• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

దరఖాస్తుల గడువు పొడిగింపు

SDPT: 2026-27 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశాలతో పాటు 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తు గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

March 4, 2026 / 06:34 AM IST

గ్రహణ ప్రభావం.. నేడు హోలీ సంబరాలు

ADB: నిన్న చంద్రగ్రహణం కారణంగా నార్నూర్ మండలంలోని కొన్ని గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహించలేదు. ఆచారాలు పాటిస్తూ ఇళ్లకే పరిమితమైన గ్రామస్తులు, బుధవారం రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఆనందంగా పాల్గొన్నారు. దీంతో గ్రామాల్లో మళ్లీ పండుగ వాతావరణం నెలకొంది.

March 4, 2026 / 06:34 AM IST

కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఆమోదం

WNP: జిల్లా నాగవరం శివారులో కొత్తగా కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాపనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాజపేట గ్రామంలోని ప్రభుత్వ యూత్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో తాత్కాలికంగా విద్యాబోధన ప్రారంభం కానుంది. దీంతో మధ్య తరగతి విద్యార్థులకు నాణ్య మైన విద్య అందుబాటులోకి వస్తుందని ఎమ్మెల్యే మెగా రెడ్డి పేర్కొన్నారు.

March 4, 2026 / 06:32 AM IST

తుమ్మన్పేటతో విడదీయలేని అనుబంధం: విజయ్ దేవరకొండ

NGKL: జిల్లా తుమ్మన్పేటలో జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ నటుడు విజయ్ దేవరకొండ భావోద్వేగంగా ప్రసంగించారు. తన తొలి పుట్టినరోజు జరుపుకున్న ఈ మట్టితో తనకు విడదీయలేని అనుబంధం ఉందని, తల్లిదండ్రుల కోరిక మేరకే ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల 9,10 తరగతి విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్పులు అందజేస్తామన్నారు.

March 4, 2026 / 06:32 AM IST

హత్యాయత్నం.. తండ్రీకొడుకు అరెస్ట్

ADB: ఆర్థిక లావాదేవీల మనస్పర్ధలతో ప్రకాష్ జైస్వాల్ పై కత్తితో దాడి చేసిన తండ్రీకొడుకులు ఉమర్ ఖలీల్, వసీం కోకర్‌ను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కత్తి, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు CI నాగరాజు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించామన్నారు.

March 4, 2026 / 06:32 AM IST

సునీల్ కుటుంబానికి రూ.5 లక్షల సాయం

TPT: చిల్లకూరులో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ బుదురారు సునీల్ కుటుంబాన్ని వైసీపీ నేత పేర్నాటీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి పరామర్శించారు. ఈ నెల 28న జరిగిన ఈ ఘటనలో సునీల్ మృతి చెందగా, కుటుంబ సభ్యుల పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. వారి చదువు కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

March 4, 2026 / 06:32 AM IST

ఢిల్లీకి రాష్ట్ర పోలీస్ అధికారులు

TG: మావోయిస్టుల అణిచివేతపై వ్యూహరచన చేసేందుకు ఇవాళ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ అధికారులతో వీరు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, సరిహద్దు భద్రత, ఉమ్మడి వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రం నుంచి అందే సాంకేతిక సహకారం, నిధుల వినియోగంపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.

March 4, 2026 / 06:32 AM IST

యువకుడిపై లైంగిక దాడి కేసు నమోదు: ఎస్సై

MHBD: కేసముద్రం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, మహబూబాబాద్ మండలానికి చెందిన ఓ యువకుడితో కొద్ది నెలల క్రితం వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో వారిద్దరూ కలిసి సన్నితంగా ఉండటంతో బాలిక గర్భం దాల్చింది. యువకుడి కుటుంబం వివాహానికి అంగీకరించకపోవడంతో బాలిక ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రాంతి కిరణ్ పేర్కొన్నారు.

March 4, 2026 / 06:31 AM IST

రూ.3 లక్షల బియ్యం సీజ్..

TPT: గూడూరు పట్టణంలో విజిలెన్స్ అధికారులు విజయ్ లెన్స్ తనిఖీలు నిర్వహించారు. టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఉన్న ఓం సాయిరాం రైస్ దుకాణంలో సరైన బిల్లులు లేకుండా బియ్యం విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. సుమారు రూ.3 లక్షల విలువైన బియ్యం వస్తువులను సీజ్ చేసి, సరైన బిల్లులు చూపకపోవడంతో దుకాణం యజమానిపై కేసు నమోదు చేశారు.

March 4, 2026 / 06:30 AM IST

నిలకడగా హనుమంతరాయ చౌదరి ఆరోగ్య పరిస్థితి

ATP: మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అనంతపురంలోని సవీర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం రాత్రి వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. ప్రస్తుతం ఆరోగ్య సూచీలు స్థిరంగా ఉన్నాయని, చికిత్సకు సానుకూలంగా స్పందిస్తున్నారని వైద్య బృందం వెల్లడించింది.

March 4, 2026 / 06:27 AM IST

‘మహిళలు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలి’

NTR: విజయవాడలోని ఏపీ ఐఐసీ కాలనీలోని తులసమ్మ కళ్యాణ మండపంలో డ్వాక్రా మహిళలకు రూ.4 కోట్ల రుణం చెక్కును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అందిస్తున్న రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకుని, మహిళలు తమ కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు.

March 4, 2026 / 06:27 AM IST

చెరువులో చెత్త డంపింగ్..!

SKLM: నరసన్నపేటలోని గుండవల్లిపేట సమీపంలో ఉన్న చెరువులో గ్రామాల్లో సేకరించిన చెత్తను డంప్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గుండవల్లిపేట, రావుల వలస గ్రామాల నుంచి సేకరించిన చెత్తను చెరువులో వేయడంతో నీరు కలుషితం అవుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువులో చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 4, 2026 / 06:27 AM IST

39 బస్తాలు అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ నుంచి ద్రాక్షారామం తరలిస్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసిన కరప ఎస్ఐ సునీత 39 బస్తాల రేషన్ బియ్యాన్ని మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,87,860గా నిర్ధారించారు. బియ్యం, ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరిస్తామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

March 4, 2026 / 06:27 AM IST

కార్యకర్తను పరామర్శించిన MLA

PLD: గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురజాల మండలం తేలుకుట్ల బీసీ నాయకుడు బత్తుల ఏడుకొండలను ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం పరామర్శించారు. దాడిలో గాయపడిన ఏడుకొండలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. “పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం, వైసీపీ దాడులకు ఎవరూ భయపడాల్సిన పనిలేదు” అని ఆయన ధైర్యం చెప్పారు.

March 4, 2026 / 06:26 AM IST

నేడు నాంచారమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు

GNTR: చేబ్రోలు మండలం శలపాడులో నేడు, రేపు శ్రీ నాంచారమ్మ తల్లి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం భారీ అన్నదానంతో పాటు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.

March 4, 2026 / 06:25 AM IST