• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

పోతంగల్ నూతన తహసీల్దార్ రంజిత్

NZB: పోతంగల్ నూతన తహసీల్దార్‌గా రంజిత్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గంగాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలందిస్తానని తెలిపారు. కార్యాలయంలో ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

March 9, 2026 / 08:27 PM IST

మత్తు పదార్థాల నిర్మూలనపై అవగాహన

ములుగు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో మత్తు పదార్థాల నిర్మూలనపై జిల్లాస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. సిద్ధార్థ రెడ్డి విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి పాఠశాలలో ప్రహరీ క్లబ్బులను ఏర్పాటు చేసి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని తెలిపారు.

March 9, 2026 / 08:27 PM IST

పోలీసులు అప్‌గ్రేడ్ కావాలి: రేవంత్

TG: 24 గంటల్లో 2 సెంమీ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే డ్రైనైజీ వ్యవస్థ మన నగరాలకు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టెక్నాలజీలో మార్పుల వల్ల నేరాల స్వభావం కూడా మారిపోయిందన్నారు. భౌతికంగా కనిపించని నేరాలను కనిపెట్టడం సవాళ్లతో కూడుకున్నదన్నారు. కొత్త సవాళ్లను ఎదుర్కోవాలంటే.. పోలీసులు అప్ గ్రేడ్ కావాలన్నారు.

March 9, 2026 / 08:26 PM IST

రామగుండం ఐటీఐలో షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభం

PDPL: రామగుండం గవర్నమెంట్ ఐటీఐలో నిర్వహించిన ఏటీసీ షార్ట్ టర్మ్ కోర్సుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, మేయర్ మహంకాళి స్వామి హాజరయ్యారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఇలాంటి కోర్సులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

March 9, 2026 / 08:25 PM IST

‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం’

JN: రఘునాథపల్లి, ఎల్లారెడ్డిగూడెం, దాసన్నగూడెం గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి గ్రంథాలయ చైర్మన్ రాంబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు భూమి పూజ చేశారు. చైర్మన్ రాంబాబు మాట్లాడుతూ… మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ ముందుకు వెళుతుందని, రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు.

March 9, 2026 / 08:25 PM IST

శ్రీలంక కొత్త క్రికెట్ కోచ్‌గా గ్యారీ కిర్‌స్టన్

శ్రీలంక పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా సౌతాఫ్రికా మాజీ దిగ్గజం గ్యారీ కిర్‌స్టన్ నియమితులయ్యారు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన T20 WC-2026లో శ్రీలంక జట్టు సూపర్-8 లోనే వెనుదిరిగింది. దీంతో జట్టు ఓటమికి బాధ్యత వహిస్తూ కోచ్ పదవికి సనత్ జయసూర్య రాజీనామా చేశారు.

March 9, 2026 / 08:24 PM IST

‘కుష్ఠు/బోద వ్యాధుల నివారణపై ప్రజలను చైతన్య పరచాలి’

ASF: కళాజాత ప్రదర్శనల ద్వారా జిల్లాలో కుష్ఠు/బోద వ్యాధుల నివారణపై ప్రజలను చైతన్య వంతులను చేయాలని కలెక్టర్ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో జిల్లాలో కుష్ఠు/బోద వ్యాధులపై అవగాహన కోసం కళాజాత ప్రదర్శన రథాన్ని కలెక్టర్ ప్రారంభించారు.

March 9, 2026 / 08:23 PM IST

నాడు కేసీఆర్ ప్రారంభించారు: హరీష్ రావు

TG: సిద్ధిపేటలో ప్రారంభమైన ఇఫ్తార్ విందులు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్ధిపేట మినార్ ఈద్గా మైదానంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న హరీష్ రావు.. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగించారన్నారు. ముస్లిం మైనార్టీ గురుకులాలను కేసీఆర్ ప్రారంభించారన్నారు.

