• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మోడల్ స్కూల్ ప్రవేశాలు.. ఈనెల 10వరకే ఛాన్స్

MDK: రాష్ట్రవ్యాప్తంగా 194 మోడల్ స్కూళ్లలో 2026–27 ఏడాదిలో 6 నుంచి 10వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 10వ తేదీ వరకు గడువు ఉంది. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతోపాటు ఐఐటీ, జేఈఈ, నీట్, ఎంసెట్, టీపీటీ, సీఎస్ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

March 6, 2026 / 10:05 AM IST

ఆలయ పునఃనిర్మాణ భూమి పూజలో పాల్గొన్న MLA, MLC

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని RRO కాలనీలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC దండే విఠల్ శుక్రవారం పాల్గొన్నారు. అనంతరం వారు ఆలయ పునఃనిర్మాణ భూమి పూజకు విచ్చేసిన త్రిదండి శ్రీ రామచంద్ర రామానుజ జీయర్ స్వామి ఆశీర్వచాలు తీసుకున్నారు. వారి వెంట 6వ వార్డు కౌన్సిలర్ ఎమ్మాజీ శారద ఉన్నారు.

March 6, 2026 / 10:02 AM IST

‘దయనీయ స్థితిలో వృద్దురాలు.. పింఛన్ మంజూరు చేయాలి’

CTR: సదుం MRC వద్ద వెంకటమ్మ అలియాస్ చిన్న పాపమ్మ(90) దయనీయ జీవితం గడుపుతోంది. ఓటర్ కార్డు ఉన్నా రేషన్, ఆధార్ కార్డు లేక ఆమెకు పింఛన్ అందడం లేదు. ఎవరైనా తిండి పెడితే తింటూ ఇబ్బందులు పడుతోంది. పింఛన్ మంజూరు చేస్తే తనకు ఎంతో సహాయకరంగా ఉంటుందని ఆమె వేడుకుంటోంది. అధికారులు స్పందించి పింఛన్ వచ్చేలా చేయాలని పలువురు కోరుతున్నారు.

March 6, 2026 / 10:02 AM IST

రేపు జేఎన్టీయూకు రానున్న సీఎం

HYD: తెలంగాణ పోలీస్ ఉమెన్ సేప్టీ వింగ్ ఆధ్వర్యంలో స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని రేపు జేఎన్టీయూలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆయనతో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి పాల్గొననున్నారు.

March 6, 2026 / 10:01 AM IST

దవాఖానాల్లో 99 రోజుల ‘స్పెషల్’ ప్లాన్!

KMM: ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రారంభించినట్లు DMHO డా. రామారావు తెలిపారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల్లో పేరుకుపోయిన చెత్త, పాత ఫర్నిచర్, కాలం చెల్లిన మందులను తొలగించాలని ఆదేశించారు.

March 6, 2026 / 10:00 AM IST

కాకాణిని కలిసిన వైసీపీ నియోజకవర్గ పరిశీలకుడు

NLR: వైసీపీ సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిని అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో ఈ నియామకం జరిగిందని, సర్వేపల్లిలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చలపతి పేర్కొన్నారు.

March 6, 2026 / 10:00 AM IST

కమ్యూనిస్టులతోనే సమస్యల పరిష్కారం

MNCL: కమ్యూనిస్టులతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి అన్నారు. శుక్రవారం జన్నారం సీపీఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యవాదంతో ఇతర దేశాలపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. ప్రపంచానికి కమ్యూనిజమే ఆదర్శమని, ప్రజలలో సమానత్వాన్ని సాధించే ఏకైక మార్గం కమ్యూనిజమని అన్నారు.

March 6, 2026 / 09:56 AM IST

పాత కక్షలు.. వ్యక్తిపై కత్తితో దాడి

KMM: పాత కక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన కూసుమంచి మండలంలోని లోక్య తండాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామానికి చెందిన వడిత్య హేమ్లపై మస్తాన్, తేజవత్ నాగేంద్రబాబులు కాపుకాచి దాడికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన హేమ్లను చికిత్స నిమిత్తం స్ధానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘనటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 6, 2026 / 09:56 AM IST

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

AP: 15వ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది.

