• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

డయాలసిస్ బాధితుడికి రూ.10వేల పింఛన్ అందజేత

BPT: ఎం.వి. రాజుపాలెం గ్రామానికి చెందిన శీలం సుబ్బారెడ్డికి డయాలసిస్ పింఛన్‌ను తహసీల్దార్ శ్రీదేవి, ఎంపీడీవో శ్రీనివాసరావు, జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి అందజేశారు. ఎంపీడీవో మాట్లాడుతూ.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, మంచానికే పరిమితమైన వారికి ప్రత్యేక పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో పద్మావతి పాల్గొన్నారు.

February 28, 2026 / 09:36 AM IST

పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: కనిగిరి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ఆయన స్వయంగా పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

February 28, 2026 / 09:35 AM IST

‘రెండో మోటారు ప్రారంభించి చెరువులు నింపాలి’

SRCL: వేములవాడ నియోజకవర్గంలోని ఫాజుల్ నగర్ మీదుగా రుద్రంగి వరకు గల చెరువులు నింపేందుకు నారాయణపూర్ వద్ద రెండో మోటార్ ప్రారంభించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని VMWD విప్ ఆది శ్రీనివాస్ కోరారు. చొప్పదండి MLA మేడిపల్లి సత్యంతో కలిసి శుక్రవారం HYD మంత్రిని కలిశారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని కలికోట సూరమ్మ రిజర్వాయర్ పనులపై మంత్రితో చర్చించారు.

February 28, 2026 / 09:35 AM IST

బాల్క సుమన్‌ను కలిసిన బీఆర్‌ఎస్ నాయకులు

WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు శుక్రవారం సాయంత్రం బాల్క సుమన్ కెసీఆర్ ఫామ్ హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు మాజీ సర్పంచ్ చీకటి ప్రకాశ్ తెలిపారు.

February 28, 2026 / 09:34 AM IST

‘ఎన్జీవోస్‌’ను ప్రభుత్వం గుర్తించాలి’

E.G: నిబద్ధతగా పనిచేసే సేవా సంస్థలపై చిన్నచూపు తగదని.. ప్రభుత్వం తమను గుర్తించాలని ఎన్జీవోలు కోరారు. రాజమండ్రిలోని స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఎన్జీవో ఐ.కుమార్ అధ్యక్షతన ప్రపంచ స్వచ్ఛంద సేవా సంస్థల దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వర్ణాంధ్ర సంస్థ నిర్వాహకులు గుబ్బల రాంబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 ఎన్జీవో సంస్థలు పాల్గొన్నాయి.

February 28, 2026 / 09:33 AM IST

ఏడాదిలో లక్షకుపైగా పెరిగిన నల్లా కనెక్షన్లు..!

HYD: నగరంలో గత ఏడాదిలో జలమండలి పరిధిలో లక్షకు పైగా నల్లా కనెక్షన్లు పెరిగినట్లు జలమండలి అధికారులు వెల్లడించారు. నగర కోర్ ప్రాంతంతో పోలిస్తే ORR పరిధిలో నీటి వినియోగం, సరఫరా గణనీయంగా పెరిగినట్లు పేర్కొన్నారు. పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా పైప్‌లైన్ విస్తరణ, రిజర్వాయర్ల సామర్థ్య పెంపు వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

February 28, 2026 / 09:33 AM IST

ప్రభుత్వ ఆసుపత్రికి వీల్ చైర్లు బహూకరణ

SRPT: కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి మఠంపల్లి వివేకవర్ధని పాఠశాల 1996 పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఇవ్వాళ ఒక స్ట్రెచర్, రెండు వీల్ చైర్లను విరాళంగా అందజేశారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ దశరథకు వీటిని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేద రోగుల కోసం పూర్వ విద్యార్థులు చూపిన ఈ చొరవ అభినందనీయమన్నారు.

February 28, 2026 / 09:33 AM IST

గ్లింప్స్‌తో వస్తున్న ‘ఉస్తాద్‌ భగత్ సింగ్’

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ 2026 మార్చి 26న విడుదల కానుంది. త్వరలో 40 సెకన్ల పవర్‌ప్యాక్డ్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్థాయిని ఈ గ్లింప్స్ ద్వారా చూపించబోతున్నట్లు సమాచారం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల, రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

February 28, 2026 / 09:32 AM IST

సింగర్ పార్వతికి ‘మహిళా కీర్తి రత్న’ అవార్డు

కర్నూలు: జిల్లా లక్కవరం గ్రామానికి చెందిన సంగీత ఉపాధ్యాయురాలు పార్వతి ‘మహిళా కీర్తి రత్న ఉమెన్స్ ఎక్సలెన్సీ–2026’ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో మార్చి 8న విజయవాడలో జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమెకు ఈ పురస్కారం అందజేయనున్నారు. జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్‌గా రాణించిన పార్వతిని పలువురు అభినందించారు.

