• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమం ప్రారంభం

TG: దేశంలోనే తొలిసారిగా ‘జీఐ ఆన్ వీల్స్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని GHMC వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. GI గుర్తింపు పొందిన కళారూపాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని గవర్నర్ అన్నారు. TG యువ రాష్ట్రంగా సాంస్కృతిక గుర్తింపును బలోపేతం చేసుకోవడం అవసరమని తెలిపారు.

February 27, 2026 / 05:30 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎంపీ

సత్యసాయి: పెనుకొండ మండలంలోని ఎంపీ కార్యాలయంలో ఎంపీ బీకే.పార్థసారథి శుక్రవారం 10 మంది లబ్ధిదారులకు రూ.7,65,970ల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ అండ్‌ చెక్కులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

February 27, 2026 / 05:30 PM IST

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

VZM: ఎల్ కోట మండలం గొల్జాం, ఎల్‌కే‌ఎస్ పురంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో అల్లు సూర్యనారాయణ శుక్రవారం పరిశీలించారు. ఉపాధి కూలీల మష్టర్ షీట్‌ను తనిఖీ చేశారు. వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో ఉపాధి కూలీలు పనిచేసిన చోట ప్రత్యేక జాగ్రత్తలు వహించాలని సూచించారు. ప్రభుత్వ కొలతలను అనుసరించి పనిచేసే అధిక ఆదాయం పొందాలని కోరారు.

February 27, 2026 / 05:30 PM IST

వివిధ గ్రామాల్లో సంచార వైద్య సేవలు

PPM: సీతానగరం మండలంలో గుమ్మడివరం, అప్పయ్యపేట గ్రామాల్లో శుక్రవారం 104 వైద్య సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా. పావని గర్భిణీలకు, బాలింతలకు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడా మందులు పంపిణీ చేశారు. సంచార చికిత్స కార్యక్రమం పై ముందురోజు గ్రామస్తులకు తెలియజేయాలని సిబ్బందికి సూచించారు.

February 27, 2026 / 05:30 PM IST

స్పిరిట్: ప్రభాస్‌ను ఢీకొట్టబోయే విలన్ ఇతడే

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

February 27, 2026 / 05:28 PM IST

ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్ ఫిక్స్

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హైవోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘స్పిరిట్’. ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఇందులో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నట్లు తెలుపుతూ.. చిత్ర బృందం ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

February 27, 2026 / 05:28 PM IST

రసవత్తరంగా బండ లాగుడు పోటీలు.. వీక్షించిన ఎమ్మెల్సీ

RR: కేశంపేట మండలం బైర్ ఖాన్ పల్లి గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బండ లాగుడు పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై పోటీలను వీక్షించారు. పోటీలలో ఎవరికి వారు విజేతలుగా నిలవాలని పెద్ద ఎత్తున పాల్గొనడంతో పోటీలు రసవత్తరంగా సాగాయి.

February 27, 2026 / 05:27 PM IST

దూబే బౌలింగ్‌పై శ్రీకాంత్ ఫైర్

జింబాబ్వేతో మ్యాచ్‌లో శివమ్ దూబే కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఏకంగా 46 పరుగులు సమర్పించుకున్నాడు. దీనిపై మాజీ క్రికెటర్ శ్రీకాంత్ స్పందిస్తూ.. దూబే బౌలర్‌గా ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యాడని పేర్కొన్నాడు. అతడితో బౌలింగ్ చేయించే ముందు జట్టు విజయావకాశాల గురించి ఆలోచించాలని టీమ్ మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.

February 27, 2026 / 05:24 PM IST

చిల్లంచర్ల వరలక్ష్మి కన్నుమూత

SRPT: తెలంగాణ సాయుధ రైతంగ పోరాట యోధుడు, అమరజీవి చిల్లంచర్ల రఘునాథం సతీమణి వరలక్ష్మి (94) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మునగాలలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సాయుధ పోరాట కాలం నుంచి భర్త అడుగుజాడల్లో నడిచిన వరలక్ష్మి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 05:23 PM IST

ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై కలెక్టర్ సమీక్ష

ATP: అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషకాహార పంపిణీపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మెడికల్ ఆఫీసర్లు, సీడీపీఓలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించారు.

February 27, 2026 / 05:23 PM IST

ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి పనులు..!

NDL: ఆత్మకూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ షహబుదీన్ పాల్గొన్నారు. బుద్ధా రాజశేఖర్ రెడ్డి సహకారంతో ఇవాళ పట్టణంలోని అంతర్గత రహదారులను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:22 PM IST

గుత్ప GP నూతన కార్యదర్శిగా రామ గౌడ్ బాధ్యతలు

NZB: ఆలూర్ మండలం గుత్ప GPకి బదిలీపై వచ్చిన రామ గౌడ్ శుక్రవారం నూతన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామ ప్రజల సహకారంతో పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాలు అర్హులైన వారికి సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటానని రామ గౌడ్ తెలిపారు. హౌసింగ్ ఏఈ ప్రశాంత్, నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శశి కుమార్, తదితరులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:21 PM IST

మున్సిపల్ హైస్కూల్‌లో పోక్సో, సైబర్ నేరాలపై అవగాహన

కడప: జిల్లా ఎస్‌పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిపల్ హైస్కూల్‌లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీ.ఐ జీ. ప్రసాద్ రావు విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. పోక్సో చట్టం, పిల్లల భద్రత, సైబర్ నేరాలు, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.

February 27, 2026 / 05:21 PM IST

ఉండవల్లిలో సమావేశానికి మంత్రి హాజరు..!

KRNL: ఉండవల్లి నివాసంలో కృష్ణానది ఒడ్డున నిర్వహించిన విందు సమావేశానికి కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ హాజరయ్యారు. నారా లోకేష్ ఆత్మీయంగా అందరినీ పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సతీసమేతంగా పాల్గొన్నారు. మహిళలకు మంగళగిరి పట్టుచీరలు అందజేశారు.

February 27, 2026 / 05:21 PM IST

క్రికెట్ ఆడిన కేయూ వీసీ ప్రతాపరెడ్డి

HNK: కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌ను నేడు కేయూ వైస్ ఛాన్సలర్ ప్రతాపరెడ్డి సందర్శించి కాసేపు విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడారు. క్రీడలతో మానసిక ఉల్లాసం లభిస్తుందని, విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడల్లో రాణించాలని వైస్ ఛాన్సలర్ అన్నారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.

February 27, 2026 / 05:21 PM IST