• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

సప్తమి గౌడ ఉద్య‌మానికి శివ‌న్న మ‌ద్ద‌తు

హీరోయిన్స్‌ను  అనుచిత కోణాల్లో చిత్రీకరిస్తున్న తీరుపై కన్నడ నటి సప్తమి గౌడ #ActorsNotObjects పేరుతో ఉద్యమం ప్రారంభించింది. నటీమణులను వస్తువుల్లా కాకుండా కళాకారులుగా గౌరవించాలని ఆమె పిలుపునిచ్చింది. ఈ ఉద్యమానికి స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ మద్దతు తెలుపుతూ, మహిళలను గౌరవించడం మన సంస్కారమని, వారిని కేవలం శరీరంగా చూసే ధోరణి వెంటనే ఆగిపోవాలని స్పష్టం చేశారు.

March 7, 2026 / 12:38 PM IST

మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం

NDL: మిడుతూరు మండల సర్వసభ్య సమావేశం ఈనెల 12న జరుగుతుందని మండల పరిషత్ అధికారి దశరథ రామయ్య తెలిపారు. ఎంపీటీసీలు, సర్పంచులు, సంబంధిత అధికారులు తప్పక హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో మంచినీటి సమస్య, గృహ నిర్మాణ, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించి సమస్యలపై చర్చించడం జరుగుతుందని పేర్కొన్నారు.

March 7, 2026 / 12:36 PM IST

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ఎమ్మెల్యే బీర్ల

BHNG: తుర్కపల్లి మండలం వేల్పుపల్లి, నాగాయపల్లి గ్రామాల్లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. లబ్ధిదారులు కూరేళ్ల పద్మ–అశోక్, ధారవత్ మౌనిక ప్రవీణ్ దంపతులకు పట్టుబట్టలు, యాట పొట్టేలును బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలషనెరవేరుస్తామని ఎమ్మెల్యే అన్నారు.

March 7, 2026 / 12:36 PM IST

నెల్లూరు పరిధిలో అభివృద్ధి పనుల పరిశీలిన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 33వ డివిజన్, నేతాజీ నగర్, 3వ వీధిలో రూ.14 లక్షలతో నిర్మిస్తున్న సీ.సీ రోడ్డు పనులను కార్పొరేషన్ అధికారులు, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు శనివారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 33వ డివిజన్ అభివృద్ధికి రూ.3.52 కోట్ల నిధులు కేటాయించామన్నారు.

March 7, 2026 / 12:35 PM IST

డా. తుమ్మల దేవరావుకు బి.ఎన్. శాస్త్రి పురస్కారం

NRML: నిర్మల్‌కు చెందిన చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావుకు తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రకటించిన బి.ఎన్. శాస్త్రి ధర్మనిధి పురస్కారం లభించింది. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో రూ.5 వేల నగదు, జ్ఞాపికతో సత్కరించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రముకులు వారిని ఘనంగా అభినందించి సత్కరించారు.

March 7, 2026 / 12:33 PM IST

మృతదేహాన్ని ఒంటరిగా ఎందుకు వదలకూడదు?

హిందూ ఆచారం ప్రకారం మృతదేహాన్ని ఒంటరిగా వదలకూడదు. ఆత్మ శరీరాన్ని విడిచినప్పుడు దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించే ప్రమాదం ఉందని గరుడ పురాణం చెబుతోంది. మృతదేహం నుంచి వచ్చే ఒక రకమైన వాసనకు చీమలు, కీటకాలు లేదా ఎలుకలు వంటివి త్వరగా ఆకర్షితమవుతాయి. అలాగే ఆత్మ తన శరీరాన్ని చూస్తూ అక్కడే తిరుగుతుందని, అందరూ తన పక్కన ఉండటం వల్ల ఆ ఆత్మకు ప్రశాంతత లభిస్తుందని చెబుతారు.