March 6, 2026 / 09:52 AM IST

హాస్టల్ నుంచి వెళ్లి లవ్ మ్యారేజ్.!

VKB: పర్మిషన్ లేకుండా హాస్టల్ నుంచి ఓ విద్యార్థిని వెళ్లిపోయిన ఘటన ఘట్‌కేసర్ PS పరిధిలో జరిగింది. SHO బాలస్వామి వివరాలిలా.. వికారాబాద్(D) ధారూర్‌కు చెందిన విద్యార్థిని(19) అంకుషాపూర్ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజీలో 2nd ఇయర్ చదువుతోంది. VKBలో ప్రియుడితో వివాహం చేసుకున్నట్లు లోకల్ PS నుంచి ఘట్‌కేసర్ ఠాణాకు సమాచారం అందించారు.

March 6, 2026 / 09:52 AM IST

ఫేస్ అటెండెన్స్ ఉపాధి హామీ కూలీలకు శాపం

SRCL: చందుర్తి మండలంలో ఉపాది హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు క్షేత్రస్థాయిలో కూలీలకు శావంగా మారుతున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రవేశపెట్టిన ఫేస్ అటెండెన్స్ విధానం అమలులో అధికారుల నిర్లక్ష్యం తోడవ్వడంతో కూలీలు గంటల తరబడి పనుల వద్దే ఉండాల్సి వస్తోంది.

March 6, 2026 / 09:50 AM IST

నొప్పులకు చెక్ పెట్టే ‘కప్పింగ్ థెరపీ’

కప్పింగ్ థెరపీ అనేది ఒక పురాతన ప్రత్యామ్నాయ వైద్య విధానం. ఇందులో చర్మంపై ప్రత్యేక కప్పులను ఉంచి ‘సక్షన్’ సృష్టిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కండరాల నొప్పులు, వాపులు తగ్గుతాయి. క్రీడాకారులు శారీరక దృఢత్వం కోసం దీనిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇది శరీరంలోని విషతుల్యాలను తొలగిస్తుంది. ఇందులో డ్రై, వెట్ (హిజామా) అనే రెండు పద్ధతులు ప్రాచుర్యంలో ఉన్నాయి.

March 6, 2026 / 09:50 AM IST

‘రేపు సుంకం వసూలకు బహిరంగ వేలం పాట’

ATP: గుంతకల్లు పట్టణంలోని దిన, వారపు మార్కెట్, జంతు వదుశాల చికెన్,మటన్ దుకాణాల నుంచి సుంకం వసూలు చేసుకునే హక్కు కల్పించేందుకు ఈ నెల 7న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మిదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ..రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఈ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

March 6, 2026 / 09:50 AM IST

వేములవాడలో శివ పార్వతుల కళ్యాణం

SRCL: వేములవాడలోని శివ కళ్యాణ వేదిక వద్ద బాంబు స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. మరి కాసేపట్లో శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రారంభం కానుండగా వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలో భద్రతా చర్యలలో భాగంగా జిల్లా బాంబ్ స్క్వాడ్ సిబ్బంది కళ్యాణ వేదికతో పాటు, భక్తులు కూర్చుండే ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.

March 6, 2026 / 09:49 AM IST

కాలవలో రాళ్లు.. మురుగునీరుతో ప్రజల అవస్థలు

BDK: మణుగూరు మున్సిపాలిటీ భగత్ సింగ్ నగర్‌లో సైడ్ డ్రైనేజ్ కాలవలో రాళ్లు అడ్డంగా ఉండడంతో మురుగు నీరుపోక చుట్టుపక్కల ప్రజలు దోమలు, మురుగు వాసనతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మున్సిపాలిటీ అధికారులకు పన్నుల మీద ఉన్న దృష్టి ప్రజల పనుల మీద లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కారించాలని వారు డిమాండ్ చేశారు.

March 6, 2026 / 09:47 AM IST