• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కాలేజీ బస్సును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు మృతి

AP: ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతలపూడి మండలం జానంపేట దగ్గర ఓ బైక్ కాలేజీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 06:40 PM IST

‘కొవ్వూరు నియోజకవర్గంలో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి’

E.G: కొవ్వూరు నియోజవర్గంలోని దళితలకు ఉచితంగా సివిల్ సర్వీస్, గ్రూప్ 1, గ్రూప్ 2, DSC కొరకు కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ కోరింది. ఈ మేరకు సోమవారం కొవ్వూరు రెవిన్యూ డివిజన్ అధికారిని శాఖ సభ్యులు పెనుమాక జయరాజు, కొప్పాక జవహర్, విజయానంద కుమార్ కలిసి వినతి పత్రం అందించారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

March 2, 2026 / 06:38 PM IST

ప్రజావాణికి 113 దరఖాస్తులు: కలెక్టర్

KMR: కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 113 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, జడ్పీ సీఈవో చందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:38 PM IST

పేలుడు ఘటన.. పంట పొలాల్లో మహిళ తల

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇటీవల జరిగిన భారీ పేలుడు ఘటనలో మరో హృదయ విదారక దృశ్యం వెలుగుచూసింది. పేలుడు దాటికి శరీరం నుంచి వేరైన ఓ మహిళ తల సమీపంలోని పంట పొలాల్లో లభ్యమైంది. మహిళ తలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ ఘటనలో 22 మంది మరణించిన విషయం తెలిసిందే.

March 2, 2026 / 06:37 PM IST

‘ఉగాది నాటికి గృహ నిర్మాణ లక్ష్యాలు సాధించాలి’

PPM: జిల్లాలో చేపడుతున్న గృహ నిర్మాణాల లక్ష్యాలను ఉగాది నాటికి సాధించాలని ఇంఛార్జ్ జాయింట్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మొత్తం 34,965 గృహాలు మంజూరు కాగా, ఇప్పటివరకు 20,859 గృహాలు పూర్తయ్యాయన్నారు.

March 2, 2026 / 06:36 PM IST

బాపట్ల జిల్లా కలెక్టర్ ప్రజా వేదికలో 135 అర్జీలు

BPT: బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం 135 అర్జీలు అందాయని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ప్రజలు ఎన్నో ఆశలతో కార్యాలయానికి వస్తారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చిన అర్జీలను 24 గంటల్లోనే పరిష్కరించి బాధితులకు తక్షణ ఊరట కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.

March 2, 2026 / 06:35 PM IST

మన శివశంకర వరప్రసాద్ అర్థశత దినోత్సవ వేడుక సంబరాలు

VZM: మన శంకర వరప్రసాద్ సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలను నగరంలోని హిమగిరి థియేటర్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా సెలబ్రేషన్స్‌లో ముందుగా కేక్ కట్ చేసి, స్వీట్స్ పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు.

March 2, 2026 / 06:35 PM IST

రేపు రాజరాజేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి ఆలయాల మూసివేత

SRCL: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 6.15 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామితో పాటు, భీమేశ్వర స్వామి ఆలయం, అనుబంధ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం సాయంత్రం 7.15 గంటలకు పుణ్యాహవచనం నిర్వహించి, ఆలయం అంతట సంప్రోక్షణ చేస్తామన్నారు.

March 2, 2026 / 06:34 PM IST

అర్జీలపై వెంటనే చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్

JGL: జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ బి. సత్యప్రసాద్ అదనపు కలెక్టర్, ఆర్డీవోలతో కలిసి ప్రజల నుంచి 62 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. అర్జీలపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు. పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:34 PM IST

శిక్షణ తరగతులకు హాజరైన సర్పంచులు

ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచులకు ఉట్నూరులోని YTC కేంద్రంలో శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా పలువురు సర్పంచులు సోమవారం ట్రైనింగ్ కు హాజరయ్యారు. గ్రామ పరిపాలన, వివిధ సంక్షేమ పథకాలు, నిధుల ఖర్చులు తదితర వాటిపై ఉన్నతాధికారులు వారికి అవగాహన కల్పించారు.

March 2, 2026 / 06:33 PM IST

ఇంటర్ పరీక్షలకు 139 మంది గైర్హాజరు

జనగామ జిల్లా వ్యాప్తంగా 16 పరీక్ష కేంద్రాల్లో ఇవాళ జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 139 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జనగామ జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. 4,775 మంది విద్యార్థులకు గాను 4,636 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తం 97.08 హాజరు శాతం నమోదైందని వెల్లడించారు.

March 2, 2026 / 06:33 PM IST

‘రంజాన్ పండుగ.. ముందస్తు చర్యలు తీసుకోండి’

MBNR: రంజాన్ పండుగను పురస్కరించుకుని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సమావేశంలో CIలు అప్పయ్య, అజాజుద్దీన్, ముస్లిం మత పెద్దలు శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. DSP మాట్లాడుతూ.. సమాజంలో మత సామరస్యం అత్యంత ముఖ్యమని, ఎలాంటి మత సమస్యలు తలెత్తకుండా చర్యలు చేసుకోవాలని కోరారు.

March 2, 2026 / 06:32 PM IST

శ్రీరాములపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు

SDPT: కోహెడ పోలీసుల ఆదేశాల మేరకు శ్రీరాములపల్లి గ్రామంలో గాంధీ చౌరస్తా, ప్రాథమిక పాఠశాల, అంబేద్కర్ చౌరస్తా వద్ద మొత్తం 8 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో హుస్నాబాద్ ఏసీపీ సదానందం, సర్పంచ్ పోలు శ్రీనివాస్ ప్రారంభించారు. సీసీ కెమెరాలు గ్రామ భద్రతకు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు.

March 2, 2026 / 06:32 PM IST

ఎస్పీ గ్రీవెన్స్‌కు 56 వినతులు

SKLM: జిల్లా పోలీస్ కార్యాలయంలో మీ కోసం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సోమవారం నిర్వహించారు. ఈ మేరకు భూ తగాదాలకు సంబంధించి, కుటుంబ కలహాలకు సంబంధించి, మోసాలకు పాల్పడినట్లు, ఇతర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 56 అర్జీలను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. వినతులను త్వరగా పరిష్కరించాలని పోలీసులను ఆదేశించారు.

March 2, 2026 / 06:32 PM IST

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్

BHPL: జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాహుల్ శర్మ హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ప్రతి ఇంటా ఆనందం, ఐక్యత, స్నేహభావాలను నింపాలని ఆకాంక్షించారు. హోలీ మన సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన పండుగని, చెడుపై మంచి విజయం సాధించిన సంకేతమని తెలిపారు. చిన్నారులు పెద్దల పర్యవేక్షణలోనే రంగులాడాలని, సహజసిద్ధ రంగులనే వినియోగించాలని అన్నారు.

March 2, 2026 / 06:32 PM IST