• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

అమలాపురంలో విద్యార్థినులకు కరాటేలో శిక్షణ

కోనసీమ: అమలాపురం పట్టణంలో జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాలతో కొంకాపల్లి హైస్కూల్‌‌లో విద్యార్థినులకు శుక్రవారం ఆత్మరక్షణలో భాగంగా కరాటేలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ వీరబాబు మాట్లాడుతూ.. విద్యార్థినులు తమ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లను గురించి వివరించారు. ఆటంకాలను ఎదుర్కోవడానికి మానసిక శారీరక దారుఢ్యం ఎంతో అవసరమన్నారు.

March 6, 2026 / 07:20 PM IST

OU నుంచి డాక్టరేట్ పట్టా పొందిన సుధాకర్

ASF: సిర్పూర్ (T) మండలం హుడ్కిలికి చెందిన సుధాకర్ OU నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. OU హిందీ విభాగం ప్రొఫెసర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో “అంతిమ్ దశక్ కె హిందీ కహానీయే మే కిన్నర్ విమర్శ” అనే అంశంపై ఆయన పరిశోధన పూర్తి చేశారు. ప్రస్తుతం రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్‌ను పలువురు అభినందించారు.

March 6, 2026 / 07:20 PM IST

డ్రగ్స్ రహిత సమాజం కోసం 5కే రన్: కలెక్టర్

ATP: అనంతపురం కలెక్టరేట్‌లో ‘నషా ముక్త్ యువ ఫర్ విక్సిత్ భారత్’ 5కే రన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. యువతలో మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 8వ తేదీన ఈ పరుగు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విజేతలకు రూ.11వేలు ప్రథమ బహుమతితో పాటు పలు నగదు పురస్కారాలు అందజేయనున్నట్లు కలెక్టర్ వివరించారు.

March 6, 2026 / 07:20 PM IST

హత్య కేసులో నిందితుడు అరెస్ట్

CTR: చిత్తూరు మండలం తుమ్మిందపాలెం గ్రామంలో ఆర్థిక వివాదం నేపథ్యంలో జరిగిన యువకుడి మృతి కేసులో నిందితుడు ఢిల్లీబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. గోపాలపురం బస్టాప్ వద్ద అతడిని అదుపులోకి తీసుకుని ఘటనలో ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

March 6, 2026 / 07:19 PM IST

విద్యార్థులకు GOOD NEWS

AP: విద్యార్థులకు RTC గుడ్ న్యూస్ చెప్పింది. పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లేందుకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. హాల్ టికెట్ చూపించిన ప్రతీ విద్యార్థి ఫ్రీగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి.

March 6, 2026 / 07:18 PM IST

ప్రజల నుంచి చెత్తను సేకరించిన స్వచ్ఛ రథం

AKP: ఎస్ రాయవరం మండలం గెడ్డపాలెం, వమ్మవరంలో స్వచ్ఛరథం శుక్రవారం చెత్తను సేకరించి ప్రజలకు అవసరమైన నిత్యవసర సరుకులను అందజేసింది. డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ మాట్లాడుతూ.. స్వచ్ఛరథం సేవలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. గ్రామాల పరిశుభ్రతకు స్వచ్ఛ రథం దోహదపడుతుందన్నారు. ప్రజలు పొడి చెత్తను స్వచ్చ రధానికి అందించి అవసరమైన నిత్యవసర సరుకులను తీసుకోవాలన్నారు.

March 6, 2026 / 07:17 PM IST

రెండు రోజులు ట్రాఫిక్ మల్లింపు: సీఐ

CTR: ఈనెల 10, 11న రెండు రోజులపాటు పుంగనూరులో అత్యంత వైభవంగా జరుగు శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు సంబంధించి పోలీసు శాఖ తరపున తీసుకున్న నిర్ణయాలను సీఐ సుబ్బరాయుడు తెలిపారు. ఇవాళ స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ మాట్లాడారు. ప్రజలకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నట్ల చెప్పారు.

