• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోలీస్ స్టేషన్‌లో సంతాప సభ

VKB: ధారూర్ సర్కిల్ కార్యాలయంలో CI రైటర్‌గా పనిచేస్తూ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న దివ్య మృతిపై పోలీస్ శాఖ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దివ్య ఫొటోకు CI రఘురాం, SI సున్నం రాఘవేందర్ పోలీస్ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ రెండు నిమిషాల మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

March 10, 2026 / 07:20 PM IST

2027 వన్డే ప్రపంచకప్.. గంభీర్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచకప్ 2026ను టీమిండియా కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ దృష్టంతా 2027 వన్డే ప్రపంచకప్ మీదే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. IPL 2026 ముగిసిన తర్వాత వన్డే వరల్డ్ కప్ సన్నాహకాలు ప్రారంభమవుతాయని తెలిపాడు. అప్పుడే బ్లూ ప్రింట్ సిద్ధం అవుతుందని వెల్లడించాడు. ఎంత త్వరగా సన్నాహకాలు ప్రారంభిస్తే అంత మంచిదని చెప్పుకొచ్చాడు.

March 10, 2026 / 07:20 PM IST

మియాపూర్ మెట్రో డిపోలో అగ్ని ప్రమాదం

HYD: మియాపూర్ మెట్రో డిపో సమీపంలోని ఎస్ఎస్ ట్రాన్స్‌కో సబ్ స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న కూకట్‌పల్లి అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం కారణంగా మెట్రో డిపోకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, అక్కడ జరగాల్సిన పలు పనులు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

March 10, 2026 / 07:20 PM IST

‘ప్రజాపాలనపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలి’

KNR: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 12న సర్పంచ్‌లు, మున్సిపల్ వార్డు సభ్యులు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై కలెక్టర్ చిత్రా మిశ్రా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమాల పాత్ర కీలకమని పేర్కొన్నారు.

March 10, 2026 / 07:15 PM IST

‘మహిళల భద్రత, స్వావలంబన కోసం ఉమెన్స్ హాస్టల్’

MLG: మహిళల భద్రత, స్వావలంబన కోసం హైదరాబాద్‌లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. యూసఫ్‌గూడలో ప్రభుత్వ వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవన నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ హాస్టల్స్ పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చే అనేక మహిళలకు భద్రమైన వసతి లభిస్తుందన్నారు.

March 10, 2026 / 07:13 PM IST

‘ఉద్యాన శాఖలు రైతుల ఆదాయం పెంచేలా పనిచేయాలి’

BHPL: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతుల ఆదాయాన్నిపెంచేలా, వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడే సమగ్ర కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ రాహుల్ శర్మ వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. ఇవాళ ఐడీవోసీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పామాయిల్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

March 10, 2026 / 07:12 PM IST

కెమికల్ పార్కులపై వివరణ కోరిన ఎంపీ సాన

KKD: కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన డెడికేటెడ్ కెమికల్ పార్కులపై వివరణ ఇవ్వాలని కాకినాడ MP సాన సతీశ్ రాజ్యసభలో కోరారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ   పార్కుల ఏర్పాటు విధానం, రాష్ట్రాల ఎంపిక ప్రక్రియ గురించి ప్రశ్నించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పార్కుల కేటాయింపు వివరాలు తెలియజేయాలని రాజ్యసభలో డిమాండ్ చేశారు

March 10, 2026 / 07:12 PM IST

‘తిరుమల శ్రీవారి దర్శనానికి నిర్దేశిత సమయానికే అనుమతి’

TPT: స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లు, రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులను వారికి కేటాయించిన స్లాట్ సమయానికే క్యూలైన్లలోకి అనుమతిస్తామని టీటీడీ స్పష్టం చేసింది. సోమవారం నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది. భక్తులు ముందుగానే వచ్చి ఇబ్బంది పడకుండా, తమకు కేటాయించిన సమయానికే చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

March 10, 2026 / 07:11 PM IST

కసాపురం ఆలయంపై దుష్ప్రచారం.. ప్రభుత్వం కీలక ప్రకటన

ATP: గుంతకల్లు మండలం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగమ సలహాదారులు, వైదిక కమిటీ సూచనల మేరకు పాత ఆలయాన్ని తొలగించి, నూతన నిర్మాణ పనులు చేపట్టారని పేర్కొంది. తప్పుడు వీడియోలతో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

March 10, 2026 / 07:10 PM IST

‘హెచ్ఎంను సస్పెండ్ చేయాలి’

BDK: మణుగూరు పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో విద్యార్థులు రాత్రి విషపూరిత ఆహారం తినడంతో అస్వస్థత గురై ఆస్పత్రిలో చేరారు. ఆసుపత్రిలో ఉన్న విద్యార్థినిలను ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పరామర్శించారు. అనంతరం వసతి గృహం CRO, RCO అధికారులను కలిసి హెచ్ఎం‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

March 10, 2026 / 07:10 PM IST

రేపు గోకవరంలో HPV వ్యాక్సినేషన్

E.G: గోకవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రేపు ఉదయం 11 గంటలకు HPV వ్యాక్సిన్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు సామాజిక ఆరోగ్య కేంద్ర ప్రధాన వైద్యులు డా. తిరన్ తెలిపారు. 14 ఏళ్లు నిండిన ప్రతి బాలిక ఈ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలన్నారు. గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఈ టీకా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

March 10, 2026 / 07:09 PM IST

శతాధిక కవి రామిశెట్టి రోషయ్యకు ఘన సన్మానం

KMM: మధిరలో వంద సంవత్సరాల వయస్సు గల ప్రముఖ కవి రామిశెట్టి రోషయ్యను మంగళవారం ఆయన స్వగృహంలో సాహిత్య వేత్తలు ఘనంగా సత్కరించారు. ఇటీవల ఖమ్మంలో వెలువడిన “నూరేళ్ల అరుణ కేతనం” కవితా సంకలనంలో ఆయన రచించిన “గర్జించిన ఎర్రజెండ” కవిత ప్రచురితమైంది. వయోభారం కారణంగా కవిసమ్మేళనానికి హాజరు కాలేకపోవడంతో ప్రత్యేకంగా వెళ్లి సన్మానం చేశారు.

March 10, 2026 / 07:09 PM IST

రాజంపేటలో టీడీపీ సమన్వయ సమావేశం

అన్నమయ్య: రాజంపేట మున్సిపాలిటీలో సమన్వయంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరవేయాలని నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పట్టణ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వార్డుకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

March 10, 2026 / 07:06 PM IST

ఆరోగ్య శ్రీ పై సీఎం చంద్రబాబుకు వర్మ ఫిర్యాదు

KKD: YCP ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు వేలకోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డాయని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మంగళవారం CM చంద్రబాబును కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ కొన్ని ఆస్పత్రులు దోపిడి చేస్తున్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ కోసం రూ. 4500 కోట్లు విడుదల చేసిందన్నారు.

March 10, 2026 / 07:05 PM IST

ఈనెల 12న మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్లకు శిక్షణ

NLG: ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’లో భాగంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఈనెల 12న జిల్లా కేంద్రంలో ఇవ్వనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీ. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధామ్య పథకాలపై ఈ శిక్షణ కార్యక్రమాన్ని యున్నట్లు తెలిపారు.

March 10, 2026 / 07:04 PM IST