• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

రాఘవాపురంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

SRPT: మోతె మండలం రాఘవాపురం గ్రామంలో సోమవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ​ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్ది భాస్కర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రేణుక, ఉపసర్పంచ్ గోపయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

March 2, 2026 / 01:46 PM IST

సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన హీరో దంపతులు

NGKL: బల్మూర్ మండలం తుమ్మన్‌పేటలో టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక దంపతుల సందడి కొనసాగుతోంది. సోమవారం తమ ఫామ్‌ హౌస్‌‌లో ఈ నూతన దంపతులు తులసి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించారు. ఈ వేడుకల కోసం సుమారు 400 మంది ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

March 2, 2026 / 01:44 PM IST

జిల్లాలో 375 మంది విద్యార్థులు గైర్హాజరు

PPM: మన్యం జిల్లాలో సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం మ్యాథ్స్ పరీక్షకు 375 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO నాగేశ్వరరావు తెలిపారు. జనరల్ విద్యార్థులు 2,794 మందికి 38 మంది, ఒకేషనల్ విద్యార్థులు 2,964 మందికి 337మంది పరీక్ష రాయలేదని వెల్లడించారు. మొత్తం 5758 మంది విద్యార్థులకు 5383 మంది హాజరు కాగా, 375 మంది గైర్హాజరు అయినట్లు తెలిపారు.

March 2, 2026 / 01:44 PM IST

‘ఇందిరమ్మ ఇళ్లతోనే పేదల సొంతింటి కల సాకారం’

MBNR: ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారానే పేదల సొంతింటి కల నిజమవుతోందని నగర డిప్యూటీ మేయర్ మరేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. 11వ డివిజన్ బండమీదిపల్లిలో కుర్వ శ్రీను-సుజాత దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ పథకం నిరుపేదలకు ఆత్మగౌరవాన్ని ప్రసాదిస్తోందని పేర్కొన్నారు.

March 2, 2026 / 01:42 PM IST

‘అభిషేక్ శర్మ ఆత్మవిశ్వాసంతో కనిపించట్లేదు’

T20 WC వేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అభిషేక్ శర్మ తనకు ఆత్మవిశ్వాసంతో కనిపించడం లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. ఇప్పటివరకు ఆడిన జట్ల కంటే సెమీస్‌లో తలపడే ఇంగ్లండ్ వేరే సవాల్ అని, వాళ్ల దగ్గర జాక్స్ వంటి ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే అభిషేక్‌ని సెమీస్ జట్టు నుంచి తప్పించకూడదని, అతను ఆటపై ఫోకస్ పెడితే చాలని కుంబ్లే సూచించాడు.

March 2, 2026 / 01:42 PM IST

‘రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలి’

శ్రీకాకుళం విలీన పంచాయతీ తోటపాలెంలోని డోలపేట గ్రామానికి రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. జెడ్పీలో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో సోమవారం అధికారులకు వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేయాలని సూచించారు. రోడ్డు పూర్తిగా పాడైందని చెప్పారు. అనేక సార్లు అధికారులు దృష్టికి సమస్య తీసుకువెళ్లినట్లు వివరించారు.

March 2, 2026 / 01:41 PM IST

తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు

KMM: బోనకల్ మండలం గోవిందాపురం గ్రామ పంచాయతీలో వేసవి తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. సోమవారం సర్పంచ్ ఇస్రం కరుణ ఆధ్వర్యంలో గ్రామంలోని పాడైన బోర్ పంపులకు మరమ్మతులు నిర్వహించారు. వార్డు సభ్యుడు గండమాల రాయప్ప, కార్యదర్శి రాయల నాగరాజు పర్యవేక్షణలో సిబ్బంది ఈ పనులు పూర్తి చేశారు.

March 2, 2026 / 01:41 PM IST

30 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

BHNG: రామన్నపేట మండల కేంద్రంలో రూ.10.00 లక్షల వ్యయంతో, జనంపల్లి గ్రామంలో రూ.20.00 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మెరుగైన రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

March 2, 2026 / 01:40 PM IST

ఇంటర్ పరీక్షలకు 244 మంది హాజరు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంటర్ పరీక్షలు 5వ రోజు మొత్తం 253 మంది విద్యార్థులకు హాల్ టికెట్లు కేటాయించగా, 244 మంది హాజరయ్యారు. 9 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

March 2, 2026 / 01:39 PM IST

‘2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?’

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే మోసం అని, ప్రజలను నమ్మించి వంచించడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. రాష్ట్ర యువతను నిరుద్యోగ భృతి, ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆమె SM వేదికగా విమర్శించారు.

March 2, 2026 / 01:39 PM IST

రంజాన్ స్పెషల్.. చార్మినార్ వద్ద ఫ్రీ పార్కింగ్

HYD: రంజాన్ సందర్భంగా చార్మినార్ సందర్శనకు వచ్చే వారే కాకుండా మక్కా మసీదులో నమాజు చేసేందుకు పెద్ద ఎత్తున వస్తారు. దీంతో స్థానికంగా పార్కింగ్ ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పంచ్ మహల్లా, జూలూఖానా, చార్మినార్ యునాని ఆస్పత్రి ప్రాంగణం, కుడా స్టేడియంలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. పార్కింగ్ సౌకర్యం వినియోగించుకోవాలన్నారు.

March 2, 2026 / 01:37 PM IST

రెండు బైకులు ఢీ.. ఒకరు మృతి

కాకినాడ రూరల్ 3వ డివిజన్ మూడు గుళ్ల కూడలి వద్ద సోమవారం ఉదయం రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడు కాకినాడ జగన్నాథపురం నుంచి వచ్చిన కొండమూరి రాజు (45)గా గుర్తించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

March 2, 2026 / 01:37 PM IST

లింగవారి గూడెం కు బస్సు సౌకర్యం

NLG: మునుగోడు మండలం లింగవారి గూడెంకు ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. మునుగోడు నుంచి లింగవారి గూడెం మీదుగా చౌటుప్పల్‌కు వెళ్లే పల్లె వెలుగు బస్సును సోమవారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రారంభించారు. ఆర్టీసీ మంత్రితో మాట్లాడి ఎమ్మెల్సీ బస్సును మంజూరు చేయించారు. అనుచరులతో కలిసి స్వయంగా బస్ టికెట్ తీసుకుని గూడెం వరకు ప్రయాణించారు.

March 2, 2026 / 01:36 PM IST

కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరించిన జాయింట్ కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు జరిగాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను జాయింట్ కలెక్టర్ సీ. విష్ణుచరణ్ స్వయంగా విన్నారు. భూ సమస్యలు, ఇతర సామాజిక పింఛన్ల వినతులను ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ పాల్గొన్నారు.

March 2, 2026 / 01:35 PM IST

గణపవరంలో సీపీఎం ప్రజా చైతన్య పాదయాత్ర

ELR: ఎమ్మెల్యేలు ఏసీ గదుల్లో కాదు ప్రజా క్షేత్రంలోకి వస్తే దోమల బెడద తెలుస్తుందని సీపీఎం జిల్లా కార్యదర్శి జే.ఎన్.వి గోపాలన్ అన్నారు. సీపీఎం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్రజా చైతన్య పాదయాత్ర సోమవారం గణపవరం మండలంలో గణపవరం, వరదరాజుపురం, అర్థవరం, ముగ్గళ్ళ, పిప్పర, చిలకంపాడు మీదుగా సాగింది. దోమల బెడద పడలేకపోతున్నామని ప్రజలు పాదయాత్ర బృందం ముందు వాపోయారు.

March 2, 2026 / 01:34 PM IST