March 6, 2026 / 07:17 PM IST

మెగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం దుడ్డికల్లు పంచాయతీ చింతలపాడు గ్రామంలో నిర్వహించిన మెగా వాలీబాల్ టోర్నమెంట్‌ను రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన జట్లను ఆయన అభినందించారు. క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా స్నేహభావాన్ని పెంచుతాయని చెప్పారు.

March 6, 2026 / 07:15 PM IST

ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యల వెల్లువ

W.G: ఆకివీడు మండల పరిషత్ సమావేశంలో సమస్యలను చెబుతున్నా పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు సర్పంచ్, ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఎంపీపీ కటారి జయలక్ష్మి అధ్యక్షతన మండల పరిషత్ సమావేశం నిర్వహించారు. రహదారులు, సాగునీరు తాగునీరు, తదితర అంశాలపై సమావేశం దృష్టికి తెచ్చారు. సమావేశాలు నామమాత్రంగా జరుగుతున్నాయని పలువురు పెదవి విరిచారు.

March 6, 2026 / 07:12 PM IST

సివిల్స్ విజేతలకు సీఎం రేవంత్ అభినందనలు

TG: యూపీఎస్సీ సివిల్స్ విజేతలకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న వారిలో 20 మంది ఎంపికయ్యారన్నారు. వీరిలో సృజన, తరుణ్, లక్ష్మీరచన, వెంకటేష్, కౌశిక్, ప్రీతి, విక్రం, విక్రమ్ సింహారెడ్డి, ఆశిష్, విజయసింహారెడ్డి, నవీన్, రాహుల్, శ్రవణ్ కుమార్, ప్రవీణ్, ఇస్లావత్ శ్రీరామ్, బానోత్ భరత్, ప్రత్యూష్ కట్టా, జితేందర్ నాయక్, దీపక్ శర్మ ఉన్నారు.

March 6, 2026 / 07:10 PM IST

కోటి మంది మహిళా వ్యాపారవేత్తలే లక్ష్యం: మంత్రి సీతక్క

NZB: మహిళలు ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోవాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. NZB సెక్యూరిటీ కౌన్సిల్ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవ నినాదం ‘గివ్ టు గైన్’ స్ఫూర్తితో మహిళలకు బాసటగా నిలవాలన్నారు. నక్సలైట్ నుంచి మంత్రి వరకు తన ప్రయాణానికి విద్యే మూలమని, రాష్ట్రంలో కోటి మంది మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చడమే లక్ష్యమన్నారు.

March 6, 2026 / 07:09 PM IST

‘రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి’

విజయనగరం మహిళా పోలీస్ స్టేషన్‌లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ ఆర్. గోవిందరావు శుక్రవారం తెలిపారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు వంటి అత్యవసర పరిస్థితుల్లో రక్త కొరతను తీర్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని కోరారు.

March 6, 2026 / 07:08 PM IST

రఘురామ టార్చర్ కేసులో IPS సునీల్ విచారణ

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ జరుగుతోంది. రెండో రోజు ఐపీఎస్ సునీల్ నాయక్‌ను 7 గంటలపాటు విజయనగరం ఎస్పీ దామోదర్ విచారించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈనెల 9వ తేదీ వరకు విచారణ కొనసాగనుంది.

March 6, 2026 / 07:07 PM IST

ప్రగతి ప్రణాళిక పరిశీలించిన MRO, ఎంపీడీవో

MDK: తూప్రాన్ మండలంలో ప్రారంభమైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను అధికారులు పరిశీలించారు. యావాపూర్ గ్రామంలో జరుగుతున్న ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించి, పనుల పురోగతిపై సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే నర్సంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం మహిళా భవనాల్లో చేపట్టిన శుభ్రత కార్యక్రమాలను ఎంపీడీవో సతీష్ తనిఖీ చేశారు.

March 6, 2026 / 07:07 PM IST

సన్నాహక సమావేశంలో పాల్గొన్న మంత్రి

కరీంనగర్ కలెక్టరేట్లో ఇవాళ ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం సన్నాహక సమావేశంలో జిల్లా ఇంఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

March 6, 2026 / 07:07 PM IST