SDPT: ధూళిమిట్ట మండలంలో నేడు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యటించనున్నట్లు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మంద యాదగిరి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ధూళిమిట్ట తహశీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనలని కోరారు.
CTR: గురువారం ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లిష్ పరీక్ష జరిగింది. ఈక్రమంలో ఆర్జేడీ సురేష్ బాబు జిల్లాలో తనిఖీలు చేశారు. వి.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ విద్యార్థి చూసిరాతకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఆ విద్యార్థిని డీబార్ చేశామని డీఐఈవో రఘుపతి తెలిపారు.
AP: అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై చర్చ జరగాలని నినాదాలు చేశారు. ఫ్లకార్డులు, ఫ్లెక్సీలతో ఎమ్మెల్సీలు శాసనమండలి వరకు ర్యాలీగా వెళ్లారు. ఎమ్మెల్సీల నిరసనతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళంగా మారింది.
KRNL: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, స్థానిక సంస్థల ఎన్నికలపై ఇవాళ సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి డా. రామనాయుడు, మంత్రి టి.జి. భరత్, MP నాగరాజు, ఎన్డీఏ ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్‌ఛార్జ్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలన్నారు.
PDPL: రామగుండం సింగరేణి సంస్థ GDK-1 CSPలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు గుర్తింపు కార్మిక సంఘం (AITUC)లో చేరారు. నాయకులు మడ్డి ఎల్లా గౌడ్ వారికి కండువాలను కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. కాంట్రాక్టు కార్మికుల వేతనాల పెంపునకు సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చారు. కార్మికులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారన్నారు.
PDPL: రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య యాదవ్‌కు ఛాంబర్ కేటాయించకపోవడం పట్ల MLA- MSరాజ్ ఠాకూర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ మహంకాళి స్వామి గురువారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో కార్యాలయ ఆవరణలోనే ఒక పక్కన నిలబడిన ఎల్లయ్య యాదవ్ తన అనుచరుల నుంచి శుభాకాంక్షలు స్వీకరించారు.
NRML: మామడ మండలం పొన్కల్ గ్రామంలో 18 ఏళ్ల క్రితం పూడ్చివేతకు గురైన పురాతన కోనేరును గ్రామస్థులు, ఆలయ కమిటీ కలిసి పునరుద్ధరించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు, భక్తులు గోదావరి జలాలను తెచ్చి కోనేరులో పోసి పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక హోమం, కోనేరు హారతి వైభవంగా నిర్వహించగా, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని చాటారు.
BPT: కర్లపాలెం పరిధిలోని ఎంవీరాజుపాలెం ఎంపీపీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. జిల్లా స్థాయి నాటికల పోటీల్లో వీరు అదరగొట్టారు. హిందీ, తెలుగు నాటికల్లో ప్రథమ స్థానం సాధించారు. ఇంగ్లిష్ నాటికలో ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా పాఠశాలలో శుక్రవారం అభినందన సభ నిర్వహించారు. హెచ్‌ఎంలు విజయభాస్కరరెడ్డి, సౌజన్యలు విజేతలకు బహుమతులు అందజేశారు.
BHNG: ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శుకవారం ఉదయం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామీజీ, చంద్రం, కృష్ణ భక్తులు పాల్గొన్నారు
JN: నల్గొండలో నిర్వహిస్తున్న పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్ర-శిక్షణ మహా అభియాన్ వక్తల కార్యశాలకు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ పెరుమాండ్ల వెంకటేశ్వర్‌లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ… బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.
PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజ్ ఠాకూర్‌ను పెద్దపల్లి మున్సిపల్ ఛైర్మన్ నుగిళ్ల మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను ఆత్మీయంగా కలిసి, ఈ సందర్భంగా పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతం, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించారు. ఆయన అనుచరులు, పలువురు పాల్గొన్నారు.
AP: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో 20 మందికి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మరోవైపు ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు సహా 15 మంది చకిత్స పొందుతున్నారు.
ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఈ ఆర్థిక ఏడాది పన్ను వసూళ్ల లక్ష్యం రూ.1.02 కోట్ల లక్ష్యానికి గాను ఇప్పటివరకు 50% మాత్రమే వసూలైంది.మున్సిపాలిటీగా మారిన తరువాత యజమానుల వివరాల ఆన్లైన్ ప్రక్రియ ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు. మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన 50% పన్ను వసూలు చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది.
ప్రకాశం: నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణ, సురక్షితమైన తాగునీటి సరఫరా, పైపులైన్ లీకేజీలను అరికట్టాలని కమిషనర్ నారాయణ రావు అన్నారు. మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో అసిస్టెంట్ ఇంజినీర్లు, సచివాలయ వార్డు ఆమినిటీ సెక్రటరీలు, పవర్ బోర్ ఆపరేటర్లకు సమావేశం నిర్వహించారు. నీటి సరఫరాలో ఏవైన సమస్యలుంటే ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.
GNTR: బందరు ఓడరేవుకు అనుసంధానంగా రైల్వే వంతెన నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సమర్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. వంతెన నిర్మాణంపై రెవెన్యూ, రైల్వే, రహదారులు–భవనాలు తదితర శాఖలతో సమావేశం నిర్వహించారు. భూసేకరణ అంచనాలు, విద్యుత్ సరఫరా ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని సూచించారు.