SRCL: వేములవాడ రాజన్న క్షేత్రంలో ముగ్గురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఆలయ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. బాసరలో పనిచేస్తున్న లక్ష్మణరావుకు ఏఈఓ (AEO) గా, సీనియర్ అసిస్టెంట్లు ఎడ్ల శివసాయి, ఓన్నారం భాస్కర్లకు పర్య వేక్షకులుగా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతుల పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ATP: పామిడి మండలం జి. కొట్టాల గ్రామంలోని శ్రీనివాస్ ఆచారికి చెందిన వేరుశనగ, వరి గడ్డి వాములు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి గడ్డి, డ్రిప్, స్ప్రిం క్లర్లు కాలిపోయాయని బాధితుడు తెలిపాడు. దీంతో రూ.2.50 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు.
E.G: రూడా ఛైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గురువారం సీఎం చంద్రబాబును అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు నియోజకవర్గం పలు అభివృద్ధి కార్యక్రమాలపై, పురుషోత్తపట్నం పుష్కర ఎత్తిపోతల పథకం రైతులకు నష్టపరిహారం కోసం, CMRFపై సమీక్షించి వినతి పత్రాలు అందజేశారు.
NLR: మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై కీలక సమీక్ష జరిగింది. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని కమిటీల నియామక విధివిధానాలపై సూచనలు చేశారు. అనుబంధ కమిటీలలో మహిళలకు తగిన ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
KRNL: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి గురువారం డిమాండ్ చేశారు. మహిళతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. ఇలాంటి వివాదాల్లో ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్ పదవిలో కొనసాగడం సరికాదని, వెంటనే ఆయనను పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యే కోరారు.
VSP: నగరంలో నీటి వినియోగం, లభ్యతపై కలెక్టర్ హరేంధిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సమావేశం నిర్వహించారు. 24 లక్షల జనాభాకు 453 MLD నీరు అవసరం కాగా ప్రస్తుతం 390 MLD సరఫరా జరుగుతోందన్నారు. భవిష్యత్తులో వినియోగం పెరగనున్న నేపథ్యంలో రీసైక్లింగ్ ద్వారా నీటిని వినియోగించే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
NLG: నకిరేకల్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్న పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం కలిశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాల అమలుపై మంత్రితో ఎమ్మెల్యే చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
TPT: రైల్వే స్టేషన్ విస్తరణ పనుల నేపథ్యంలో రైల్వే భూముల్లో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో రైల్వే భూమిలో నివసిస్తున్న 10 మందికి నోటీసులు జారీ చేశారు. 20 రోజుల్లో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, లేకపోతే రైల్వే శాఖ తొలగిస్తుందని అధికారులు హెచ్చరించారు.
BDK: కరకగూడెం(M) అశ్వాపురంపాడులో గత నెల 28న జరిగిన కొవ్వాసి వెంకటేశ్వర్లు హత్యకేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షల నేపథ్యంలో రూ.50 వేల సుపారీ ఇచ్చి వెంకటేశ్వర్లును హతమార్చినట్లు CI వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నేరానికి పాల్పడిన వజ్జ భీమరాజు మడివి మంగయ్య, మడివి నందయ్య సహా ఐదుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
MNCL: చెన్నూర్ పట్టణంలో మంత్రి వివేక్ వెంకటస్వామి శుక్రవారం పర్యటించనున్నారు. సా:4.గం.లకు మహంకాళి కాలనీలో 99 రోజుల ప్రజా పాలన-ప్రణాళిక అమలు కార్యక్రమంలో పాల్గొంటారు. సా:4.30.గం.లకు రూ.50 లక్షల నిధులతో మైనార్టీ ఫంక్షన్ హాల్ అభివృద్ధికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సా:6.గం.లకు మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు.
KDP: నగరంలో గంజాయి,బహిరంగ మద్యపానం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ పార్టీలు దాడులు నిర్వహిస్తున్నాయి. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి అనుమానితులను గుర్తించి కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
W.G: జిల్లాలోని ఆక్వా రైతుల సమస్యలపై జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి గురువారం భీమవరం కలెక్టరేట్లో మత్స్యశాఖ, తూనికలు-కొలతలు, వాణిజ్య పన్నులు, ఎంపెడ అధికారులతో సమీక్షించారు. ఆక్వా రైతులంతా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.
VKB: తాండూరు పట్టణ ప్రజలు, వ్యాపారులు అందరు ఆస్తిపన్నులు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. నిన్న ఆయన మాట్లాడుతూ.. తాండూరు మున్సిపల్ పరిధిలో పెద్ద మొత్తంలో ఆస్తిపన్నుల బకాయిలు ఉన్నాయని తెలిపారు. యజమానులు, వ్యాపారులు నేరుగా వారికి ఆస్తిపన్నులు చెల్లించవచ్చన్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా చెల్లించవచ్చని అన్నారు.
RR: 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నేటి నుంచి స్పెషలిస్ట్ వైద్యులతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌వో డా.లలితా దేవీ తెలిపారు. జిల్లాలో మొదటి దశ కార్యక్రమాలు మాతృ ఆరోగ్యం, మహిళా ఆరోగ్యం, శిశు ఆరోగ్యం, వృద్ధుల గురించి చేపడతామన్నారు. మార్చి 31 వరకు కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు.
MHBD: బయ్యారం పోలీస్ స్టేషన్ పరిధిలో గాయపడిన బాధితుడి ఇంటికే వెళ్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గురువారం మండల కేంద్రానికి చెందిన రాయల సతీష్ ఓ వివాదంలో తీవ్రంగా గాయపడి కాలు విరగడంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఎస్సై తిరుపతి బాధితుడి ఇంటికి వెళ్లి ఘటనపై విచారించి ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.