• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఇంటర్ పరీక్షలు.. 96.90 శాతం హాజరు

TG: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్- 1 పరీక్ష నిర్వహించారు. తొలి రోజు పరీక్షకు 96.90 శాతం హాజరు నమోదైనట్లుగా ఇంటర్ బోర్డు తెలిపింది. పరీక్షకు మొత్తం 5,14,598 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 4,98,695 హాజరయ్యారని, 15,903 మంది గైర్హాజరైనట్లుగా పేర్కొంది.

February 25, 2026 / 09:10 PM IST

చైన్ స్నాచింగ్.. ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్

AP: NTR జిల్లా తిరువూరులో జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఓ ప్రభుత్వ ఉద్యోగి అరెస్టయ్యాడు. విజయవాడలో అసిస్టెంట్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న నంద సుభాష్ అనే వ్యక్తి ఇటీవల చిక్కుళ్లగూడెంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును అపహరించాడు. నిందితుడి నుంచి 40గ్రా. బంగారు గొలుసు, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 09:10 PM IST

నానబెట్టిన బాదంతో ప్రయోజనాలు ఇవే..!

బాదం పప్పులను నేరుగా తినడం కంటే, రాత్రంతా నానబెట్టి పొట్టు తీసి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. బాదం పొట్టులో ఉండే ‘టానిన్’ అనే పదార్థం, పోషకాలను మన శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటుంది. పొట్టు తీసి తినడం వల్ల విటమిన్-E, ప్రోటీన్లు ఒంటికి బాగా పడతాయి. జుట్టు రాలడాన్ని తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి. అలాగే, జ్ఞాపకశక్తిని పెంచి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

February 25, 2026 / 09:08 PM IST

ప్రాజెక్టులపై చంద్రబాబు మౌనం: సాకే శైలజానాథ్‌

AP: పొరుగు రాష్ట్రాల కారణంగా రాయలసీమ ప్రాంతానికి నీటి కష్టం వచ్చిందని మాజీమంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. కర్ణాటక, తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాలు కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ప్రజల ప్రయోజనాలపై ప్రభుత్వం తక్షణం స్పందించాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 09:07 PM IST

పీఎం విశ్వకర్మపై అవగాహన కార్యక్రమం

WNP: పానగల్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఔత్సాహిక పాల్ సమీక వేతలకు విశ్వకర్మ, పీఎం ఈజిపి స్కీంలపై అవగాహన కల్పించారు. జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చేతివృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 09:06 PM IST

సబ్ కలెక్టర్‌కు సర్పంచ్ ఫిర్యాదు

KMR: ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్‌కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్‌లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.

February 25, 2026 / 09:05 PM IST

సూర్య కెప్టెన్సీపై వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌ యాదవ్‌పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత కూడా సూర్యనే కెప్టెన్‌గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. సూర్యకుమార్ ఒక అద్భుతమైన ఆటగాడని, అంతకు మించి గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. అతడిని కెప్టెన్సీ నుంచి తప్పించడం అంటే అది మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించాడు.

February 25, 2026 / 09:03 PM IST

నో రిటర్న్ బోర్డులు పెడితే శిక్ష తప్పదు!

దుకాణాల్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేసిన తర్వాత కొన్నిసార్లు రిటర్న్ చేయాలని అనుకున్నప్పుడు దూకాణదారులు తిరిగి తీసుకోరు. అయితే, అది ఎలాగైతే ఉందో అదే స్థితిలో ఉంటే తిరిగి తీసుకోవడానికి వ్యాపారి నిరాకరించకూడదని వినియోగదారుల చట్టం చెబుతోంది. బిల్లులపై నో రిటర్న్ అని రాయడం 1999 నుంచి నిషేధించబడింది. వస్తువును వెనక్కి తీసుకోకపోతే సదరు దుకాణదారుడికి జరిమానా కూడా విధిస్తారు.

February 25, 2026 / 09:00 PM IST

గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించండి: కలెక్టర్

PLD: గిరిజన తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలని పల్నాడు కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 6 మండలాల్లోని 22 తండాలకు పైపులైన్లు, రహదారుల నిర్మాణానికి అటవీ శాఖ తక్షణమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. క్యాంపు కార్యాలయం నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మౌలిక వసతుల కల్పనపై ఆమె దిశానిర్దేశం చేశారు.

February 25, 2026 / 09:00 PM IST

మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. 14 మంది గైర్హాజరు

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర (సెట్ “బీ”) తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246 మందికి 243 మంది, ఆదర్శ కళాశాల కేంద్రంలో 219 మందికి 208 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

February 25, 2026 / 08:59 PM IST

భారీ స్కాం.. ఫాల్కాన్ సీవోవో అరెస్ట్

TG: ఫాల్కాన్ సీవోవో వికాస్‌కుమార్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. 7,056 మంది డిపాజిటర్ల నుంచి రూ.4,215 కోట్లను ఫాల్కాన్ సంస్థ వసూలు చేసింది. రూ.792 కోట్ల స్కామ్‌కు ఫాల్కాన్ సంస్థ పాల్పడింది. దేశవ్యాప్తంగా ఫాల్కాన్‌పై 10 కేసులు నమోదు అయ్యాయి.

February 25, 2026 / 08:55 PM IST

కన్నంపాలెంలో రహదారి పనుల తనిఖీ

AKP: చోడవరం మండలం కన్నంపాలెంలో ఉపాధి నిధులతో నిర్మించనున్న రహదారి నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని ఎంపీడీవో సీతారామస్వామి బుధవారం తనిఖీ చేశారు. గ్రామంలో కల్లా వారి పొలాల నుంచి స్మశానం వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షలు మంజూరయ్యాయి. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి సూచించారు.

February 25, 2026 / 08:54 PM IST

‘కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్తాం’

NLR: చౌక ధరల దుకాణ దారుల డీలర్లు తమ సమస్యలు పరిష్కరించేలా చూడాలని ఆ సంఘం సంక్షేమ సమాఖ్య సభ్యులు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కమిషన్‌ నెలకు రూ. 6 వేల నుంచి 8 వేల వరకు మాత్రమే అందుతుందన్నారు. రూ. 35 వేలు ఆదాయం వచ్చేలా, డీలర్ల కుటుంబానికి ఆరోగ్య కార్డులను అందించేలా కేంద్ర దృష్టికి తీసుకెళ్తామన్నారు.

February 25, 2026 / 08:54 PM IST

గ్రామ సర్పంచ్‌లకి ప్రశంసా పత్రం అందజేత

PDPL: పెద్దపల్లి మదర్ థెరిసా కాలేజీలో నిర్వహించిన 5 రోజుల శిక్షణా కార్యక్రమం అనంతరం గ్రామ సర్పంచ్‌లకు ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఎంపీవో షబ్బీర్ చేతుల మీదుగా మంథని(M) గుంజపడుగుకి చెందిన దండవేన సంధ్యకి సర్టిఫికెట్ ప్రదానం చేశారు. పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై శిక్షణ పొందిన సర్పంచ్‌లకి అధికారులు అభినందనలు తెలిపారు.

February 25, 2026 / 08:53 PM IST

SL vs NZ: న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..?

శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఆ జట్టు 168 పరుగులు చేసింది. ఒక దశలో 12.1 ఓవర్లలో 84 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును సాంట్నర్ (47), మెక్‌కాంచీ (31) ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 47 బంతుల్లో 84 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చమీర, తీక్షణ తలో 3 వికెట్లు పడగొట్టారు.

February 25, 2026 / 08:52 PM IST