➢ 1901: ఆంధ్రరాష్ట్ర శాసనసభ తొలి స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం➢ 1918: తెలుగు రంగస్థల నటీమణి ఆవేటి పూర్ణిమ జననం➢ 1951: బీహార్ సీఎం నితీష్ కుమార్ జననం➢ 1986: తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు➢ 1997: స్వాతంత్ర్య సమరయోధుడు యలమంచిలి వెంకటప్పయ్య మరణం➢ ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
శ్రీలంకతో సూపర్ 8 మ్యాచులో పాక్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెమీస్‌కు అర్హత సాధించేందుకు ప్రత్యర్థిని 147 పరుగులకే కట్టడి చేయడంలో విఫలమైంది. దీంతో న్యూజిలాండ్ సెమీస్‌కు దూసుకెళ్లగా.. ఇందులో పాక్ సాధించిన విజయం వృథా అయింది. ఇక 213 రన్స్ లక్ష్యఛేదనలో లంక తరఫున రథ్‌నాయకే 58, కెప్టెన్ శనక 76* పరుగుల పోరాటం ఫలించలేదు.
KRNL: వేరుశనగ పంట పాసింగ్(గ్రేడింగ్) విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని శనివారం రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి గోవింద్‌కు వినతిపత్రం అందజేసి, గతంలో రద్దైన విధానాన్ని వ్యాపారస్తులు తిరిగి అమలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారని తెలిపారు.
T20 WC నుంచి పాక్ ఎలిమినేట్ అయింది. శ్రీలంకతో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్‌లో ప్రత్యర్థిని 147 రన్స్ లోపు కట్టడి చేయాల్సి ఉండగా.. పాక్ అలా చేయలేకపోయింది. దీంతో మెరుగైన రన్‌రేట్ ద్వారా గ్రూప్ 2 నుంచి న్యూజిలాండ్ సెమీస్‌కు అర్హత సాధించింది. ప్రస్తుత మ్యాచ్‌లో పాక్ గెలిచినా వృథానే కాగా.. 16 ఓవర్లలో ఆట ముగిసేసరికి లంక స్కోర్ 150/5.
CTR: కార్వేటి నగరం మండలం అన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. కార్వేటి నగరం నుంచి పల్లిపట్టు వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను అదుపుతప్పి ఢీకొంది. ప్రమాదంలో కృష్ణసముద్రం గ్రామానికి చెందిన యేసుమలై అక్కడికక్కడే మృతిచెందగా, ప్రేమ్ కుమార్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి.
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రేపు ఆతిథ్య ఆస్ట్రేలియాతో భారత అమ్మాయిల జట్టు మూడో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే 2-0తో సిరీస్ ఆసీస్ సొంతం కాగా.. వైట్ వాష్ నుంచి తప్పించుకునేందుకు మూడో వన్డేలోనైనా విజయం సాధించాలని హర్మన్ సేన భావిస్తోంది. ఈ సిరీస్ అనంతరం ఇరుజట్లు మార్చి 6 నుంచి ఏకైక టెస్ట్‌లో ఢీకొంటాయి.
TG: శారదా పీఠం భూములపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రభుత్వానికి వక్ఫ్ భూముల జోలికి వెళ్లే దమ్ముందా? అని ప్రశ్నించారు. శారదా పీఠం పక్కనే మైనింగ్ భూములు ఉన్నాయని తెలిపారు. మరి వాటి జోలికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. కేవలం ఒక వర్గానికి చెందిన పీఠాన్ని లేదా సంస్థను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ఆరా తీస్తున్నారని, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య అని పేర్కొన్నారు.
ASR: అరకులోయ ఆర్ఐటీఐ నందు 3 నెలల స్వల్పకాలిక ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ & పెరిఫెరల్స్, వెబ్ డవలపర్ కోర్సులు ఉచితంగా అందిస్తున్నట్టు శనివారం ప్రిన్సిపాల్ వై. ఉమాశంకర్ తెలిపారు. ఈ కోర్స్‌లలో శిక్షణ పొందటకు పది పాసై,16 ఏళ్ళు పైబడిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్ధులు మార్చి 7వ తేదీ లోపు ధరఖాస్తులను ఆర్ఐటీఐ ఆఫీసు నందు అందజేయాలన్నారు.
VSP: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే రెండు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది. రైలు నం.18501/02 (విశాఖ-కొల్లం) వారాంతపు ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం విశాఖలో బయలుదేరి బుధవారం కొల్లం చేరుకుంటుంది. రైలు నం.17065/66 (చర్లపల్లి-షాలిమార్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం చర్లపల్లిలో బయలుదేరి బుధవారం షాలిమార్ చేరుకుంటుంది.
VZM: నెల్లిమర్ల నియోజకవర్గం,గుడివాడలో ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంను ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శనివారం నిర్వహించారు. ప్రజా దర్బార్‌లో వచ్చిన విన్నపాలకు తక్షణ స్పందనతో అర్హులైన వారికి స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేయించారు. మాట తప్పని ప్రభుత్వం, ప్రజలకు ఎప్పుడూ అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందన్నారు.
SKLM: నగరంలో డయేరియా ను పూర్తిగా అరికట్టేందుకు అన్ని వార్డు సచివాలయా లకు వివిధ శాఖల ‘ప్రత్యేక అధికారులు’గా నియమిస్తూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అధికారులు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకే తమకు కేటాయించిన వార్డుల్లో రిపోర్ట్ చేయాలని, క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.
PPM: కురుపాం మండలం కిచ్చాడ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శనివారం తెలిపారు. రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. వరి పంట పొలాలలో పంటను ఏనుగులు ధ్వంసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. వీటిని ఈ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.
KRNL: తిరుపతిలోని ఎపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మార్చి 4న ఉద్యోగ మేళా నిర్వహించబడుతుందని కర్నూలు ఎపీఎస్ డీసీ అధ్యక్షుడు శివశంకర్ లోతేటి తెలిపారు. ఈ మేళాలో 10వ తరగతి నుంచి బీటెక్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కోసం ముఖాముఖి ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చని ఆయన పేర్కొన్నారు.
AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.
కడప నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మాజీ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష పాల్గొన్నారు. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా కడప నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులు 30 రోజులపాటు నిష్టతో ఉపవాసం పాటిస్తూ అల్లా మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.