• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ప్రమాదాల నివారణ పై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

WGL: కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రమాదాల తగ్గింపు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రమాదాల ప్రదేశాలను గుర్తించి హచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అంకిత్ కుమార్, AJC సంధ్యారాణి పాల్గొన్నారు.

February 28, 2026 / 06:25 AM IST

ఆలస్యంగా IPL 2026 ప్రారంభం

IPL 2026 షెడ్యూల్ ప్రకారం మార్చి 26న కాకుండా 28న ప్రారంభమవుతుంది. అయితే టైటిల్ పోరు మే 31నే జరుగుతుంది. ఈ విషయంతో పాటు పూర్తిస్థాయి షెడ్యూల్, వేదికల వివరాలపై వచ్చే వారంలో BCCI అధికారిక ప్రకటన చేయనుందని క్రికెడ్ వర్గాలు తెలిపాయి. కాగా అసోం, బెంగాల్, తమిళనాడు ఎన్నికల తేదీలపై స్పష్టత రాలేదు. ఎన్నికల, IPL షెడ్యూల్స్ క్లాష్ కాకూడదని ఈ నిర్ణయం తీసుుకున్నట్లు తెలుస్తోంది.

February 28, 2026 / 06:24 AM IST

ఏపీఎం ఆద్వర్యంలో జోరుగా ఉల్లాస్ తరగతులు

PPM: గరుగుబిల్లి మండలం పెద్దగూడభ గ్రామంలో శుక్రవారం రాత్రి APM అప్పలనాయుడు ఆద్వర్యంలో ఉల్లాస్‌ తరగతులు నిర్వహించారు. ఉల్లాస్‌ అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిరక్షరాస్యులైన మహిళా సంఘాలు సభ్యులుకు రాయడం, చదవడంతో పాటు డిజిటల్‌ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మార్చి 4న ఫ్రీ ఫైనల్‌ పరీక్షకు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.

February 28, 2026 / 06:23 AM IST

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు కలెక్టర్లు మహిళలే!

ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలనాధికారులు (కలెక్టర్లు) ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఉమ్మడి జిల్లాలో సంగారెడ్డి కలెక్టర్గా ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్గా హైమావతి ఉండగా తాజాగా జరిగిన కలెక్టర్ల బదిలీలో మెదక్ కలెక్ట‌ర్‌గా ప్రతిమా సింగ్ నియమితులయ్యారు. దీంతో ఉమ్మడి జిల్లా పరిపాలనలో మహిళల చేతిలో ఉంది.

February 28, 2026 / 06:23 AM IST

ఐటీ శాఖ మంత్రి లోకేష్‌కు ఘ‌న స్వాగ‌తం

VSP: విశాఖపట్నం పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు శుక్ర‌వారం రాత్రి విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, గణబాబులతో పాటు వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, దాడి రత్నాకర్ స్వాగతం పలికారు. 

February 28, 2026 / 06:20 AM IST

మహిళా సిబ్బంది విధుల్లో సమర్థంగా పాల్గొనాలి: SP

ADB: మహిళా సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారై అన్ని రకాల విధుల్లో సమర్థంగా పాల్గొనాలని SP అఖిల్ మహాజన్ ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన మహిళా సిబ్బంది మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మహిళలు పోలీస్ స్టేషన్‌లో ఉన్న ప్రతి ఒక్క విధులకు పూర్తి సంసిద్ధతతో ఉండాలని కోరారు.

February 28, 2026 / 06:19 AM IST

మినుము క్వింటాలుకు రూ.700: జేసీ

కృష్ణా: జిల్లాలో రబీ 2025-26 సీజన్లో సాగు చేసిన అపరాలు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు.ప్రభుత్వం మినుములు క్వింటాలుకు రూ.7800 పెసలు క్వింటాలుకు రూ.8768 మద్దతు ధర నిర్ణయించిందని తెలిపారు.రైతులు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 28, 2026 / 06:17 AM IST

జనగణన సర్వే విధులు కేటాయించాలని వినతి

VKB: మే 10 నుంచి జూన్ 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జనగణన సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో తమకు సూపర్వైజర్లుగా విధులు కేటాయించాలని కుల్కచర్ల తహాశీల్దార్ మనోహర్ చక్రవర్తికి శుక్రవారం PSHMA జిల్లా అధ్యక్షుడు తుప్పలి ఆనంద్ కుమార్ నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేష్, వీరేశం, తౌర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 06:17 AM IST

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

SDPT: మద్దూరు మండలం లద్నూర్ గ్రామానికి చెందిన ఆలేటి మహేష్(28) శుక్రవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గత కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్, తీవ్ర మనస్తాపంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై అసిఫ్ ఆధ్వర్యంలో ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.

February 28, 2026 / 06:16 AM IST

రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేత: జగ్గారెడ్డి

SRD: దేశం కోసం రాహుల్ గాంధీ బాధ్యత గల ప్రతిపక్ష నేతగా విలువైన సూచనలు ఇస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ ఇచ్చే సలహాలను ప్రధాని మోదీ వింటున్నారే తప్ప, అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

February 28, 2026 / 06:14 AM IST

Gen Z తెలివి.. ‘చెత్త’ నుంచి డబ్బు!

HYD: నగర యువతలో ఇప్పుడు ‘అప్‌సైక్లింగ్’ ఒక మతంలా మారుతోంది. మురికివాడల్లో పారేసిన టైర్లు, విరిగిన ప్లాస్టిక్ డబ్బాలను సేకరించి వాటిని లగ్జరీ ఫర్నీచర్‌గా మార్చి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు.. పర్యావరణం మీద వారికున్న ‘యూనిక్’ ప్రేమ. పాత సామన్ల మార్కెట్ (జుమ్మెరాత్ బజార్) వీరి పాలిట ఇప్పుడు ఒక ఐడియా బ్యాంక్‌గా మారింది.

February 28, 2026 / 06:14 AM IST

నేడు కోటబొమ్మాలిలో పర్యటించిన మంత్రి

SKLM: కోటబొమ్మాలి మండలంలో ఇవాళ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పట్టు పురం పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఎన్టీఆర్ భరోసా పింఛనుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.

February 28, 2026 / 06:10 AM IST

అభివృద్ధి పథంలో నగరపాలక సంస్థ: ఎమ్మెల్యే

MBNR: పాలమూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. మేయర్, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేస్తూ నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

February 28, 2026 / 06:10 AM IST

నేటితో ముగియనున్న మెడికల్ కాలేజీ ఎగ్జిబిషన్

GNTR: గుంటూరు మెడికల్ కాలేజీలో 30 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న మెడికల్ ఎగ్జిబిషన్ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 4న ప్రారంభమైన ఈ ప్రదర్శనను ఇప్పటివరకు సుమారు 80 వేల మంది సందర్శించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ సైతం ఈ ప్రదర్శనను వీక్షించి నిర్వాహకులను అభినందించారు. వైద్య విజ్ఞానాన్ని కళ్ళకు కట్టినట్లు చూపిన ఈ ప్రదర్శనను చివరి రోజైన శనివారం తప్పక చూడండి.

February 28, 2026 / 06:07 AM IST

పుష్కర ఘాట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

MLG: గోదావరి పుష్కరఘాట్ల ప్రతిపాదనలను వెంటనే సిద్ధం చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని పుష్కరఘాట్లను శుక్రవారం పరిశీలించారు. జూలై 2027లో నిర్వహించనున్న గోదావరి నది పుష్కరాల సందర్భంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పుష్కరఘాట్ల నిర్మాణాల పనులు ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే అందించాలన్నారు.

February 28, 2026 / 06:06 AM IST