• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఘనంగా హోలీ సంబరాలు

పార్వతీపురం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద హోలీ సంబరాలను ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రంగులు జల్లుకున్నారు. అందరూ ఐక్యత, స్నేహభావంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

March 3, 2026 / 12:50 PM IST

హోలీ వేడుకలో కృత్రిమ రంగులు వాడితే?

హోలీ పండుగలో కృత్రిమ రంగులు వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరం. వీటిలో ఉండే సీసం, మెర్క్యురీ, క్రోమియం వంటి రసాయనాలు చర్మంపై దద్దుర్లు, దురద, ఎలర్జీలకు దారితీస్తాయి. ఈ రంగులు కళ్లలో పడితే చూపు మందగించే ప్రమాదం ఉంది. అంతేకాదు శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్తమా వంటి సమస్యలను కలిగిస్తాయి. పర్యావరణానికి మేలు చేసే సహజ సిద్ధమైన రంగులనే వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

March 3, 2026 / 12:50 PM IST

అంబాజీపేటలో అంగన్వాడీలు నిరసన

కోనసీమ: అండగా ఉంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అరాచకం సృష్టిస్తుందని అంగన్వాడీ యూనియన్ నాయకులు లలిత కుమారి, మల్లేశ్వరి, వెంకటలక్ష్మి, ఆందోళన వ్యక్తం చేశారు. అంబాజీపేట మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మంగళవారం అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకురాలు నిరసన చేపట్టారు. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేపట్టిన అంగన్వాడీలపై ప్రభుత్వ చేసిన దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.

March 3, 2026 / 12:49 PM IST

పెనుకొండ బార్ అసోసియేషన్‌లో హోలీ సంబరాలు

సత్యసాయి: పెనుకొండలోని బార్ అసోసియేషన్ భవనంలో న్యాయవాదులు హోలీ సంబరాలను మంగళవారం ఆనందంగా జరుపుకున్నారు. న్యాయవాదులు ఒకరికి ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను స్నేహపూర్వకంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపీ భాస్కర్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర లీగల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అబూబకర్, తదితరులు పాల్గొన్నారు.

March 3, 2026 / 12:47 PM IST

ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే

BDK: నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. కరకగూడెం మండలం బుర్ధారంలో వెలసిన శ్రీ జ్వాలా లక్ష్మీనరసింహ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మంగళవారం ఎమ్మెల్యే విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

March 3, 2026 / 12:47 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలే లక్ష్యం

VZM: UTF ఆధ్వర్యంలో చీపురుపల్లి మండల విద్యా కేంద్రం ఆవరణలో మంగళవారం ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్పిద్దాం అని పోస్టర్ ఆవిష్కరణ చేశారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ చేర్పించి.. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందామని UTF ప్రతినిధులు పిలుపునిచ్చారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పించిన వసతులను అందిపుచ్చుకోవాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

March 3, 2026 / 12:46 PM IST

ఘనంగా హోలీ వేడుకలు

GDWL: గద్వాలో మంగళవారం హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. కులమతాలకు అతీతంగా ప్రజలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయ సిబ్బంది విధుల్లోని ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. రంగుల, సంతోషంతో గ్రామీణులు హోలీ ఆనందాన్ని భరించారు.

March 3, 2026 / 12:45 PM IST

జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాలు మూసివేత

అన్నమయ్య జిల్లాలో మంగళవారం జరిగిన చంద్రగ్రహణం కారణంగా పలు ప్రముఖ దేవాలయాలను ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఆలయ ద్వారాలకు ముద్ర వేసి, గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు స్వామి దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

March 3, 2026 / 12:45 PM IST

అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

NRML: నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అటవీ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో సిబ్బంది వన్యప్రాణుల సంరక్షణ,అడవుల పరిరక్షణపై నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని అటవీ క్షేత్రాధికారి రామకృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు.

March 3, 2026 / 12:44 PM IST

అరెస్ట్ చేయడం అన్యాయమంటూ నిరసన

ASR: హామీలు నెరవేర్చాలంటు విజయవాడలో నిరసన తెలుపుతున్న అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం అన్యాయమని అంగన్వాడీ కార్యకర్తల అల్లూరి జిల్లా సంఘం అధ్యక్షులు దురియా నాగమ్మ పేర్కొన్నారు. మంగళవారం అరకులోయ ఐసీడీఎస్ ఆఫీసు వద్ద అంగన్వాడీ కార్యకర్తలతో నిరసన తెలిపారు. సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.

March 3, 2026 / 12:43 PM IST

ధ్వంసమైన ఇరాన్ గోలెస్తాన్ ప్యాలెస్ 

అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో యునెస్కో వారసత్వ కట్టడమైన ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉన్న గోలెస్తాన్ ప్యాలెస్ దెబ్బతింది. అయితే, 2025 నిరసనల సమయంలోనే అద్దాల సింహాసనం, ఇతర విలువైన కళాఖండాలను సురక్షితంగా తరలించడంతో అవి భద్రంగా ఉన్నాయి. ఈ దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ దేశం తీవ్రంగా హెచ్చరించింది.

March 3, 2026 / 12:42 PM IST

పెద్దమ్మ తల్లి ఆలయం మూసివేత

BDK: చంద్రగ్రహణం సందర్భంగా పాల్వంచ మండలంలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆలయ ఈవో రజనీకుమారి ఆదేశాల మేరకు మంగళవారం ఆలయ అర్చకులు, సిబ్బంది ఆలయ తలుపులను మూసివేశారు. పెద్దమ్మ తల్లి ఆలయం తలుపులను సైతం మూసివేశారు. రేపు ఆలయంలో సంప్రోక్షణ కార్య క్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని ఆలయ కమిటీ ఛైర్మన్ నాగేశ్వరరావు తెలిపారు.

March 3, 2026 / 12:42 PM IST

ధర్నా చేపట్టిన అంగన్వాడి కార్యకర్తలు

CTR: పుంగనూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం అంగన్వాడి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన చలో అమరావతి కార్యక్రమంలో అంగన్వాడీలను అరెస్టు చేయడం దారుణం అన్నారు. ఇందుకు గాను అరెస్టును నిరసిస్తూ.. ధర్నా చేపట్టినట్లు స్థానిక నాయకురాలు రమణమ్మ తెలిపారు. తమ డిమాండ్లను సాధించేవరకు ఉద్యమం ఆగదన్నారు.

March 3, 2026 / 12:41 PM IST

రేపటి నుంచే ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు

MBNR: డాక్టర్ బిఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 పరీక్షలు మార్చి 4 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కొల్లాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కో-ఆర్డినేటర్ ఉదయ్ కుమార్ సూచించారు.

March 3, 2026 / 12:41 PM IST

రేపు విశాఖలో జగన్ పర్యటన

AP: మాజీ సీఎం జగన్ రేపు విశాఖ, అల్లూరి జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటలకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు విశాఖలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ నివాసానికి ఆయన వెళ్లానున్నారు. ఇటీవల వివాహమైన గణేష్ కుమారుడు దంపతులను జగన్ ఆశీర్వదించనున్నారు.

March 3, 2026 / 12:40 PM IST