• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రేపు మండలంలో పర్యటించనున్న MLA

CTR: వెదురుకుప్పం మండలం TKMపురంలో ఎమ్మెల్యే డా. థామస్ శనివారం పర్యటించనున్నట్లు MLA కార్యాలయం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 1న ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు అర్హులందరికీ ఎమ్మెల్యే పెన్షన్ నగదు అందజేయనున్నారు.

February 27, 2026 / 05:06 PM IST

ఉపాధి హామీ కూలీలతో ఎమ్మెల్యే సతీమణి భేటీ

PDPL: అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ సందర్శించారు. ఎండ తీవ్రతలో పని చేస్తున్న కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేతనాల చెల్లింపులు, పనుల నిర్వహణపై ఆరా తీశారు. మహిళా కూలీలతో ప్రత్యేకంగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.

February 27, 2026 / 05:05 PM IST

14 ఏళ్ల బాలికలకు BIG ALERT

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దేశంలో 14 ఏళ్ల బాలికలకు HPV వ్యాక్సిన్‌ను కేంద్ర ప్రభుత్వం రేపటి నుంచి ఉచితంగా పంపిణీ చేయనుంది. ఏపీలో సీఎం చంద్రబాబు, TGలో మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభిస్తారు. బాలికల వయస్సును ఆధార్ కార్డు ఆధారంగా నిర్ధారిస్తారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకా వేయనున్నారు.

February 27, 2026 / 05:05 PM IST

‘పోరాటాలు చేయడం కోసం సిద్ధం కావాలి’

NRML: గ్రామ సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయడానికి అందరూ సిద్ధం కావాలని టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి తొడసం శంభు అన్నారు. కడెం మండలంలోని పాత రేవాజిపేట గ్రామాన్ని సందర్శించి నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని కమిటీ నాయకులు తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో పోరాటం చేయడం కోసం సిద్ధం కావాలన్నారు.

February 27, 2026 / 05:05 PM IST

మహిళలపై అఘాయిత్యాలు ఆపాలి: ఐద్వా డిమాండ్

VSP: మహిళలు, బాలికలపై పెరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టాలని ఐద్వా డిమాండ్ చేసింది. శుక్రవారం జగదాంబ జంక్షన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర కార్యదర్శి వి.సావిత్రి మాట్లాడుతూ.. నేరాలకు మద్యం,గంజాయి, డ్రగ్సే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో ఈ నెలలోనే 18కిపైగా ఘోరాలు జరిగాయని తెలిపారు. గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 27, 2026 / 05:05 PM IST

రాయచోటికి కొత్త మున్సిపల్ కమిషనర్

అన్నమయ్య: అమరావతి సచివాలయంలో పంచాయతీరాజ్ & రూరల్ డెవలప్మెంట్ శాఖలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పోకల రమణారెడ్డి గారు ప్రమోషన్‌పై గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్‌గా రాయచోటికి నియమితులయ్యారు. గతంలో గోపవరం, ఖాజీపేట మండలాల్లో తహసీల్దార్‌గా పనిచేశారు. ఆయన స్వగ్రామం బ్రహ్మంగారి మఠం మండలం చౌటపల్లి.రాయచోటి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.

February 27, 2026 / 05:04 PM IST

వారి ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం: CM

AP: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఇళ్ల నిర్మాణానికి అదనపు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఇళ్ల నిర్మాణం ద్వారా పేదలకు భద్రత, భరోసా కల్పిస్తాం. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసింది. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లనూ త్వరలోనే పూర్తి చేసి ఇస్తాం. 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు, ఇళ్లు ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.

February 27, 2026 / 05:01 PM IST

చెన్నూర్‌ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి

MNCL: చెన్నూర్ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెద్దింటి పద్మ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. చెన్నూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి పేర్కొన్నారు.

February 27, 2026 / 05:01 PM IST

ఆలయ వ్యవస్థాపకుడు మృతికి మంత్రి సంతాపం

KNR: చిలుకూరు బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు సౌందర్ రాజన్ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సౌందరరాజన్ చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేశారు. ఆయన కృషి వల్ల బాలాజీ ఆలయం ప్రజలలో మరింత గౌరవం సంపాదించిందని అన్నారు.

February 27, 2026 / 05:01 PM IST

ఎంపీని కలిసిన నూతన కలెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనురాగ్ జయంతిని, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి నూతన మున్సిపల్ ఛైర్మన్ తంగళ్ల పల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నూతన కలెక్టర్‌ను జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలి అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

February 27, 2026 / 05:01 PM IST

హాలియాలో “Arrive Alive” కార్యక్రమం

నల్గొండ జిల్లాలోని హాలియా పట్టణంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” రోడ్డు భద్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA జై వీర్ రెడ్డి, SP శరత్ చంద్ర పవార్ హాజరై ప్రారంభించారు. డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేశారు.

February 27, 2026 / 05:01 PM IST

అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

VZM: కొత్తవలస మండలం చింతలపాలెంలో ఉపాధి హామీ నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శుక్రవారం పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును పరిశీలించి నాణ్యత ప్రమాణాలతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

February 27, 2026 / 05:00 PM IST

నీటి ఎద్దడి నివారణకు చర్యలు: ఎమ్మెల్యే

ADB: వేసవికాలంలో ఆదిలాబాద్ పట్టణంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వార్డు నంబర్ 3 జీడీసీ కాలనీలో మంచినీటి బోర్ ఏర్పాటుకు పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎన్నికల సమయంలో కాలనీలో ఉన్న నీటి సమస్యను తెలుసుకుని.. కౌన్సిలర్ నిషిద ఆదిత్య ఖండేష్కర్ బోర్ వేయించడం అభినందనీయం అన్నారు.

February 27, 2026 / 05:00 PM IST

ఇంటింటికి కొళాయి పనులు ప్రారంభం

AKP: జనసేన ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ప్రతినిధి సుందరపు సతీశ్ కుమార్ శుక్రవారం అచ్యుతాపురం మండలం ఎర్రవరంలో రూ. 15 లక్షల జిల్లా పరిషత్ నిధులతో చేపట్టే ఇంటింటి కుళాయి పనులను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో పడకేసిన పథకాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని చెప్పారు.

February 27, 2026 / 05:00 PM IST

నందిగాం మండల పరిధిలో అగ్నికి ఆహుతైన గడ్డి కుప్పలు

SKLM: నందిగాం(M) కొత్త అగ్రహారం గ్రామ సమీపంలో శుక్రవారం జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న గడ్డికుప్పలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి గడ్డికుప్పలు కాలిపోవడంతో అలజడి నెలకొంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 05:00 PM IST