• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గాజువాకలో లారీ డ్రైవర్ ఆత్మహత్య

VSP: గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలో లారీ డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. తమిళనాడుకు చెందిన విజ్జి అనే లారీ డ్రైవర్ బెల్ కంపెనీకి లోడ్‌తో వచ్చారు.. సమీపంలో ఉన్న మైదానంలో ఆయన ఉరివేసుకున్నారు. అయితే ఆత్మహత్యలు గల కారణాలు ఏంటి అన్నది ఇంకా తెలియ రాలేదు.

February 27, 2026 / 11:35 AM IST

ఆయేషామీరా అవశేషాలు అప్పగింత

AP: ఆయేషామీరా అవశేషాలను సీబీఐ జడ్జి తల్లిదండ్రులకు అప్పగించారు. సీబీఐ న్యాయమూర్తి ఎదుట ఆయేషా తల్లిదండ్రులు బోరున విలపించారు. తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో ఆయేషామీరా అవశేషాల ఖననానికి ఏర్పాట్లు చేశారు. తెనాలి శ్మశానం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. కాసేపట్లో ఆయేషామీరా అవశేషాలకు అంత్యక్రియలు నిర్వహించానున్నారు.

February 27, 2026 / 11:35 AM IST

అవనిగడ్డలో RTC బస్సు ఢీ కొని ఇన్నోవా కారు దగ్దం

NTR: అవనిగడ్డ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న అవనిగడ్డ డిపో RTC బస్సును, మచిలీపట్నం నుంచి వస్తున్న ఇన్నోవా కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా ధ్వసమైంది. ఢీకొన్న సమయంలో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు.

February 27, 2026 / 11:34 AM IST

పంట నష్ట నివేదికను సమర్పించాలి: కలెక్టర్

NRML: జిల్లాలో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల సుమారు 5 వేల ఎకరాల్లో పంట నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడించాయి. ముఖ్యంగా మక్కజొన్న పంటకు ఎక్కువ నష్టం వాటిల్లింది. నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి త్వరితగతిన నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ వ్యవసాయ అధికారులను శుక్రవారం ప్రకటనలో ఆదేశించారు.

February 27, 2026 / 11:33 AM IST

జమ్మిచెడు జమ్ములమ్మ అద్భుత రూపం

గద్వాల జిల్లా సమీపంలో వెలసిన జమ్మిచెడు జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం సందర్భంగా ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. కృష్ణా నది జలాలతో అభిషేకం, ఆకు పూజ హోమం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రంగుల చీరలతో అద్భుతంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు.

February 27, 2026 / 11:32 AM IST

గ్రహణం కారణంగా ఆలయాలు మూసివేత

SRCL: పాక్షిక చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3వ తేదీన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాలతో పాటు అన్ని అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ద్వారబంధనం చేయనున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు ఆలయ శుద్ధి, సంప్రోక్షణ అనంతరం భక్తులను అనుమతిస్తారు.

February 27, 2026 / 11:32 AM IST

సంజూపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు

టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్‌పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పవర్‌ప్లేలో బౌండరీలు కొట్టే క్రమంలో అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఆ రిస్క్ తీసుకోకపోతే జట్టు స్కోరు వేగంగా పెరగదు. అందుకే ‘సంజూని నిందించలేం’ అని పేర్కొన్నాడు. ఫీల్డింగ్ గ్యాప్స్‌ను వాడుకోవడమే అతని ప్రధాన ఉద్దేశమని అభిప్రాయపడ్డాడు.

February 27, 2026 / 11:32 AM IST

‘సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ రాజకీయం’

సూర్యాపేటలో కాంగ్రెస్ రౌడీ రాజకీయాలను సహించేది లేదని మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమళ్ల అన్నపూర్ణ హెచ్చరించారు. కేసీఆర్ జన్మదిన ప్లెక్సీని తొమ్మిదో వార్డులో కాంగ్రెస్ నేతలు ధ్వంసం చేసి కాలువలో పడేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి సంస్కృతి లేదని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని ఆమె విమర్శించారు.

