• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఇంటర్ పరీక్షలు

SRD: జిన్నారం మున్సిపల్‌లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరవ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయాన్నే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది.

March 4, 2026 / 09:19 AM IST

కోడలు పంపించిందని చెప్పి బంగారం చోరీ..!

VZM: బొబ్బిలి మున్సిపాలిటీలోని మల్లమ్మపేటలో నివాసముంటున్న కె.బంగారం మెడలోని 2 తులాల బంగారం పుస్తెలతాడును గుర్తు తెలియని వృద్ధురాలి అపహారించుకుపోయింది. పోలీసుల వివరాలు.. వృద్ధురాలి పెద్ద కోడలు ఓ టైలర్ షాపులో పని చేస్తోంది. తన కోడలు పంపించిందని పరిచయం చేసుకున్న మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును అపహారించింది. దీంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

March 4, 2026 / 09:15 AM IST

‘రాజకీయ కక్ష సాధింపు.. రాక్షసానందం పొందారు’

TG: ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ MLA బాల్క సుమన్ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. తనను అక్రమంగా జైల్లో పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడ్డారని, దీని ద్వారా కొందరు రాక్షసానందం పొందారని మండిపడ్డారు. ఎన్ని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని ఆయన పేర్కొన్నారు. చెన్నూర్ MLA వివేక్‌కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.

March 4, 2026 / 09:15 AM IST

కర్నూలు-కాచిగూడ రైళ్ల రద్దు

KRNL: కర్నూలు-కాచిగూడ మధ్య తిరిగే రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మహబూబ్ నగర్ నుంచి డోన్ వరకు రైల్వే డబ్బింగ్ పనులు జరుగుతున్నందున తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైల్వే అధికారి ఏ.శ్రీధర్ పేర్కొన్నారు. కర్నూలు-కాచిగూడ రైలు (17436)ను ఈనెల 8వ తేదీ వరకు, కాచిగూడ-కర్నూలు (17437)ను 7వ తేదీ వరకు రద్దు చేశామన్నారు.

March 4, 2026 / 09:13 AM IST

గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యం

BDK: మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో మంగళవారం గోదావరిలో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం బుధవారం లభ్యమైంది. మణుగూరు మల్లేపల్లి సింగరేణి పార్క్ సమీపంలోని గోదావరి తీరంలో గుండి నాగేశ్వరరావు మృతదేహాన్ని గుర్తించారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

March 4, 2026 / 09:12 AM IST

సాంఘిక కార్యకలాపాలు.. సీఐ హెచ్చరిక

కృష్ణా: గుడివాడలో బెట్టింగులు,పేకాట, వ్యభిచారం, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నంబర్ ప్లేట్లు లేని బైకులు, కార్లుకు గుడివాడలో అనుమతి లేదని తెలిపారు. సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన మంగళవారం విజ్ఞప్తి చేశారు.

March 4, 2026 / 09:12 AM IST

అక్రమ ఇసుక రవాణా.. 5 ట్రాక్టర్ల సీజ్

KNR: మానకొండూరు నుంచి రేకొండకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నామని చిగురుమామిడి ఎస్సై పృథ్వీధర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ట్రాక్టర్లను సీజ్ చేసి, యజమానులైన చింతకాయల రాజశేఖర్, అనిల్, కనుకట్ల రమేశ్, కీర్తి సంపత్, ముంజ రమేశ్ పై కేసు నమోదు చేశామని చెప్పారు. మండలంలో ఎక్కడైనా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే ఊరుకునేది లేదన్నారు.

March 4, 2026 / 09:12 AM IST

సాంకేతికతతో నేరస్థుల ఆటకట్టిస్తున్న క్లూస్ టీం

నెల్లూరులో చోరీలు, హత్యల వంటి కేసుల ఛేదనలో క్లూస్ టీం కీలక పాత్ర పోషిస్తోంది. వేలిముద్రలు, రక్త నమూనాల ఆధారంగా నిందితులను పట్టుకుంటున్నారు. ఇటీవల గూడూరు, నవాబుపేట పరిధిలోని దొంగతనాల కేసులను ఈ బృందం ఛేదించింది. 2025లో ఇప్పటివరకు 50 కేసులను పరిష్కరించారు. అధునాతన సాంకేతికతతో నేరస్తుల డేటాబేస్‌ను ఉపయోగించి వీరిని గుర్తిస్తున్నారు.

March 4, 2026 / 09:11 AM IST

నేటి నుంచి ఒంటిమిట్టలో సుందరకాండ

KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆవరణలో బుధవారం నుంచి 10వ తేది వరకు సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సుందరకాండ పారాయణం జరుగుతుందన్నారు. ఈ పారాయణాన్ని ఎం.ఎస్ రామారావు మనవడు డాక్టర్ శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

March 4, 2026 / 09:10 AM IST

మంచినీటి కోసం దిగి మహిళ గల్లంతు

BPT: అద్దంకి బ్రాంచ్ కెనాల్ పరిధిలోని 33వ మైలు వద్ద మంచినీరు తాగేందుకు దిగిన మహిళ నీటి ప్రవాహం వేగానికి కాలువలో కొట్టుకుపోయింది. వల్లాపల్లి గ్రామానికి చెందిన గుంటుపల్లి భవాని (28) మంగళవారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో పొలం నుంచి తిరిగి వస్తూ మంచినీరు తాగేందుకు కాలువలో దిగింది. ఈ సమయంలో నీటి ప్రవాహ వేగాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్త వివరాలు తెలియాల్సి ఉంది.

March 4, 2026 / 09:10 AM IST

ఈనెల 9న నంద్యాలలో చంద్రబాబు పర్యటన

AP: ఈనెల 9న నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. డోన్ మండలంలోని కొత్తబురుజులో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. అంతకుముందు రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు.

March 4, 2026 / 09:10 AM IST

బోర్డుకే పరిమితమైన క్రీడా ప్రాంగణం

MDK: గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన “క్రీడాప్రాంగణాలు” కేవలం నామమాత్రంగానే మిగిలిపోయాయి. రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణం నేడు క్రీడాకారులకు కాకుండా కేవలం బోర్డుకు పరిమితమైంది. అధికారులు కేవలం ఒక బోర్డు పాతేసి చేతులు దులుపుకొన్నారు.

March 4, 2026 / 09:10 AM IST

నేడు పురపాలక కౌన్సిల్ సమావేశం

PLD: ‎మాచర్ల పురపాలక సంఘం కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు జరగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణు బాబు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి హాజరుకానున్నారు. పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల అంశాలపై చర్చించనున్నారని తెలిపారు.

March 4, 2026 / 09:06 AM IST

రక్త దానంపై అపోహలు వద్దు: డీఎస్పీ

AKP: రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న ఎంతోమంది క్షతగాత్రులకు ప్రాణదాతలుగా మారే అవకాశం లభిస్తుందని నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. మంగళవారం నక్కపల్లి పోలీస్ స్టేషన్ వద్ద సీఐ జే.మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదానం చేయడం చాలా మంచి కార్యక్రమమని డీఎస్పీ చెప్పారు.

March 4, 2026 / 09:06 AM IST

నందవరం ఎస్సై తిమ్మారెడ్డి హెచ్చరిక

KRNL: మద్యం తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని మంగళవారం నందవరం ఎస్సై తిమ్మారెడ్డి హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ.. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతిరోజూ తనిఖీలు నిర్వహిస్తామని, ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించవద్దని కోరారు.

March 4, 2026 / 09:05 AM IST