March 7, 2026 / 12:33 PM IST

మావుళ్ళమ్మ అమ్మవారి జాతర.. ఎమ్మెల్యేకు ఆహ్వానం

E.G: సీతానగరం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర మహోత్సవంలో భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే సూచించారు.

March 7, 2026 / 12:32 PM IST

ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతున్న సిబ్బంది

RR: తొమ్మిదిరేకుల పెట్రోల్ బంక్‌లో కరెంట్ లేదని చెప్పి సేవలు నిలిపివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రశ్నించిన వినియోగదారులతో సిబ్బంది దురుసుగా మాట్లాడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రజలను గౌరవించని నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

March 7, 2026 / 12:31 PM IST

నూజివీడులో కార్డెన్ సెర్చ్ చేసిన పోలీసులు

ELR: నూజివీడులోని డాక్టర్ ఎంఆర్ అప్పారావు కాలనీలో శనివారం నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో 31 వాహనాలను సీజ్ చేసినట్లు DSP ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనిఖీల్లో గంజాయి మొక్క పెంచుతున్న ఓ మహిళపై, ఎక్సైజ్ చట్టం కింద మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు ఈ సోదాలు చేపట్టినట్లు వివరించారు.

March 7, 2026 / 12:30 PM IST

మద్దూరు ఆసుపత్రిలో చలివేంద్రం ప్రారంభం

NRPT: మద్దూరు మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకుల కోసం శనివారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కల్లపు రాకేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి జనార్ధన్ ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఆసుపత్రికి వచ్చే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

March 7, 2026 / 12:30 PM IST

జనసేన పార్టీ లో చేరిన మాజీ MLA

PPM: నాగూరు మాజీఎమ్మెల్యే నిమ్మక జయరాజు జనసేన పార్టీలో చేరారు. వనజ గ్రామంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జన సేన మండలాధ్యక్షుడు వి.శివకుమార్ చేతులమీదుగా సభ్యత్వం తీసుకున్నారు. APDCM , అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

March 7, 2026 / 12:29 PM IST

‘వైద్యం నిపుణుల సేవలు వినియోగించుకోవాలి’

SRCL: జిల్లాలో ఆరోగ్య కార్యక్రమంలో ప్రత్యేక వైద్య నిపుణుల సేవలు వినియోగించు కోవాలని DMHO ఎస్.రజిత కోరారు. అన్ని వయసుల వారికి ఆరోగ్య పరీక్ష చేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. నిర్దేశిత రోజుల్లో నాలుగు దశల్లో నిర్వహిస్తామని వివరించారు. ఈనెల 31 వరకు గర్భిణీలు, వృద్ధులకు రక్తహీనత పరీక్షలు చేస్తారని తెలిపారు.

March 7, 2026 / 12:29 PM IST

అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు

భారత్, శ్రీలంక, నేపాల్ దేశాల మధ్య విస్తరించిన భారీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను NCB అధికారులు ఛేదించారు. తమిళనాడు తూత్తుకుడిలో 78 కిలోల హ్యాష్ ఆయిల్, తెలంగాణ రాయికల్ వద్ద 2 కిలోల చరస్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ కేసులో శ్రీలంక జాతీయుడితో పాటు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

March 7, 2026 / 12:27 PM IST

పెద్దాపురంలో పోలీసులు కార్డెన్ సెర్చ్

KKD: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అపరిచితులు అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని పెద్దాపురం ఇంఛార్జ్ డీఎస్పీ సత్యనారాయణ హెచ్చరించారు. పెద్దాపురం శివారు సురంపాలెం రోడ్డు గల జగనన్న కాలనీలో శనివారం ఉదయం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేశారు.

March 7, 2026 / 12:26 PM IST

నీలమణి దుర్గ ఆలయంలో మహా చండీ శుభాభిషేకం

SKLM: హిరమండలం పెద్ద కోరడలోని నీలమణి దుర్గ ఆలయంలో మహా చండీ శుభాభిషేకం మహోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు భాస్కరభట్ల, వరప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు.

March 7, 2026 / 12:24 PM IST