February 27, 2026 / 11:32 AM IST

వైసీపీ నేతలు వీర్రాజుకు క్షమాపణ చెప్పాలి: బాబ్జి

కోనసీమ: శాసనమండలిలో BJP ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజును YCP నేతలు అడ్డుకోవడం శోచనీయమని కొత్తపేటకు చెందిన TDP జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల బాబ్జి ఆరోపించారు. తక్షణం వైసీపీ నేతలు వీర్రాజుకు క్షమాపణ చెప్పాలన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకంపై చర్చ సందర్భంగా వీర్రాజు మాట్లాడుతుండగా అడ్డుకునేందుకు మైకు లాక్కొనడానికి ప్రయత్నించడం అప్రజాస్వామికమని విమర్శించారు.

February 27, 2026 / 11:30 AM IST

లక్ష్మారెడ్డిపల్లిలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు

BHPL: గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో దోమల పెరుగుదలపై సర్పంచ్ వీరమల్ల సంపత్ రెడ్డి తక్షణ చర్యలు చేపట్టారు. గ్రామంలో దోమల తీవ్రతతో ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్న నేపథ్యంలో సమస్యను పరిశీలించి నివారణ చర్యలకు శ్రీకారం చుట్టారు. వార్డుల వారీగా పంచాయతీ సిబ్బందితో కలసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ దోమల నివారణ మందును పిచికారీ చేయించారు.

February 27, 2026 / 11:28 AM IST

విశాఖలో నేటి కాయగూరల ధరలు..!

విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శుక్రవారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయ రూ.18, టమాటా రూ.10, బంగాళాదుంప రూ.13, వంకాయ రూ.22/24, క్యారెట్ రూ.24, మిర్చి రూ.56, కాకరకాయ రూ.34, మునగకాడలు రూ.80, దొండ రూ.30, కాలి ఫ్లవర్ రూ.14, ఆనపకాయ రూ.10, బీరకాయ రూ.32, బీన్స్ పిక్కలు రూ.240, పెన్సిల్ బీన్స్ రూ.38, క్యాప్సికం రూ.44లుగా ఉన్నాయి.

February 27, 2026 / 11:26 AM IST

OTTలోకి వచ్చేసిన ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’

రాజీవ్‌ కనకాల, ఉదయభాను, వాసంతిక ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘డాటర్‌ ఆఫ్‌ ప్రసాద్‌రావు: కనబడుటలేదు’. కృష్ణ పోలూరు దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తండ్రీకూతుళ్ల అనుబంధం, ఉత్కంఠభరితమైన థ్రిల్లింగ్‌ అంశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది.

February 27, 2026 / 11:26 AM IST

లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్‌చిట్

NZB: నిజామాబాద్ జిల్లా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితకు భారీ ఊరట దక్కింది. కేసులో ఆమె పేరును కూడా రౌస్ అవెన్యూ కోర్టు డిశ్ఛార్జ్ చేసింది. అధారాలు లేకుండా ఇరికించారని సీబీఐపై కోర్టు ఆగ్రహించింది. దీంతో కవితకు క్లీన్‌చిట్ లభించినట్లు అయింది. కాగా ఈ కేసులో కవిత గతంలో జైలుకెళ్లారు.

February 27, 2026 / 11:25 AM IST

ప్రతి రైతు గుర్తింపు కార్డు చేసుకోవాలి

MDK: భూమి కలిగి ఉన్న ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోని రైతు గుర్తింపు కార్డు పొందాలని మనోహరాబాద్ మండల వ్యవసాయ అధికారి స్రవంతి తెలిపారు. మండలంలోని కుచారం క్లస్టర్ పరిధిలోని కాళ్లకల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ సచిన్, రైతులు పాల్గొన్నారు.

February 27, 2026 / 11:25 AM IST

‘యువత నైపుణ్యాన్ని గుర్తించి క్రీడల్లో రాణించాలి’

BDK: ఆళ్లపల్లి మండలం చింతోళ్లగుంపు గ్రామానికి చెందిన గొగ్గెల సాయిని పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఎస్సై ఎం. సోమేశ్వర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. సీఎం కప్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సాయి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. యువత తమలోని నైపుణ్యాన్ని గుర్తించి క్రీడల్లో రాణించాలని వారు సూచించారు.

February 27, 2026 / 11:25 AM IST