February 28, 2026 / 09:31 AM IST

YVU స్నాతకోత్సవం తేదీ మార్పు..!

KDP: YVU విశ్వవిద్యాలయం 11,12,13,14వ స్నాతకోత్సవం నిర్వహణ తేదీని రాష్ట్ర గవర్నర్ కార్యాలయ సూచన మేరకు మార్పు చేసినట్లు YVU ఉప కులపతి ఆచార్య రాజశేఖర్ తెలిపారు. గతంలో మార్చి 11వ తేదీ నిర్వహిస్తామని తీసుకున్న నిర్ణయాన్ని అదే నెల 13వ తేదీకి మార్పు చేసినట్లు వివరించారు. కాన్వకేషన్ కు హాజరయ్యే విద్యార్థులు ఈ మార్పును గమనించాలన్నారు.

February 28, 2026 / 09:31 AM IST

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదలకు వరం

SKLM: NTR భరోసా పింఛన్లు పేదలకు వరం అని ఏపీ టీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు అన్నారు. శనివారం పలాస పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. ఈ మేరకు ఎన్టీఆర్ పింఛన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ సొమ్మును అందజేశారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం సీఎం చంద్రబాబు ప్రతి నెల ఒకటో తేదీనే ఇంటి వద్దకే పింఛన్లు అందజేస్తున్నారని అన్నారు.

February 28, 2026 / 09:30 AM IST

ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయిన యువకుడు

ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఇంటర్ పరీక్షల్లో ఫస్టియర్ ఆంగ్ల పరీక్షలో అసలు విద్యార్థికి బదులుగా మరొక యువకుడు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఓఎంఆర్ షీట్‌పై సంతకం చేయించుకునే సమయంలో చేతిరాత సంతకంలో తేడా ఉండటంతో అసలు విషయం బయటపడింది. నిందితుడిని వెంటనే పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు తెలిపారు.

February 28, 2026 / 09:30 AM IST

సనత్ నగర్‌లో టీ కల్తీ రాకెట్ నిందితుడు అరెస్ట్

HYD: సనత్ నగర్ పరిధిలో టీ పొడి కల్తీ రాకెట్‌ను కమిషనర్ టాస్క్ ఫోర్స్, సనత్ నగర్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. కల్తీ టీ తయారు చేసి విక్రయిస్తున్న జగన్నాథ్ బిష్ణోయి (33)ను అరెస్ట్ చేశారు. కొబ్బరి తొక్క మిశ్రమం, బెల్లం నీరు, సింథటిక్ రంగులతో నకిలీ టీ తయారు చేసి అసలైనదిగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో 120 కిలోల కల్తీ టీ స్వాధీనం చేసుకున్నారు.

February 28, 2026 / 09:30 AM IST

ఇటిక్యాల ఫిజియోథెరపీ అవగాహన సదస్సు

GDWL: ఇటిక్యాల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో శనివారం ఫిజియోథెరపీ అవగాహన సదస్సు నిర్వహించనుందని ఎంపీడీవో అజర్ మొహియిద్దీన్ తెలిపారు. నిజాం ఫిజియోథెరపీ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులకు అవగాహన కల్పించబడుతుంది. సదస్సు ఇటిక్యాలో ఉదయం 10, ఎర్రవల్లిలో 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

February 28, 2026 / 09:30 AM IST

‘మార్చి 5 లోపు బకాయి పన్నులు చెల్లించండి’

TPT: చంద్రగిరిలో శుక్రవారం రాత్రి డిజిటల్ పన్నుల వసూళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈవో చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి గృహాలు, దుకాణాల వద్దకు వెళ్లి డిజిటల్ విధానంలో పన్నులు వసూలు చేశారు. మార్చి 5 లోపు బకాయి పన్నులు చెల్లించాలని ఆయన ప్రజలను కోరారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా పారదర్శకతతో పాటు సులభతరం అవుతుందని తెలిపారు.

February 28, 2026 / 09:29 AM IST