• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

న్యాయవాదులతో హుస్సేన్ నాయక్ భేటీ

KMM: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా బార్ కౌన్సిల్ బంజారా న్యాయవాదులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో బంజారా న్యాయవాదుల సమస్యలు, స్థానికంగా బంజారా సమాజానికి జరుగుతున్న అన్యాయాలపై చర్చించారు. అనంతరం న్యాయవాదులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు.

March 2, 2026 / 07:02 AM IST

పెండింగ్‌లో ఉన్న వేతనాలను విడుదల చేయాలి: రాజేందర్

MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో ఆదివారం సురేష్ ఆధ్వర్యంలో పంచాయతీ వర్కర్స్ యూనియన్ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా CITU జిల్లా కార్యదర్శి రాజేందర్ హాజరై, మాట్లాడారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పంచాయతీ కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు నష్టం కలిగించే జీవో 51ని సవరించాలని, MPW విధానాన్ని రద్దు చేయాలన్నారు.

March 2, 2026 / 07:02 AM IST

ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. ఎస్పీ ప్రెస్ మీట్

NLR: ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్‌లో ఆదివారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్పీ అజిత వాజెండ్ల తెలిపారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి రోగులను సురక్షితంగా ఇతర వార్డులకు తరలించారని తెలిపారు. ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని ఆందోళన చందవద్దు అని తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు.

March 2, 2026 / 07:02 AM IST

మోడల్ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్ జిల్లాలోనీ ధర్పల్లి మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో 2026 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల ప్రవేశ దరఖాస్తు గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 07:01 AM IST

నేడు రాహుల్ గాంధీ రాక.. భారీ పోలీస్ బందోబస్తు!

VKB: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వికారాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆదివారం పట్టణంలోని తేజ ఫంక్షన్ హాల్లో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ అధికారులు, సిబ్బందికి బందోబస్తుపై కీలక సూచనలు చేశారు.

March 2, 2026 / 07:01 AM IST

వేడుకగా నక్కలపల్లి హైస్కూల్ వార్షికోత్సవం

NLG: నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి జీ.ప.ఉ.పాఠశాల వార్షికోత్సవం ఆదివారం అత్యంత వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా భవన్ (హైదరాబాద్) డైరెక్టర్ బండ రమాదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థుల బహుముఖ ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రవిబాబు, డా. చిలుముల బాల్ రెడ్డి సహా టీచర్లు పాల్గొన్నారు.

March 2, 2026 / 07:01 AM IST

37 కరవు మండలాల్లో 50 అదనపు పనిదినాలు

AP: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సత్యసాయి, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లోని 37 కరవు ప్రభావిత మండలాల్లో ఉపాధిహామీ పథకం శ్రామికులకు అదనంగా 50 రోజుల పనిదినాలు కల్పించనుంది. ప్రస్తుతం అందిస్తున్న 100 పనిదినాలకు ఇవి అదనం. మార్చి 31 లోపు మొత్తం 150 పనిదినాలను వినియోగించుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

March 2, 2026 / 07:01 AM IST

రివార్డ్ పాయింట్ల పేరుతో జాగ్రత్త.. ఖాతా ఖాళీ అవ్వొచ్చు!

VKB: బ్యాంక్ రివార్డ్ పాయింట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారని బంట్వారం ఎస్సై విమల హెచ్చరించారు. “మీ రివార్డ్ పాయింట్ల గడువు ముగియబోతోంది.. వెంటనే నగదుగా మార్చుకోండి” అంటూ వచ్చే లింకులను నమ్మవద్దని సూచించారు. అప్రమత్తతతోనే సైబర్ నేరాలను అరికట్టవచ్చని, మోసపోతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు.

March 2, 2026 / 07:00 AM IST

కొల్లూరులో కార్డన్ సెర్చ్ నిర్వహణ

BPT: జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, ఆదివారం కొల్లూరులో పోలీసులు ‘కార్డన్ అండ్ సెర్చ్’ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 130 మంది సిబ్బంది పాల్గొని విస్తృత తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 70 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని డీఎస్పీ హెచ్చరించారు.

March 2, 2026 / 06:58 AM IST

హనుమాపురంలో వాహనాల తనిఖీ.. 17 మందికి జరిమానా!

KRNL: పెద్దకడబూరు మం. హనుమాపురం వద్ద ఆదివారం ఎస్సై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది వాహనదారులకు రూ. 3,995 జరిమానా విధించారు. హెల్మెట్ లేకపోవడం, లైసెన్స్ నిబంధనలు పాటించకపోవడంపై SI ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని ఆయన సూచించారు.

March 2, 2026 / 06:56 AM IST

వేట్లపాలెం ఘటనలో మరో ఇద్దరి మృతి

AP: కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీకేంద్రంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 22కి చేరింది. ఈ ఘటనలో గాయపడిన బాధితుల్లో సామర్లకోటకు చెందిన దర్శిపాటి పెదలోవరాజు, దర్శిపాటి రాజు మృతిచెందారు. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

March 2, 2026 / 06:55 AM IST

ఘనంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

BHPL: రేగొండ మండలం కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. నిన్న రాత్రి ఉత్సవమూర్తులు స్వామివారు, ఆండాళ్ అమ్మవార్లు గరుడ వాహనంపై అధిరోహించి మాడ వీధుల్లో ఊరేగారు. అనంతరం సదస్యము కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామి వారి కృపకు పాత్రులు అయ్యారు.

March 2, 2026 / 06:55 AM IST

రెడ్డిపాలెంలో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

BPT: చందోలు ఎస్సై శివకుమార్ నేతృత్వంలో పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం వద్ద ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని ఆయన సూచించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, మద్యం సేవించడం వంటివి చేయకూడదని, కార్లలో అనుమతి లేని వస్తువులను రవాణా చేయరాదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

March 2, 2026 / 06:55 AM IST

నేటి మంత్రి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన వివరాలను మంత్రి సిబ్బంది వెల్లడించారు. ఉదయం 9 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. 9:30 గంటలకు రామచంద్రపురం పార్టీ కార్యాలయంలో నందు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేస్తారు. 10:30 గంటలకు రామచంద్రపురంలో రోడ్లు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

March 2, 2026 / 06:55 AM IST

మహిళలకు ఉచిత మాస్టర్ టైలర్ శిక్షణ

అన్నమయ్య: రైల్వే కోడూరులో గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్, నారీ నైపుణ్యం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళలకు మాస్టర్ టైలర్ కోర్సులో ఉచిత శిక్షణ అందిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ శిక్షణలో టూల్ కిట్, ఇండస్ట్రియల్ కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వబడతాయని ట్రస్ట్ ఛైర్మన్ పార్థసారథి తెలిపారు. ఆసక్తి గల మహిళలు మార్చి 4వ తేదీ ఉదయం 10 గంటలలోపు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

March 2, 2026 / 06:54 AM IST