హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ మంగళవారం హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, జిల్లాలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఆకాంక్షించారు.
GDWL: మాజీ ఎమ్మెల్యే ఉప్పల గోపాల్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామని సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్ రావు పేర్కొన్నారు. ఆయన 33వ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని రాయల్ లాడ్జి దగ్గర ఉన్న విగ్రహానికి కుటుంబ సభ్యులు సిద్ధార్థ రెడ్డి, రఘునాథ్ రెడ్డితో కలిసి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
TG: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మించుకున్న భవనాలకు వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఆమె ధర్నా చేశారు. హైడ్రా జేసీబీలు వచ్చి ఆ నిర్మాణాలను కూల్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. దీంతో నార్సింగి పోలీసులు కవితను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
PDPL: కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీఆదివరాహస్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డుపై అక్షరాలు కనిపించకపోవడంతో దారి తెలియక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం పలు వాహనాల్లో వస్తున్న భక్తులు సూచిక బోర్డు కనిపించకపోవడంతో ఎక్కువ దూరం ముందుకెళ్లి తిరిగి వెనక్కి వస్తున్నారు.
PPM: పార్లమెంట్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యను తీసుకువెళ్లినట్లు కాంగ్రెస్ పార్టీ మన్యం జిల్లా డీసీసీ అధ్యక్షులు వంగల దాలినాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి జంఝావతి సమస్యతో పాటు జిల్లా నివేదిస్తున్న పలు సమస్యలు తీసుకువెళ్లానన్నారు.
AKP: ఆటో కార్మికులకు వాహన మిత్ర పథకం వెంటనే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &మోటార్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ )జిల్లా గౌరవ అధ్యక్షులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. మంగళవారం అనకాపల్లి ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో ఆటో సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారం చేయాలని కోరారు.
TPT: తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో నూతనంగా నిర్మించిన శ్రీ కామాక్షి సమేత అగస్తీశ్వరస్వామి ఆలయ మహా కుంబాభిషేకం శుక్రవారం ఉదయం 8 గంటలకు నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి YCP నాయకులు, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు పలువురిని ఆహ్వానించారు.
తూ.గో: గోకవరం పోలీసులు అక్రమంగా నాటుసారా రవాణా చేస్తున్న కలుం రాంబాబును మంగళవారం అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 35 లీటర్ల నాటుసారా, బైక్ స్వాధీనం చేసుకున్నారు. రంపచోడవరం మండలం పెనుకులపాడు గ్రామానికి చెందిన నిందితుడిని రాజమండ్రి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎస్సై పవన్ కుమార్ ఇవాళ తెలిపారు.
AP: భారత్‌లో పాక్షిక చంద్రగ్రహణం పూర్తికావడంతో తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. అర్చకులు మహాద్వారం, గర్భాలయ తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ శుద్ధి పుణ్యాహవచనం అనంతరం 8:30 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. కాగా, ఇవాళ మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమైన గ్రహణం సాయంత్రం 6:47 గంటలకు పూర్తయింది.
SKLM: జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్త, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు జిల్లాలో ప్రస్తుత పార్టీ పరిస్థితిలపై జగన్‌తో చర్చించారు. గ్రామస్థాయిలో వైసీపీని మరింత బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన తెలిపారు.
ఇటీవల టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో భారత సంతతికి చెందిన 21 ఏళ్ల సవితా షణ్ముగసముద్రన్ ఉన్నట్లు అమెరికా అధికారుల వెల్లడించారు. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతనికి బాధితులతో ముందే పరిచయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
CTR: రసాయ రహిత ఆహారం తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని RTC వైస్ ఛైర్మన్ మునిరత్నం పేర్కొన్నారు. AP రైతు సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలుదారుల మధ్య సంబంధం కోసం కుప్పంలో వ్యాపార సంబంధాల వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంతో పండించిన పలు ఉత్పత్తులను ప్రదర్శించారు.
BDK: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. గడిచిన రెండేళ్లలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేదలకు చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ “హనుమాన్” పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక వన్యప్రాణి సంరక్షక్ అవార్డు జిల్లాకు చెందిన మూర్తి కంటి మహంతిక దక్కింది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన కార్యక్రమంలో రాష్ట్ర ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆయనని పలువురు అభినందించారు.
KMM: వైరా మండలం విప్పలమడక రైతు వేదిక ఆవరణలో ప్రభుత్వ చెట్టుకు చెందిన చింతకాయలు దొంగిలించబడిన ఘటన పోలీస్ స్టేషన్‌కు చేరింది. మంగళవారం గ్రామ పంచాయతీ గుమస్తా ఎస్సై పవన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తిని తస్కరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించారు.