• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

MAR 6-JUNE 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు

TG: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 5 దశల్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఏప్రిల్ 2న గ్రామ సభల నిర్వహణ, ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం, మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం, మే 22న జిల్లా స్థాయిలో, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక జరపనున్నారు.

March 3, 2026 / 07:45 PM IST

ముగిసిన గ్రహణం.. తెరిచిన ఆలయాలు

ADB: నార్నూర్ మండలంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 7 గంటలకు ముగిసింది. గ్రహణ సమయంలో సంప్రదాయాల ప్రకారం మండలంలోని పలు ఆలయాలను మూసివేశారు. భక్తులు కూడా ఇళ్లలోనే పూజలు నిర్వహించారు. గ్రహణం ముగిసిన వెంటనే శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయ ద్వారాలను తిరిగి తెరిచారు. భక్తుల రాకపోకలతో ఆలయాలు మళ్లీ సందడిగా మారాయి.

March 3, 2026 / 07:44 PM IST

చందోలులో వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి కళ్యాణం

BPT: చందోలులో శ్రీ చెన్నకేశవ స్వామివారి వార్షిక కళ్యాణోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. జీర్ణోద్ధరణ చేసిన నూతన మండపంలో అర్చకులు ఆగమ శాస్త్రం ప్రకారం వివాహ వేడుకను నిర్వహించారు. నిత్య హోమం, ప్రత్యేక పూజలతో పాటు గరుడసేవ, రథోత్సవం కనులపండువగా సాగాయి. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఛైర్మన్ సాయి గుప్తా, ఈఓ నరసింహమూర్తి వెల్లడించారు.

March 3, 2026 / 07:44 PM IST

ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో వాహనాల వేలం: CI

నారాయణపేట పట్టణంలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద వివిధ కేసులలో పట్టుబడిన ద్విచక్ర వాహనాలకు మంగళవారం వేలంపాట నిర్వహించినట్లు సీఐ అనంతయ్య తెలిపారు. రెండు ద్విచక్ర వాహనాలకు నిర్వహించిన వేలంపాటలో రూ.29 వేలకు గాను, ఓ వ్యక్తి వేలం ద్వారా రూ. 68,020 వేలకు సొంతం చేసుకున్నారని సీఐ చెప్పారు. బహిరంగ వేలంపాటలో మొత్తం 20 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:44 PM IST

జిల్లాకు రూ.736.27 కోట్ల నిధులు: ఎంపీ అంబిక

ATP: జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో తాగునీరు, సెప్టేజ్ అభివృద్ధికి రూ.736.27కోట్ల నిధులు మంజూరైనట్లు MP అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. అమృత్ 2.0, ఏఐఐబీ పథకాల కింద అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం పట్టణాల్లో పనులు చేపట్టనున్నారు. ఏప్రిల్ నుంచి పనులు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

March 3, 2026 / 07:43 PM IST

వీడుతున్న గ్రహణం.. ఆసక్తిగా చూస్తున్న ప్రజలు

వరంగల్ జిల్లాలో చంద్రగ్రహణం వీడుతున్న దృశ్యాలు ఆసక్తి రేపాయి. వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో తాటి చెట్టు పక్కగా చంద్రుడు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్న క్షణాలు వీడియోలో స్పష్టంగా కనిపించాయి. గ్రహణం అనంతరం కొన్ని ఆలయాల్లో రాత్రి 8 గంటలకు సంప్రోక్షణ, మరికొన్ని చోట్ల రేపు ఉదయం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

March 3, 2026 / 07:41 PM IST

కూటమి ప్రభుత్వంపై బుగ్గన ఫైర్

NDL: కూటమి ప్రభుత్వంపై మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే నేరాన్ని ప్రోత్సహిస్తోందని మంగళవారం ధ్వజమెత్తారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త సంస్కృతులను తెచ్చారని విమర్శించారు. జోగి రమేష్ ఇంటిపై దాడి వీడియో చూస్తే అర్థమవుతుందని అన్నారు.

March 3, 2026 / 07:39 PM IST

‘అంగన్వాడీలపై నిర్బంధకాండ అమానుషం’

SKLM: అంగన్వాడీల పై ప్రభుత్వ నిర్బంధకాండ అమానుషం అని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. మంగళవారం శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నుండి డే &నైట్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీలకు వేతనాలు వెంటనే పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

March 3, 2026 / 07:39 PM IST

ఆరోగ్యంపై విద్యార్థినిలకు సూచనలు

AKP: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాయకరావుపేట సర్కిల్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పన్న ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థినులకు  వైద్య పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా హిమాగ్లోబిన్‌కు సంబంధించి పరీక్షలు నిర్వహించి ఐరన్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు. అలాగే ఆరోగ్య విషయాలపై పోలీసులు పలు సూచనలు చేశారు.

March 3, 2026 / 07:38 PM IST

మెడికల్ కాలేజీలతో అనుసంధానించాలి: రేవంత్

TG: విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలతో అనుసంధానం చేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, CS, ఉన్నతాధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:38 PM IST

పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ

W.G: ఇరగవరం(మం) కంతేరులో కొత్త పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం కొత్త పట్టాదారు పాస్ బుక్‌ల పంపిణీ అన్నారు.

March 3, 2026 / 07:37 PM IST

అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థుల ఉద్యమం

WNP: విజయవాడలో జరిగిన PDSU ప్రథమ జాతీయ మహాసభల్లో సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. కవి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, వివక్ష పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంపై అశోక్, రమేష్ పట్నాయక్ తదితరులు ప్రసంగించగా, పలు రాష్ట్రాల విద్యార్థి ప్రతినిధులు పాల్గొన్నారు.

March 3, 2026 / 07:37 PM IST

ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న రైల్వేస్టేషన్

PDPL: రామగుండం రైల్వేస్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. అమృత్ భారత్ కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన వివిధ పనులు 100 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ భవనం ఆధునీకరణ, బుకింగ్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఆధునిక టాయిలెట్ బ్లాక్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, లిఫ్టు, ర్యాంపు, ఎస్కలేటర్లు, ఏటీఎం, రిటైనింగ్ రూమ్‌లను నిర్మిస్తున్నారు.

March 3, 2026 / 07:36 PM IST

బిల్డింగ్ వర్కర్స్ నూతన కార్యవర్గం ఎన్నిక

SRPT: కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో ఈరోజు కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా పి.సైదులు, కార్యదర్శిగా ఏ.శేఖర్, కోశాధికారిగా ఎం.సాయిలు, సంయుక్త కార్యదర్శిగా వెంకన్న ఎన్నికయ్యారు.

March 3, 2026 / 07:35 PM IST

పాక్ కెప్టెన్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

T20 WC 2026 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన తీరుపై ఆ దేశ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘాకు కెప్టెన్సీపై అవగాహన లేకపోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. బౌలర్లను అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మండిపడ్డాడు. ఒకవేళ ఈ కెప్టెన్‌కు వసీం అక్రమ్, అక్తర్ వంటి దిగ్గజాలను ఇచ్చినా సరే మ్యాచ్‌ను ఓడించేస్తాడని వ్యాఖ్యానించాడు.

March 3, 2026 / 07:35 PM IST