• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

BREAKING: గంజాయి రవాణా ముఠా అరెస్ట్..!

CTR: కుప్పం అర్బన్ పోలీసులు గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారు. సుమారు రూ.20 లక్షల విలువ గల 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, వెస్ట్ బెంగాల్‌కు చెందిన 8 మందిని అరెస్ట్ చేశారు. నిందితులపై Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు అన్నారు.

March 2, 2026 / 03:01 PM IST

బాధితుడు నారాయణను పరామర్శించిన శ్రీధర్ రెడ్డి

సత్యసాయి: కొత్తచెరువు మండలం నారేపల్లికి చెందిన నారాయణ ప్రమాదవశాత్తు గాయపడిన విషయం తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లారు. బాధితుడిని పరామర్శించి ఆరోగ్య స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. నారాయణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

March 2, 2026 / 03:00 PM IST

ప్రజావాణిలో 345 దరఖాస్తుల స్వీకరణ

KNR: ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వెను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి 345 దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

దుబ్బాక తొలి మున్సిపల్ సమావేశం

SDPT: దుబ్బాక పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన పాలకవర్గం తొలి సర్వసభ్య సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా సమావేశంలో మున్సిపల్ పరిధిలోని పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, నీటి సమస్యపై చర్చించారు. ఈ కార్యక్రమంలో MLA కొత్త ప్రభాకర్ రెడ్డి, సభ్యులు ఫాల్గొన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

వేమూరులో రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ

GNTR: వేమూరు నియోజకవర్గం చుండూరు, అమృతలూరు మండలాల్లో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పట్టాదారు పాస్‌ పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు ముఖ్య అతిథిగా హాజరై రైతులకు పాస్‌పుస్తకాలు అందజేశారు. చుండూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద అర్హులైన వారికి పంపిణీ చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

‘ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీజేపీలో చేరతా’

KDP: తాను బీజేపీలో చేరకుండా అడ్డంకులు సృష్టించినా, రాష్ట్ర నాయకత్వం సహకారంతో అధిగమించానని మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలిపారు. సోమవారం కమలాపురంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే బీజేపీ కండువా కప్పుకుని, అధికారికంగా పార్టీ నాయకుడిగా సమావేశం నిర్వహిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన

కృష్ణా: మచిలీపట్నం సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు సీఐ సుశీల బాల్యవివాహాల నిర్మూలన,ఫోక్స్ చట్టంపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల కలిగే శారీరిక మానసిక,సామాజిక సమస్యల గురించి వివరించారు. ఫోక్స్ చట్టం కింద బాలికల రక్షణకు ఉన్న నిబంధనలు ఫిర్యాదు చేసే విధానం గురించి సూచనలు అందించారు.

March 2, 2026 / 03:00 PM IST

ప్రజల ఫిర్యాదులను వేగంగా పరిష్కరించండి: కలెక్టర్

WNP: ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లతో కలిసి ఆయన 40 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మూసివేత

JGL: ఈనెల 3న రాహుగ్రస్త చంద్రగ్రహణం పురస్కరించుకొని మండల కేంద్రంలోని స్వయంభూ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి సేవలు మధ్యాహ్నం నుంచి రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ, ఆలయ పూజారి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 12గంటల నుంచి గుడిని మూసి వేస్తామన్నారు. తిరిగి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం నుంచి భక్తులకు స్వామివారి దర్శనం, అర్జిత సేవలు యథావిధిగా జరుగుతాయాన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

‘కందులు కొనుగోలు కేంద్రం ప్రారంభం’

ప్రకాశం: మార్కాపురంలోని మార్కెట్ యార్డులో కందులు కొనుగోలు కేంద్రాన్ని సోమవారం టీడీపీ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇంఛార్జ్ కందుల రామిరెడ్డి రిబ్బన్ కట్ చేసే ప్రారంబించారు. కందులు సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మాలపాటి వెంకటరెడ్డి, PACS ఛైర్ పర్సన్ జవ్వాజి రామాంజనేయులు రెడ్డి పాల్గొన్నారు.

March 2, 2026 / 03:00 PM IST

అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు: MP

SRD: అంకితభావంతో పనిచేసిన వారికి నిరంతరం గుర్తింపు లభిస్తుందని జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన ప్రభుత్వం ఉపాధ్యాయుడు భాస్కర్ రిటైర్మెంట్ అభినందన సభ నేడు ఖేడ్‌లోని బసవ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ హాజరై ఉద్యోగ విరమణ పొందిన భాస్కర్‌కు శాలువ కప్పి సన్మానించారు.

March 2, 2026 / 03:00 PM IST

‘మండపేట విలీనం.. జేఏసీ పోరాటం ఫలితం’

కోనసీమ: మండపేట నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలపాలన్న ప్రజల ఆకాంక్ష నెరవేరిందని జేఏసీ ఛైర్మన్ కామన ప్రభాకర్ రావు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జేఏసీ పోరాటం ఫలించిందన్నారు. ఈ క్రమంలో సోమవారం జేఏసీని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కోనసీమ జిల్లా నుంచి తూర్పుగోదావరిలోకి మండపేట చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.

March 2, 2026 / 03:00 PM IST

వైభవంగా శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం

E.G: సీతానగరం మండలం కాటవరంలో కొలువైయున్న శ్రీశ్రీశ్రీ పాశాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి ప్రథమ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరారు.

March 2, 2026 / 03:00 PM IST

రేపు చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

RR: రేపు చంద్రగ్రహణం సందర్భంగా చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. రేపు ఉదయం 7:30 గంటల వరకు స్వామివారి సేవలు ముగించి గుడి మూసి వేయడం జరుగుతుందని, తిరిగి సాయంత్రం 7 గంటలకు శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తుల దర్శనాలు బుధవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. భక్తులు గమనించాలని కోరారు.

March 2, 2026 / 02:59 PM IST

రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ

CTR: గుడిపాల మండలంలోని గుడిపాల గ్రామ రైతు సేవా కేంద్రంలో యూరియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MLA తండ్రి చెన్నకేశవులు నాయుడు మాట్లాడుతూ.. రైతు బలపడితేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రైతుల అవసరాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వం తగిన యూరియా నిల్వలను సిద్ధం చేసిందని తెలిపారు. ఎలాంటి దళారితనం లేకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుందన్నారు.

March 2, 2026 / 02:56 PM IST