• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘లక్ష్యానికి చేరువగా జిల్లా రుణ ప్రణాళిక’

SRPT: జిల్లా వార్షిక రుణ ప్రణాళికలో 88.44 శాతం పురోగతి సాధించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. రూ.11,919 కోట్ల లక్ష్యానికి గాను రూ.10,541 కోట్లు ప్రజలకు అందించామన్నారు. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 96 శాతం వృద్ధి నమోదైందని పేర్కొన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సీతారామారావు ఉన్నారు.

February 25, 2026 / 07:04 PM IST

చీరాలలో పోలీసుల అవగాహన సదస్సు

BPT: చీరాల పోలీసులు మాదకద్రవ్యాలు, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై ప్రజలు, యువతకు అవగాహన కల్పించారు. బాపట్లను డ్రగ్స్ రహిత (నషా ముక్త్) జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు.

February 25, 2026 / 07:03 PM IST

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

TG: ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ రెడ్డి పదవీకాలాన్ని రెండేళ్ల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

February 25, 2026 / 07:02 PM IST

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: MLA ప్రత్తిపాటి

PLD: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అసెంబ్లీలో స్పష్టం చేశారు. బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు వివరాలు తెలుపుతూ, తన రాజకీయ ప్రస్థానంలో మైనార్టీల పాత్ర కీలకమని కొనియాడారు. వారి కోసం గతంలోనే చిలకలూరిపేటలో రూ.18 కోట్లతో మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

February 25, 2026 / 07:02 PM IST

‘బాధితులకు సత్వర న్యాయం అందించాలి’

NRML: జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని గ్రామాల నుంచి వచ్చిన ఆరుగురు ఆర్జిదారుల ఫిర్యాదులను తీసుకుని, సంబంధిత పోలీస్ అధికారులతో వెంటనే మాట్లాడి చట్టపరమైన సహాయం అందించాలని ఆదేశించారు.

February 25, 2026 / 07:02 PM IST

‘ఆరోగ్య, భీమా పథకాలు ఆగకుండా చూడాలి’

JGL: ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య, భీమా పథకాలు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలని సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ కోరారు. తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ జిల్లా సమావేశంలో మాట్లాడుతూ.. భీమా వయోపరిమితిని 70 ఏళ్లకు పెంచాలని, పెండింగ్ డీఏలు, బకాయిలు విడుదల చేసి పీఆర్సీ ప్రకటించాలని CM రేవంత్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.

February 25, 2026 / 07:02 PM IST

‘గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలి’

VSP: పేదల గృహ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే 3-4 నెలలు నిర్మాణాలకు అనుకూల కాలమని, ఈలోపు లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనుల్లో జాప్యం జరిగితే అధికారులకు నోటీసులు జారీ చేయాలన్నారు.

February 25, 2026 / 07:02 PM IST

జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక

ADB: జిల్లా ఓసీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడిగా డాక్టర్ ప్రఫుల్ వజే, ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కౌటిక్ రాజేశ్వర్ ఎన్నికయ్యారు. బుధవారం జాతీయ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ కొత్త కమిటీని ప్రకటించి, సభ్యులను ఘనంగా సన్మానించారు. ఓసీ వర్గాల ఐక్యతే లక్ష్యమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

February 25, 2026 / 07:01 PM IST

ప్రజల కోసం కలిసికట్టుగా పని చేయాలి: ఎస్పీ

WNP: నూతనంగా ఎన్నికైన వనపర్తి మున్సిపల్ ఛైర్మన్ మాధవి రమేష్ జిల్లా ఎస్పీ సునీత రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని మున్సిపల్ ఛైర్మన్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

February 25, 2026 / 07:01 PM IST

అపార్ట్మెంట్ పై నుంచి దూకి యువకుడు మృతి

కృష్ణా: గుడివాడ టిట్కో కాలనీకి మల్లేశ్వరరావు కుమారుడు అందే నాగ సతీష్ కుమార్ గత 3 నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతూ ఏలూరులో చికిత్స పొందుతున్నాడు. తలనొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పగా, వారు ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో సతీష్ అపార్ట్మెంట్‌పై అంతస్తు నుంచి కిందకు దూకాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు బుధవారం వైద్యులు నిర్ధారించారు.

February 25, 2026 / 07:00 PM IST

మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు: DEO

MNCL: 10వ తరగతి వార్షిక పరీక్షల కార్యాచరణ ఖరారైందని మంచిర్యాల డీఈఓ యాదయ్య తెలిపారు. మార్చి 14 నుండి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, ఇందు కోసం జిల్లాలో 48 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామన్నారు.

February 25, 2026 / 07:00 PM IST

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో గ్రంధాలయ ఛైర్మన్

RR: చేవెళ్ల నియోజకవర్గం, షాబాద్ మండలం అంతిరెడ్డి గూడ గ్రామంలో అచిని సత్తయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఏలుగంటి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ ఛైర్మన్ కావలి చంద్రశేఖర్, సర్పంచ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 06:59 PM IST

చంద్రబాబు మాట్లాడినవన్నీఅసత్యాలే: వరుదు కళ్యాణి

AP: అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినవన్నీ అసత్యాలేనని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. గతంలో తిరుమలపై వైఎస్ తెచ్చిన జీవోలను రద్దు చేస్తామని అన్నది చంద్రబాబేనని గుర్తు చేశారు. వైవీ సుబ్బారెడ్డి భార్యపై మతపరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితువు పలికారు. వైవీ సతీమణి సనాతన హిందూ స్త్రీ అని ఆమె స్పష్టం చేశారు.

February 25, 2026 / 06:59 PM IST

వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్, 22Aపై సమగ్ర సమీక్ష సమావేశం

KDP: రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులు మనసుపెట్టి పని చేయాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లా సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో 22A, మ్యూటేషన్, వెబ్‌ల్యాండ్ కరెక్షన్స్ తదితర అంశాలపై మండలాల వారీగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవెన్యూ క్లినిక్‌ల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు.

February 25, 2026 / 06:59 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఎల్లో అలర్ట్

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ బుధవారం సాయంత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హన్మకొండ, మహబూబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి గరిష్ట వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

February 25, 2026 / 06:58 PM IST