March 9, 2026 / 08:22 PM IST

HPV టీకా అవగాహన బ్యానర్ ఆవిష్కరణ

TPT: గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు 14 సంవత్సరాల బాలికలకు అందించనున్న HPV టీకా అవగాహన బ్యానర్‌ను కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ టీకా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. బాలకృష్ణ నాయక్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా. శాంతకుమారి పాల్గోన్నారు.

March 9, 2026 / 08:20 PM IST

యుద్దం ఎఫెక్ట్.. గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు

శ్రీకాకుళం నగరంలో గ్యాస్ సిలెండర్ల కోసం వినియోగ దారులు గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు పెడుతున్నారు. గల్ఫ్ యుద్ధం కారణంగా వంట గ్యాస్ దొరకదనే పుకార్లు షికారు చేస్తుండటంతో ‘పానిక్ బుకింగ్స్’కి జనం ఎగబడుతున్నారని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులకు చెబుతున్నారు. అయితే జిల్లాలో వంట గ్యాస్‌కి కొరత లేదని, సిలిండర్ 25 రోజులకు ఒకసారి బుకింగ్ చేసుకోవాలన్నారు

March 9, 2026 / 08:20 PM IST

ఉపవాస దీక్షపరులకు ఇఫ్తార్ విందు

ATP: రంజాన్ మాసం సందర్భంగా గుత్తి జామియా మసీదులో సోమవారం జామియా మసీదు కమిటీ సభ్యుడు ఖురేషి అన్వర్ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షపరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా హాజరయ్యారు. ఉపవాస దీక్షాపరులకు పండ్లు, ఫలహారాలు ఇచ్చి దీక్షను విరామించారు. ముందుగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

March 9, 2026 / 08:20 PM IST

పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

కృష్ణా: పదో తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో జిల్లాలో విద్యార్థుల సౌకర్యార్థం APSRTC ఉచిత బస్ సర్వీస్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్షల రోజుల్లో విద్యార్థులు తమ నివాస ప్రాంతం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ చూపించి బస్సుల్లో ఎటువంటి చార్జీ లేకుండా ప్రయాణించవచ్చని పేర్కొన్నారు.

March 9, 2026 / 08:19 PM IST

అభిషేక్ ఫామ్‌పై ఇషాన్ కీలక వ్యాఖ్యలు

టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేయడంలో టీమిండియా ప్లేయర్లు అభిషేక్ శర్మ, ఇషాన్‌ కిషన్ కీలక పాత్ర పోషించారు. అభిషేక్ గత కొంత కాలంగా పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఇషాన్ కిషన్ స్పందింస్తూ.. ‘అరే భాయ్‌ నువ్వు కేవలం ఒక్క నెల మాత్రమే ఫామ్‌లో లేవు. నేను గత రెండేళ్లు జట్టులో లేను’ అని సరదా వ్యాఖ్యానించాడు.

March 9, 2026 / 08:18 PM IST

కాంస్య పతకం సాధించిన భాస్కర్‌కు కలెక్టర్ సత్కారం

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ ప్యారా గేమ్స్‌లో రాష్ట్ర స్థాయి వీల్‌చైర్ క్రికెట్ పోటీలలో కాంస్య పతకం సాధించిన బుర్ర భాస్కర్‌ను సోమవారం కలెక్టరేట్లో సత్కరించారు. మోతె గ్రామానికి చెందిన భాస్కర్, 2025లో జరిగిన ఈ పోటీలలో జిల్లాకు గౌరవం తెచ్చారు. కలెక్టర్ ఆయన ప్రతిభను ప్రశంసిస్తూ మరిన్ని విజయాలు సాధించాలన్నారు.

March 9, 2026 / 08:18 PM IST

సంగెంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన

WGL: సంగెం మండలంలో కేజీబీవి, యుఆర్ఎస్, సమగ్ర శిక్షా సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజన్ ప్రసాదరావు డిమాండ్ చేశారు. సోమవారం సంగెం మండల కేంద్రంలోని కేజీబీవీ, ఎంఆర్సీ కేంద్రాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని కోరారు.

March 9, 2026 / 08:18 PM IST