• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

హైకోర్టుకు బెదిరింపులు.. ఫేక్ మెయిల్

TG: హైకోర్టులో బాంబు ఉందని గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టు ప్రాంగణాల్లో విస్తృత తనిఖీలు చేపట్టి.. అది ఫేక్ మెయిల్ అని స్పష్టం చేశారు. కోర్టు పరిసరాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని తెలిపారు. అయితే ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

March 3, 2026 / 02:27 PM IST

హెల్త్ సెంటర్‌కు భూమిపూజ

NDL: పాములపాడు(మం) భానుముక్కలలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆరోగ్య కేంద్రానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య మంగళవారం భూమిపూజ చేశారు. గ్రామ ప్రజల ఆరోగ్య సౌకర్యాల మెరుగుదల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని తెలిపారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. గ్రామస్తులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 02:25 PM IST

అనాధ ఆశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ

SRPT: కోదాడ పట్టణంలో శనగల రాధాకృష్ణ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనాధ ఆశ్రమంలోని మానసిక వికలాంగులు, చిన్నారులకు మంగళవారం హోళీ సందర్భంగా అన్నదానం, పండ్లు పంపిణీ చేశారు. నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన జంపాల వెంకన్న-ఉమా దంపతుల ఆర్థిక సహకారంతో నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సేవా సంస్థ తరఫున దాతకు అభినందనలు తెలిపారు.

March 3, 2026 / 02:25 PM IST

వైభవంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలు

BHNG: శ్రీ భవాని రామలింగేశ్వరా స్వామి కళ్యాణమహోత్సవం, బ్రహ్మోత్సవం సందర్భంగా స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి MP చామల కిరణ్ కుమార్ రెడ్డికి దేవాలయ కమిటీ ఛైర్మన్ గుండగోని రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఛైర్మన్ గడ్డం స్వప్న, సోమనర్సయ్య ఘనంగా స్వాగతం పలుకగా, ప్రత్కేక పూజలు చేసి కళ్యాణంలో పాల్గొన్నారు.

March 3, 2026 / 02:23 PM IST

సంజూ శాంసన్ నెట్ వర్త్ ఎంతంటే?

సంజూ శాంసన్ నికర ఆస్తి విలువ సుమారు రూ.80-90 కోట్లు ఉంది. IPL ఒప్పందం ద్వారా ఏడాదికి రూ.14 కోట్లు, బీసీసీఐ కాంట్రాక్టుతో ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజులు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా భారీగా ఆదాయాన్ని పొందుతున్నాడు. క్రికెట్ మైదానంలోనే కాకుండా, ఆర్థికంగా కూడా సంజూ అత్యంత విజయవంతమైన ఆటగాడిగా దూసుకుపోతున్నాడని నివేదికలు చెబుతున్నాయి.

March 3, 2026 / 02:22 PM IST

T20 WC సెమీస్: అంపైర్లు, మ్యాచ్ రిఫరీలు వీరే

సెమీఫైనల్ మ్యాచ్‌లకు ICC మ్యాచ్ రిఫరీలను ప్రకటించింది. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు రిఫరీగా జవగల్ శ్రీనాథ్ వ్యవహరించనున్నాడు. ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్‌లు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇక IND-ENG సెమీస్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్, ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్‌లు వ్యవహరించనున్నారు.

March 3, 2026 / 02:22 PM IST

మహిళా పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య శిబిరం

కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక వైద్య పరీక్షలు, రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. టూ టౌన్ సీఐ హనీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా మహిళా పోలీస్ సిబ్బంది ఆరోగ్యం పెంపొందించడంతోపాటు వారి శ్రేయస్సు పట్ల పోలీస్ శాఖకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.

March 3, 2026 / 02:21 PM IST

ప్రభుత్వ భవనాలే రూ.వెయ్యి కోట్ల బాకీ?

HYD: GHMC విభజన తర్వాత ఖజానా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. సుమారు ₹3,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోవడంతో అధికారులు చర్యలకు దిగారు. బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ అయ్యాయి. గడువులోగా చెల్లించకుంటే ఆస్తులను జప్తు చేయొచ్చు. విడ్డూరమేంటంటే.. ప్రభుత్వ భవనాలే దాదాపు ₹1,000 కోట్లు బకాయి ఉన్నాయి.

March 3, 2026 / 02:20 PM IST

కాపర్ కాయిల్స్ దొంగల ముఠా అరెస్ట్: సీపీ

NZB: అంతర్రాష్ట్ర ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు CP సాయిచైతన్య తెలిపారు. ముధోల్, భైంసాకు చెందిన 10 మంది ముఠా సభ్యులు పంట పొలాల్లోని ట్రాన్స్‌ఫార్మర్‌లను చోరీ చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అరెస్టు చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

March 3, 2026 / 02:19 PM IST

రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

SKLM: పలాస మండలం నీలిపద్ర గ్రామంలో మంగళవారం రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ టీపీసీ ఛైర్మన్ బాబు రావు, టీడీపీ జిల్లా కార్యదర్శి విఠల్ రావు హాజరై రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేసిందన్నారు.

March 3, 2026 / 02:19 PM IST

శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

అనకాపల్లి మండలం మామాడిపాలెం, తగరంపూడి గ్రామాల్లో మంగళవారం ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ పలు ప్రారంభోత్సవ శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మామిడిపాలెం జడ్పీ హైస్కూల్లో కొత్తగా నిర్మించిన అదనపు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, ఎస్సీ కాలనీలో పార్క్‌ను ప్రారంభించారు. అనంతరం తగరంపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

March 3, 2026 / 02:18 PM IST

మత్స్యకారులకు రాయితీపై మూడు చక్రాల వాహనాల పంపిణీ

GNTR: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అర్హులైన ముగ్గురు మత్స్యకారులకు 60 శాతం, 40 శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాలను గుంటూరులో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి పి.ఎన్. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. పథకం ద్వారా మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు.

March 3, 2026 / 02:17 PM IST

జీఎంసీ బాలయోగికి నివాళులర్పించిన లోకేష్

AP: లోక్‌సభ తొలి దళిత స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి వర్థంతి సందర్భంగా మంత్రి లోకేష్ నివాళులర్పించారు. ‘దళితులు, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి జీఎంసీ బాలయోగి అహర్నిశలు కృషి చేశారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. దేశానికి, రాష్ట్రానికి వారు అందించిన సేవలు చిరస్మరణీయం. కోనసీమ ముద్దుబిడ్డ బాలయోగి ఆశయ సాధనకు ప్రతిఒక్కరం కృషిచేద్దాం’ అని ట్వీట్ చేశారు.

March 3, 2026 / 02:16 PM IST

అంగన్వాడీ కార్యకర్తల రాస్తారోకో

VZM: జీతాలు పెంచాలని అమరావతిలో శాంతియుతంగా ధర్నాలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అక్రమ అరెస్టు చేశారు. వారిని బేషరతుగా విడుదల చేయాలని మంగళవారం కొత్తవలస కూడలిలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, తమిళనాడు తరహాలో అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు.

March 3, 2026 / 02:16 PM IST

నూతన కమిటీని ప్రకటించిన మాజీ ఎమ్మెల్యే

NLR: కోవూరు మండలం పాటూరు గ్రామ వైసీపీ నూతన కమిటీని మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈ కమిటీని ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

March 3, 2026 / 02:15 PM IST