్రత్యామ్నాయమై ఏర్పాటు చేయాలని కోరారు.
VZM: మే 3న నిర్వహించే నీట్ పరీక్షకు జిల్లాలో 6 కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. గురువారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్‌తో వీసీలో పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ పాలిటెక్నిక్, అయ్యప్పనగర్‌లోని ఏపీ మోడల్ స్కూల్, JNTU బ్లాక్ 1, 2 , ప్రభుత్వ బాలికల హై స్కూల్‌లలో నిర్వహించడం జరుగుతుందన్నారు.
TG: ప్రతిభావంతులైన దళిత విద్యార్థులకు అన్ని రంగాల్లో సమాన గౌరవం లభించాలంటే చదువు ఒక్కటే మార్గమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. దళితులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. HYDలోని లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్‌ను మోడర్న్ కోచింగ్ హబ్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
చెన్నై వేదికగా భారత్, జింబాబ్వే మధ్య ‘డూ ఆర్ డై’ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. సౌతాఫ్రికా చేతిలో ఓటమి పాలైన భారత్‌కు, సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఓడితే భారత్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ నేపథ్యంలో, టీమిండియా విజయం సాధించాలని దేశవ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.