• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో

అన్నమయ్య: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్‌కు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్రాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులను అభినందించారు.

February 28, 2026 / 05:28 PM IST

మల్దకల్‌లో ఇంటర్ ఇంగ్లీష్ 100 శాతం హాజరు

GDWL: మల్దకల్ కేంద్రంలో రెండవ సంవత్సరం ఆంగ్ల పరీక్షకు ఒక్కరు కూడా గైర్హాజరు కాకుండా అందరూ హాజరుకావడం గర్వకారణం అని సీఎస్ నరసింహులు, డిపార్ట్‌మెంటల్ అధికారి శేఖర్ సంతోషం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా, మొత్తం 64 మంది విద్యార్థులకు గాను 64 మంది పరీక్షకు హాజరయ్యారు.

February 28, 2026 / 05:28 PM IST

పెన్షన్లు పంపిణీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే

‎PLD: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు.

February 28, 2026 / 05:26 PM IST

బోయిన్పల్లిలో ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం

HYD: పౌల్ట్రీ ఇండియా ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో ప్రపంచ ప్రోటీన్ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దైనందిన ఆహారంలో ప్రోటీన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ మాట్లాడారు. గుడ్లు, చికెన్‌లో పుష్కలంగా లభించే ప్రోటీన్ శరీర నిర్మాణం, కండరాల బలానికి, రోగనిరోధక శక్తి పెంపుకు ఎంతో అవసరమని తెలిపారు.

February 28, 2026 / 05:26 PM IST

100% చెత్త సేకరణ జరగాల్సిందే: కమిషనర్

MDCL: 100% ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ జరగాల్సిందేనని సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్ సృజన కిందిస్థాయి అధికారులకు, స్వచ్ఛ ఆటో కార్మికులకు సూచించారు. ఏమాత్రం తేడా వచ్చినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గుండ్ల పోచంపల్లిలో పర్యటించి, చెరువు పరిసరాల అభివృద్ధి, వాకింగ్ ట్రాక్స్, గుర్రపు డెక్క తొలగింపు పై ఫోకస్ చేయాలన్నారు.

February 28, 2026 / 05:24 PM IST

“వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలి”

BHPL: TGలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో 22 లక్షల మంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని TRP మొగుళ్లపల్లి (M) అధ్యక్షులు రాజేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమని, ఫీజు ఒత్తిడితో ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. వెంటనే బకాయిలను విడుదల చేయాలన్నారు.

February 28, 2026 / 05:24 PM IST

ఇన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన.. మాజీ మంత్రి

JN: జఫర్గడ్ మండలం సాగరం గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు, ‘మా ఇల్లు’ ఆశ్రమ నిర్వాహకుడు గాదె ఇన్నయ్య తండ్రి గాదె సాల్మోన్ రెడ్డి (97) మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి MLA హరీష్ రావు, తొలి ఉపముఖ్యమంత్రి రాజయ్య ఇన్నయ్య నివాసానికి వెళ్లి ఆయన తండ్రి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

February 28, 2026 / 05:24 PM IST

‘పచ్చదనాన్ని పెంచేలా మొక్కల పెంపకం చేపట్టాలి’

కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ రహదారులు, ఆర్&బీ రహదారుల వెంట మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.

February 28, 2026 / 05:23 PM IST

విజయ్, రష్మిక పెళ్లిలో తరుణ్, ఈషా సందడి

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో దర్శకుడు తరుణ్ భాస్కర్, నటి ఈషా రెబ్బా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమ ప్రాణస్నేహితుల పెళ్లిలో వీరిద్దరూ సందడి చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈషా రెబ్బా సోషల్ మీడియాలో పంచుకున్న వివాహ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్నేహితుల బంధం, వేడుకలోని వీరి ఉత్సాహం అభిమానులను ఆకట్టుకుంటోంది.

February 28, 2026 / 05:23 PM IST

కివీస్ ప్లేయర్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

న్యూజిలాండ్ ప్లేయర్ డారిల్ మిచెల్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు అందుకున్నాడు. జనవరి నెలకు గాను ‘ICC ప్లేయర్ ఆఫ్ ది మంత్’గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు రేసులో నిలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్, ఇంగ్లండ్ స్టార్ జో రూట్‌ను వెనక్కి నెట్టి మిచెల్ ఈ అవార్డును గెలుచుకోవడం విశేషం. కాగా, మహిళల విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ శోభన మోస్తరీ ఈ అవార్డును దక్కించుకుంది.

February 28, 2026 / 05:21 PM IST

విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలి: కృష్ణ కుమార్

ADB: విద్యార్థులు శాస్త్రీయంగా రాణించాలని ప్రధానోపాధ్యాయుడు కొమ్ము కృష్ణ కుమార్ అన్నారు. సర్. సివి రామన్ జన్మదినాన్ని పురస్కరించుకొని బేల మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన శాస్త్ర సాంకేతిక కృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని కృష్ణకుమార్ పేర్కొన్నారు.

February 28, 2026 / 05:21 PM IST

ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు స్వాగతం పలికిన అదనపు కలెక్టర్

KMR: తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య శనివారం పిట్లం మండలంలో పర్యటించారు. మండలంలోని బుర్నాపూర్ గ్రామానికి వెళ్తున్న క్రమంలో పిట్లం చేరుకున్న ఆయనకు జిల్లా అధికార యంత్రాంగం స్వాగతం పలికింది. కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ఛైర్మన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగా ఆహ్వానించారు.

February 28, 2026 / 05:20 PM IST

చల్వాయి గ్రామంలో గ్రామసభ పై వివాదం

MLG: గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో నిర్వహించిన గ్రామసభ పై వివాదం చిరరేగింది. అయితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 7 రోజుల ముందు నోటీసు ఇవ్వకుండా, ఒక రోజు ముందు వాట్సాప్, మైకు ద్వారా సమాచారం ఇచ్చారని యువత ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు గ్రామసభ దగ్గరికి వెళ్లగా.. పాలకవర్గం లోపలే మీటింగ్ పెట్టుకుని సభ వాయిదా వేసిందని విమర్శించారు.

February 28, 2026 / 05:18 PM IST

మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్‌కు సన్మానం

RR: చేవెళ్ల మున్సిపల్ నూతన ఛైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డిలను ఇవాళ కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి ఎర్ర గోపాల్ యాదవ్, నరేందర్ రెడ్డి శాలువతో సన్మానించారు. మునిసిపల్ అభిరుద్దికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, టేకులపల్లి శ్రీనివాస్, యాదవ్, అశోక్, నరేష్, ఫరూఖ్ తదితరులు పాల్గొన్నారు.

February 28, 2026 / 05:17 PM IST

135 మంది గైర్హాజరు..!

TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బాటనీ పేపర్–II పరీక్షలు శనివారం నిర్వహించారు. జనరల్ కోర్సులో 5,033 మందికి గాను 4,930 మంది హాజరై, 103 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 1,090 మందికి గాను 1,058 మంది హాజరై, 32 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.

February 28, 2026 / 05:17 PM IST